twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోనైన మొదటి రోజే సినిమాటోగ్రాఫర్ అవమానం.. గదిలోకి వెళ్లి ఏడ్చేసిన సుధీర్ బాబు!

    |

    సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు తెలుగు ఇండస్ట్రీలో రేపటితో పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన తన జీవితంలో మరింత బలంగా మారడానికి కారణమైన ఒక సంఘటన గురించి వెల్లడించారు. తాను కెమెరా మెన్ మాటలు విని ఏడ్చిన విషయాన్ని ఆయన పంచుకున్నారు. ఆ వివరాలు

    సినీ జర్నీకి పదేళ్ళు

    సినీ జర్నీకి పదేళ్ళు

    సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో సుధీర్ బాబు.మొదటి సినిమా ‘ఎస్ఏంఎస్'కే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో సినిమా ‘ప్రేమ కధా చిత్రమ్' తో కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఆయన బాలీవుడ్ లో కూడా మంచి సినిమాలు చేసే స్థాయికి వెళ్ళాడు. సుధీర్ బాబు సినీ జర్నీకి పదేళ్ళవుతున్న క్రమంలో ఆయన కీలక వివరాలు వెల్లడించారు.

    ఫోటోజనిక్ గా లేదు అని

    ఫోటోజనిక్ గా లేదు అని


    తాతినేని సత్య దర్శకత్వంలో శివ మనసులో శృతి అనే సినిమా చేస్తున్న సమయంలో తాను వినకూడని ఒక మాట సినిమాటోగ్రాఫర్ నోటివెంట విన్నానని సుధీర్ బాబు వెల్లడించారు. అప్పట్లో కేరవాన్ ఫెసిలిటీ లేకపోవడంతో అందరూ ఆరుబయటే ఉండేవారని ఆ సమయంలో సదరు సినిమాటోగ్రాఫర్ తన అసిస్టెంట్ తో ఈ సినిమా వర్కవుట్ కాదు ఇతని ఫేస్ ఫోటోజనిక్ గా లేదు అని చెప్పడం విన్నాను అని వెల్లడించారు.

    గదిలోకి వెళ్లి ఏడ్చాను

    గదిలోకి వెళ్లి ఏడ్చాను

    తాను స్వయంగా ఆ సినిమా నిర్మిస్తూ ఉండడంతో దాదాపు 60 లక్షల రూపాయలు అప్పటికే అడ్వాన్స్ లుగా ఇచ్చానని అతని మాటలు విన్న తరువాత ఏడుపు రావడంతో పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి ఏడ్చాను అని ఆయన అన్నారు. అదే సమయంలో ఆయన మాటలు నాలో పట్టుదలను పెంచాయి అని సుధీర్ బాబు వెల్లడించారు. తర్వాతి రోజు ఆయనకు ఇస్తానన్న డబ్బులు ఇచ్చి సెటిల్ చేసి పంపించి వేశామని, తర్వాత వేరే సినిమాటోగ్రాఫర్ తో సినిమా పూర్తి చేశామని చెప్పుకొచ్చారు.

    స్ఫూర్తినిచ్చాయి

    స్ఫూర్తినిచ్చాయి

    అయితే ఒక రకంగా ఆయన మాటలు తనకు చాలా స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్న సుధీర్ బాబు ఆ తర్వాత కూడా ఆయనతో కొన్ని సినిమాలు చేశాను అని వెల్లడించారు. అయితే సదరు సినిమాటోగ్రాఫర్ ఎవరు అనే విషయాన్ని మాత్రం సుధీర్ బాబు వెల్లడించలేదు. ఇక సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు నుంచి సినిమాల విషయంలో కాదు ఫ్యామిలీ విషయంలో కూడా వాళ్ళు నుంచి చాలా నేర్చుకుంటానాని సుధీర్ బాబు వెల్లడించారు. ఫ్యామిలీకి సమయం ఇవ్వాలని, అప్పుడప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడపాలని కూడా ఆయన అన్నారు.

    Recommended Video

    Mahesh Babu Fans Played Key Role In Hero Movie Blockbuster | Filmibeat Telugu
    ఫ్యామిలీని కూడా

    ఫ్యామిలీని కూడా

    సినిమాలని ఎంత సీరియస్ గా తీసుకోవాలో ఫ్యామిలీని కూడా అంతే సీరియస్ గా తీసుకోవాలని అన్నారు. ప్రత్యేకంగా వారితో సినిమాకు గురించి ఏమీ చర్చించనని ప్రేమ కధా చిత్రమ్ చూసిన తర్వాత మహేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఇంకా తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అలాగే కృష్ణ గారికి ‘శ్రీదేవి సోడా సెంటర్' కూడా నచ్చిందని, ‘మంచి సినిమా చేశావ్' అన్నారని సుధీర్ బాబు పేర్కొన్నారు.

    English summary
    Sudheer babu reveals his bitter experience with cinematographer
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X