twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉప్పెన కంటే ముందే కృతిశెట్టితో.. ఇక బేబమ్మ ఏదైనా సరే.. సుధీర్ బాబు ఇంటర్వ్యూ

    |

    అమ్మాయి గురించి మీకు చాలా చెప్పబోతున్నాను. సినిమా చూస్తే మీకు అంతా అర్దం అవుతుంది. ట్రైలర్‌లో కొంత చెప్పాం. దర్శకుడిగా మంచి కథ రాసుకొని ఓ అమ్మాయిని కోసం వెతుకుతుంటే.. కృతిశెట్టి కనిపిస్తుంది. ఆమెకు సినిమాల్లో నటించడం ఇష్టం ఉండదు. అయితే ఆ అమ్మాయిని ఎలా ఒప్పించాను అనేది సినిమా కథ. ఈ సినిమా కథను V వీ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు చెప్పారు. నా కోసం చెప్పలేదు. తన కథ గురించి మాత్రమే చెప్పారు. ఆ తర్వాత నన్ను తీసుకొన్నారు అని సుధీర్ బాబు చెప్పారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా గురించి, కృతిశెట్టి గురించి, దర్శకుడు ఇంద్రగంటి గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ..

    ఇంద్రగంటితో వరసుగా మూడు సినిమాలు

    ఇంద్రగంటితో వరసుగా మూడు సినిమాలు

    ఇంద్రగంటి మోహనకృష్ణతో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. సమ్మోహనం, V చిత్రాలతో మా మధ్య అనుబంధం పెరిగింది. అయితే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్‌ను ట్రైలర్‌లో చూపించాం. మనం సినిమా తీస్తున్నాం అనుకొంటాం. కానీ మనల్ని సినిమా తీస్తుంది అనే డైలాగ్ మాదిరిగానే.. సినిమానే మా ఇద్దరిని కలిపింది.

    ఇంద్రగంటితో మూడో సినిమా చేశాను. అయితే నన్ను యాక్టర్‌గా నమ్మాడు. కథ రాసుకొని హీరోను అప్రోచ్ అవుతారు. తన కథకు ఎవరు సూట్ అవుతారో వారితోనే సినిమా చేస్తాడు. అంతేగానీ పెద్ద హీరో కోసం ఇంద్రగంటి ప్రయత్నించారు అని సుధీర్ బాబు అన్నారు.

    యాటిట్యూడ్ ఉన్న తిక్క డైరెక్టర్ పాత్రలో

    యాటిట్యూడ్ ఉన్న తిక్క డైరెక్టర్ పాత్రలో

    ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉంటాయి. నా క్యారెక్టర్‌లో యాటిట్యూడ్ ఉంటుంది. ఓ రకమైన తిక్కగా కూడా ఉంటుంది. నేను ఈ సినిమాలో కమర్షియల్ ఫిలిం డైరెక్టర్‌గా చేశాను. యాటిట్యూడ్, తిక్కగా ఉండే డైరెక్టర్లు మన ఇండస్ట్రీలో తక్కువగా ఉంటారు. ఈ సినిమాలో డైరెక్టర్ స్టైలిష్‌గా కనిపిస్తాడు. సాధారణంగా ఏ డైరెక్టర్‌ అయినా కథ చెప్పినప్పుడు ఆ డైరెక్టర్ ఎంతో అంతా కథలో కనిపిస్తాడు. కానీ ఈ సినిమా విషయానికి వస్తే ఇంద్రగంటి ఎక్కడ కనిపించరు అని సుధీర్ బాబు తెలిపారు.

    ఐటెమ్ సాంగ్ ఎందుకు పెట్టామంటే

    ఐటెమ్ సాంగ్ ఎందుకు పెట్టామంటే

    వివేక్ సాగర్ సంగీతం చేసిన సినిమాల్లో ఇప్పటి వరకు ఐటెమ్ సాంగ్ లేదు. కానీ ఈ సినిమాలో హీరో కమర్షియల్ డైరెక్టర్ కావడంతో.. అలాంటి ఐటెమ్ సాంగ్ పెట్టడానికి స్కోప్ ఉంది. దాంతో వివేక్ సాగర్ మొదటిసారి ఐటెమ్ సాంగ్ చేశారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐటెమ్ సాంగ్‌ను ఇంద్రగంటి సినిమా పెట్టడానికి అలా కారణమైంది అని సుధీర్ బాబు చెప్పారు.

    ఉప్పెన కంటే ముందే

    ఉప్పెన కంటే ముందే

    ఉప్పెన సినిమా కంటే ముందుగానే కృతిశెట్టి ఈ సినిమాను ఒప్పుకొన్నది. ఉప్పెన సినిమా తర్వాత ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. అయితే చిన్నతనంలోనే చాలా మెచ్యురిటీతో పెర్ఫార్మ్ చేస్తున్నారు. మంచి యాక్టర్. ఒక క్యారెక్టర్ అర్ధం చేసుకోనే తీరు ఆకట్టుకొంటుంది. ఈ సినిమా తర్వాత కృతిశెట్టి ఏదైనా పాత్ర చేయగలుగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది అని సుధీర్ బాబు చెప్పారు.

    మంచి క్వాలిటీతో నిర్మాతలు

    మంచి క్వాలిటీతో నిర్మాతలు

    నిర్మాతలు మహేంద్ర, కిరణ్ కొత్త వారైనప్పటికీ.. వారు ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నారు. సమంతకు మేనేజర్‌గా మహేంద్ర, రష్మిక మందన్నకు మేనేజర్‌గా కిరణ్ ఉన్నారు. వారికి చాలా మంది సెలబ్రిటీలతో పరిచయం ఉంది. సినిమా బిజినెస్ గురించి వారికి చాలా తెలుసు. నిర్మాతలుగా వారికి మొదటి చిత్రమే కానీ.. అనుభవం ఉన్న నిర్మాతలుగా సినిమాను తీశారు. మంచి క్వాలిటీతో సినిమా వచ్చింది అని సుధీర్ బాబు అన్నారు.

    English summary
    Actor Sudheer Babu's latest movie is Aa Ammayi Gurinchi Meeku Cheppali. This movie is coming on September 16th. Here is the Sudheer Babu inputs for the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X