ఆయనతో ఒక్క సినిమా కాదు.. 100 సినిమాలైనా చేస్తా.. సుధీర్‌బాబు

By Rajababu

Recommended Video

Sudheer Babu Exclusive Interview With Filmibeat

సూపర్‌స్టార్ల కుటుంబ నేపథ్యంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరో సుధీర్‌బాబు తనదైన శైలిలో రాణిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రేమ కథా చిత్రం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, హిందీలో భాగీ లాంటి చిత్రాలు ఆయన ప్రతిభకు, అంకితభావానికి అద్దం పట్టాయి. ఇప్పటి వరకు థ్రిల్లర్, యాక్షన్ చిత్రాల్లో నటించిన సుధీర్ బాబు తాజాగా సమ్మోహనం చిత్రంతో ముందుకు వస్తున్నారు. బాలీవుడ్ నటి అదితిరావు హైదరీ తొలిసారి తెలుగులో నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. జెంటిల్మన్ చిత్రాన్ని రూపొందించిన శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రం జూన్ 14న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో సుధీర్ బాబు తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. సుధీర్ బాబు చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

నా తొలి చిత్రం తర్వాతే

నా తొలి చిత్రం తర్వాతే

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో ఎప్పుడో కలిసి పనిచేయాల్సింది. కానీ ఎందుకో వీలుకాలేదు. నా తొలి చిత్రం ఎస్సెమ్మెస్ చిత్రం రిలీజ్‌కు వారం ముందు.. ఆయన చిత్రం అష్టాచెమ్మా తర్వాత ఓ సినిమాకు ప్లాన్ చేశాం. ఆడిషన్స్ కూడా జరిగాయి. ప్రొడక్షన్ హౌస్‌తో అగ్రిమెంట్ కూడా జరిగింది. అయితే ఆ సినిమా పట్టాలెక్కపోయింది. అదే ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే చిత్రంగా వచ్చింది. మేము చేయలేకపోయిన తర్వాత ఆ చిత్రంలో కొన్ని మార్పులు చేసి ఊహాలు గుసగుసలాడే సినిమాను తీశారు.

నిజ జీవితానికి దగ్గరగా

నిజ జీవితానికి దగ్గరగా

ఆ తర్వాత చాలా ఏళ్లకు ఓ రోజు ఇంద్రగంటి మోహనకృష్ణ ఫోన్ చేసి కథ చెప్పారు. మరో ఆలోచన లేకుండా సమ్మోహనం చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఈ చిత్రంలోని సన్నివేశాలకు నిజజీవితానికి దగ్గరగా ఉంటాయి. హీరోయిన్ సూపర్‌స్టార్, హీరో చిల్డ్రన్ బుక్ ఇల్లస్ట్రేటర్. నా పాత్ర పేరు విజయ్. హీరోయిన్ పేరు సమీరా. హీరో, హీరోయిన్ల మధ్య సీన్లు నిజజీవితానికి దగ్గరగా సినిమాటిక్‌గా ఉండవు.

సినీరంగంలోని పలు అంశాలపై

సినీరంగంలోని పలు అంశాలపై

సినిమాను కించపరిచే విధంగా కథ ఉండదు. సినిమా యాక్టర్లపై ఉండే ప్రజలకు ఉండే అభిప్రాయమే హీరో పాత్ర మాట్లాడుతుంది. సినిమా వాళ్లు ఓవర్ గ్లామరైజ్ చూపిస్తారు. సినిమాలో చూపించేవన్నీ నిజాలు కావు. సినిమా జీవితం వేరు.. వాస్తవ జీవితం వేరు అనే విధంగా హీరో అభిప్రాయ పడుతుంటారు. అలాంటి ఇద్దరు విభిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తుల మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనేది సమ్మోహనం సినిమా కథ.

 హరీష్, తరుణ్, అవసరాల గెస్టులుగా

హరీష్, తరుణ్, అవసరాల గెస్టులుగా

సమ్మోహనం సినిమాలో తరుణ్ భాస్కర్, హరీష్ శంకర్, అవసరాల శ్రీనివాస్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. వాళ్లు నిజ జీవితంలో పోషించే వారి పాత్రల్లోనే వెండితెర మీద కనిపిస్తారు. సినీ రంగంపై ఉండే ఓ రకమైన సాధారణ ప్రేక్షకులకు ఉండే ఓ అభిప్రాయంపై చిన్న డిస్కషన్ లాంటి ఉంటుంది. అలాంటి వాటికి కొన్ని సమాధానాలు, క్లారిటీ ఇచ్చే విధంగా సన్నివేశాలను దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రాసుకొన్నారు.

