Chiranjeevi ప్రశంస గొప్ప అనుభూతి.. 45 నిమిషాలు ఆయనతో అంటూ.. సుధాకర్ కోమాకుల ఎమోషనల్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో నాగరాజు పాత్రతో ప్రేక్షకులకు చేరువైన సుధాకర్ కోమాకుల విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన క్రాక్ చిత్రంలో కానిస్టేబుల్ పాత్రలో విశేషంగా తన ప్రతిభతో ఆకట్టుకొన్నారు. ప్రస్తుతం కార్తీకేయ గుమ్మకొండ నటించిన రాజా విక్రమార్క చిత్రంలో ఏసీపీ గోవింద్‌గా ఓ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా నవంబర్ 12వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియాతో సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ..

నా భార్య హారికతో చేసిన డ్యాన్స్ వైరల్‌గా
చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకొని ఛాలెంజ్ సినిమాలోని ఇందువదన పాటకు నేను, నా భార్యతో చేసిన డ్యాన్స్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఎవరిని అడగపోయినా మీడియా, టెలివిజన్, యూట్యూబ్ ఛానెల్స్ నా వీడియోను బాగా ప్రచారం చేశారు. అందుకు నా మీడియాకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని సుధాకర్ కొమాకుల తెలిపారు.

చిరంజీవి ప్రశంసతో గొప్ప అనుభూతిని పొందా
ఇందువదన వీడియో పాటను చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో మెసేజ్ పెట్టారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలువాలని చెప్పారు. న్యూ ఇయర్ సమయంలో నేను హైదరాబాద్‌కు వచ్చి చిరంజీవి గారికి మెసేజ్ పెట్టాను. దాంతో ఆయనను కలిసేందుకు అపాయింట్‌మెంట్ లభించింది. మేనేజర్ ద్వారా టైమ్ తీసుకొని ఒక సండే రోజు కలిశాం. సాధారణంగా సండే ఎవరికి అపాయింట్‌మెంట్ ఇవ్వరు. కానీ ఆయన సమయాన్ని మాకు ఇవ్వడం గొప్ప అనుభూతి. దాదాపు 45 నిమిషాలు చిరంజీవితో గడిపే అవకాశం కలిగింది అని సుధాకర్ కోమాకుల చెప్పారు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత మంచి పాత్రలు వేసినా గుర్తింపు రాలేదు. అందుకు రకరకాల కారణాలు ఉంటాయి. ఇంకా లైప్ ఈజ్ బ్యూటిఫుల్ నాగరాజుగానే గుర్తింపు ఉంది. రాజా విక్రమార్క సినిమాలోని పాత్ర మంచి గుర్తింపు తెస్తుంది. ప్రస్తుతం కొత్త ఆలోచనలతో దర్శకులు వస్తున్నారు. మంచి మంచి పాత్రలు రాస్తున్నారు. పరిశ్రమకు ఇది మంచి పరిణామం అని సుధాకర్ కోమాకుల తెలిపారు.

రాజా విక్రమార్కలో కీలక పాత్ర
ఇక రాజా విక్రమార్క సినిమా దర్శకుడు శ్రీ సరిపల్లితో నాకు 10 ఏళ్ల అనుబంధం ఉంది. అమెరికాలో షార్ట్ ఫిలింస్ చేశాడు. కెరీర్ పరంగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే సమయంలో కలిసే వాళ్లం. ఆ తర్వాత శ్రీ సరిపల్లి అమెరికాలో ఓ సినిమా చేయాల్సి వచ్చింది. దాంతో మా మధ్య మరింత రిలేషన్ పెరిగింది. ఆ సమయంలో రాజా విక్రమార్క సినిమాలో ఓ పాత్ర ఆఫర్ ఇచ్చారు. అయితే నేను లీడ్ రోల్స్ చేస్తున్నాను. ఈ సినిమా చేయడం సరికాదేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశా. కానీ శ్రీ సరిపల్లి రోల్ బాగుంది. నీకు మంచి పేరు వస్తుందని చెప్పడంతో చేశాను. ఆ తర్వాత క్రాక్ సినిమా కూడా చేయడం మంచి పేరు రావడం జరిగింది అని సుధాకర్ కోమాకుల వివరించారు.
Recommended Video

సుధాకర్ కోమాకుల కెరీర్ ఇలా..
నేను ప్రస్తుతం జీడీ (గుండెలో దమ్ముంటే) అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నా. హీరోగా 'నారాయణ అండ్ కో' చేస్తున్నాను. అందులో మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తా. హీరోగా 'జీడీ' (గుండెల్లో దమ్ముంటే) అని మరో సినిమా చేస్తున్నాను. ఆర్మీకి వెళ్లాలని అనుకునే ఫ్రస్టేటెడ్ యంగ్‌స్టర్ రోల్. ఆ కథ ఒక్క రాత్రిలో జరుగుతుంది. మరో సినిమా కూడా ఓకే అయ్యింది. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తాను. మంచి సినిమాలు, ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నా. యువ దర్శకులు నాకు తగ్గ కథలు రాస్తున్నారు. సుఖ మీడియా... పేరుతో బ్యానర్ స్టార్ట్ చేశా. మంచి కథలు వస్తే మా భాగస్వామ్యంతో సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నాను. ఒక ఇండిపెండెంట్ సాంగ్ చేశా. అందులో నాకు జోడీగా '30 వెడ్స్ 21' ఫేమ్ అనన్య నటించారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ చేశారు. 'గాలి సంపత్' నిర్మాత సాయికృష్ణ ప్రొడ్యూస్ చేశారు. త్వరలో ఆ పాట విడుదల అవుతుంది అని తెలిపారు.


Click it and Unblock the Notifications











