Sridevi పేరును అందుకే వాడుకొన్నాం.. సోడా సెంటర్ కిక్కు అలా.. హీరో సుధీర్ బాబు
కరోనా సెకండ్ వేవ్ లాక్‌డౌన్ తర్వాత మంచి క్రేజ్‌తో, భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. పలాస 1978 చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న దర్శకుడు కరుణ కుమార్. ఇప్పటికే తనదైన నటనతో దూసుకుపోతున్న సుధీర్ బాబు, కొత్త హీరోయిన్ ఆనంది హీరో, హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం ఆగస్టు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో హీరో సుధీర్ బాబు తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఈ సినిమా గురించి సుధీర్ బాబు ఏం చెప్పారంటే..

కరోనా పరిస్థితులు మెరుగు పడిన తర్వాత శ్రీదేవీ సోడా సెంటర్ సినిమా రిలీజ్ అవుతుండటం కొంత నెర్వస్‌గా ఉంది. ఇటీవల కాలంలో మంచి కంటెంట్‌తో వచ్చిన చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ కనిపించింది. మా శ్రీదేవి సోడా సెంటర్‌కు కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం అని హీరో సుధీర్ బాబు అభిప్రాయపడ్డారు.
సినిమా పరిశ్రమకు ఓటీటీ ముప్పు కాదు. దాని వల్ల మరింత బిజినెస్ జనరేట్ అవుతున్నది. కొత్త దర్శకులు, నిర్మాతలకు, నటీనటులకు ఓటీటీ మంచి అవకాశం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది.
నేను ఫిట్‌నెస్‌పై ఎప్పుడూ దృష్టిపెడుతాను. ఈ సినిమా కోసం ఓ సీన్‌లో సిక్స్ ప్యాక్ చూపిద్దామని అనుకొన్నాం. కానీ కొన్ని కారణాల వల్ల మొత్తం సినిమాలో కంటిన్యూ చేయాల్సి రావడంతో కొంచెం కష్టపడాల్సి వచ్చింది అని సుధీర్ బాబు తెలిపారు.

టెక్నికల్ విభాగాల విషయానికి వస్తే.. కథ డిమాండ్ మేరకే పేరున్న టెక్నిషియన్స్‌ను తీసుకొన్నాం. శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేశారు. మణిశర్మ మ్యూజిక్ మరోసారి మంచి వర్క్ చేశారు. ఈ సినిమాలో బెస్ట్ సాంగ్స్ ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా చేశారు.
శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో తెలుగు అమ్మాయి ఆనంది బాగా చేసింది. శ్రీదేవి పేరు పెట్టినా ఒరిజినల్‌గా శ్రీదేవికి ఎలాంటి సంబంధం ఉండదు. సినిమాలో నరేష్‌కు శ్రీదేవి అంటే ఇష్టం. అందుకే తన కూతురు, షాప్‌కు అలాంటి పేరు పెట్టుకొంటాడు అని సుధీర్ బాబు ఓ ప్రశ్నకు సమాధానం సుధీర్ తెలిపారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు : సుధీర్ బాబు. ఆనంది, పావెల్ నవగీతన్, నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్షవర్ధన్
దర్శకుడు : కరుణ కుమార్
నిర్మాతలు : విజయ్ చిల్లా , శశి దేవిరెడ్డి
సంగీత దర్శకుడు : మణిశర్మ
ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: శ్యామ్ దత్
రిలీజ్ డేట్: 2021-08-21


Click it and Unblock the Notifications