ఫీల్‌గుడ్ లవ్‌స్టీరీ

ఫీల్‌గుడ్ లవ్‌స్టీరీ

సమ్మోహనం సినిమా ఓ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరి. ఇప్పటి వరకు ఇంత ఇంటెన్సిటీ ఉన్న ప్రేమకథను ఇంద్రగంటి మోహనకృష్ణ తీయలేదు. ఇంతకు ముందు కొన్ని సినిమాలు తీసినప్పటికీ.. ఈ టైపులో కథను డీల్ చేయలేదు. తెలుగు తెరపై ఇలాంటి సినిమా కథ ఇంతవరకు రాలేదు. లవ్, రొమాంటిక్, ఎమోషనల్ అంశాలతోపాటు సున్నితమైన హాస్యం ఉంటుంది.

ఆ సీన్లు ఛాలెంజింగ్

ఆ సీన్లు ఛాలెంజింగ్

నటుడిగా విభిన్నమైన పాత్రల్లో నటించాలన్నది నా కోరిక. ఇప్పటి వరకు సస్పెన్స్, థ్రిల్లర్స్, యాక్షన్ చిత్రాలను ఇప్పటి వరకు చేశాను. ఇప్పడు లవ్‌స్టోరి నా ముందుకు వచ్చింది. విలక్షణమైన పాత్ర అనిపించడంతో సమ్మోహనం చేశాను. ఈ చిత్రంలో నాకు ఛాలెంజ్‌గా నిలిచిన సన్నివేశాలు రెండు ఉన్నాయి. ఒకటి ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్. మరోటి క్లైమాక్స్‌లో వచ్చే సీన్లు.

విలన్ పాత్ర చేసే అవకాశం

విలన్ పాత్ర చేసే అవకాశం

హిందీ చిత్రంలో భాగీ సినిమా చేశాను. మళ్లీ విలన్ పాత్రలు వస్తే చేస్తాను. కానీ ఇప్పడు నా ముందుకు వస్తున్నవన్నీ హీరో పాత్రలే. విభిన్నమైన కథా చిత్రాల్లో, విలక్షణమైన పాత్రల్లో నటించాలన్నది నా ప్రధాన లక్ష్యం. సినిమాల్లో నాటకీయత పండించడం చాలా తేలిక. కానీ నిజ జీవితానికి దగ్గరగా ఉండటం పాత్రలు చేసేటప్పడు అదో ఛాలెంజింగ్. అలాంటి పాత్రలు చేయించడం, ఆ తర్వాత డైరెక్టర్ నుంచి మంచి ప్రశంసలు పొందడం గొప్ప విషయం. ఆ విషయంలో ఇంద్రగంటి అంచనాలను అందుకొన్నానని నేను భావిస్తున్నా.

ప్రీ రిలీజ్‌లో ఎమోషనల్‌గా

ప్రీ రిలీజ్‌లో ఎమోషనల్‌గా

సమ్మోహనం చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పిన మాటలతో చాలా ఎమోషనల్ అయ్యాను. నటుడిగా నేనేంటో అని రుజువు చేసుకొవడానికి సమ్మోహనం చిత్రం ఉపయోగపడింది. యాక్టర్‌గా నా కెరీర్ ఇప్పుడే ఓ రూపంలోకి వస్తున్నది. అలాంటి సమయంలో ఇంద్రగంటి చెప్పిన విషయాలు నన్ను భావోద్వేగానికి గురిచేశాయి. ప్రీ రిలీజ్ తర్వాత మహేష్ బాబు ఫోన్ చేసి హిట్టుకొట్టడం గ్యారంటీ అనే భరోసా ఇచ్చారు.

ఇంద్రగంటితో ఒకటి కాదు. 100 చిత్రాలు

ఇంద్రగంటితో ఒకటి కాదు. 100 చిత్రాలు

సమ్మోహనం తర్వాత అవకాశం వస్తే ఇంద్రగంటితో మళ్లీ ఒక్క సినిమా కాదు 100 చిత్రాలు చేస్తా. కొన్ని స్టోరీ లైన్స్ చెప్పారు. ఇంకా తదుపరి సినిమాపై ఎలాంటి ప్లాన్ లేవు. ఒకవేళ మంచి కథ కుదిరితే ఇంద్రగంటితో సినిమా చేస్తా. సుధీర్ బాబు ప్రొడక్షన్స్‌లో చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

గోపిచంద్ బయోపిక్ గురించి

గోపిచంద్ బయోపిక్ గురించి

పుల్లెల గోపిచంద్ బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. సెప్టెంబర్ నుంచి సెట్స్‌పైకి వెళ్తుంది. పుల్లెల గోపిచంద్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా నా బాడీని మలుచుకొంటున్నాను. హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతుంది. ఆ పాత్ర కోసం కావాల్సినంత మేరకు హోమ్ వర్క్‌ చేస్తున్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X