twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాజల్ ఫ్యాన్స్ ఫుట్‌బాల్ ఆడుకొంటున్నారు.. రణరంగం సినిమాకు అదే స్ఫూర్తి.. సుధీర్ వర్మ

    |

    యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని కాంబినేషన్లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'రణరంగం'. గ్యాంగ్‌స్టర్ జీవితం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15 న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు సుధీర్ వర్మ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. రణరంగం సినిమా గురించి పలు విషయాలు సుధీర్ చెప్పారు. ఆయన చెప్పిన విషయాలు ఇవే..

    ముందుగా రవితేజతో అనుకొన్నా

    ముందుగా రవితేజతో అనుకొన్నా

    రణరంగం సినిమాకు స్ఫూర్తి గాడ్‌ఫాదర్2 సినిమా. స్క్రీన్ ప్లే ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఎవరు గ్యాంగ్‌స్టర్ సినిమా తీసినా గాడ్‌ఫాదర్ సినిమానే స్ఫూర్తిగా నిలుస్తుంది. రణరంగం సినిమాకు ముందు ఈ సినిమాను రవితేజతో చేయాలని అనుకొన్నాను. మరో కథ గురించి శర్వానంద్ చర్చిస్తే.. మధ్యలో ఈ సినిమా స్టోరి గురించి మాట్లాడుకొన్నాం. దాంతో ఈ స్టోరితో సినిమా చేస్తే నాకు, నా కెరీర్‌కు బాగుంటుందని శర్వా కన్విన్స్ చేశారు. దాంతో రవితేజ్‌కు ఈ విషయాన్ని చెప్పి శర్వాతో రణరంగం సినిమాను ప్రారంభించాం.

     మద్యపాన నిషేదం బ్యాక్‌డ్రాప్‌గా

    మద్యపాన నిషేదం బ్యాక్‌డ్రాప్‌గా

    ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్టీఆర్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మద్యపాన నిషేధ ప్రకటన నుంచి ఆ తర్వాత సీఎం చంద్రబాబు నిషేధం ఎత్తివేసే వరకు ఈ సినిమా బ్యాక్ డ్రాప్‌గా ఉంటుంది. తెలుగులో ఆ బ్యాక్ డ్రాప్ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. అందుకే ఈ సినిమాను చేయాలని డిసైడ్ అయ్యాం. 40 ఏళ్ల వ్యక్తిగా, గ్యాంగ్‌స్టర్‌గా శర్వానంద్ సరిగ్గా సూట్ అయ్యారు.

     ఏ మూవీకి సంబంధం లేదు

    ఏ మూవీకి సంబంధం లేదు

    రణరంగం సినిమా హిందీలో వచ్చిన షారుక్ ఖాన్ నటించిన రాయిస్ సినిమాకు ఎలాంటి పోలీకలు లేవు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. శర్వానంద్ క్యారెక్టర్ గురించే సినిమా ఉంటుంది. ఓ మామూలు వ్యక్తి గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? ఆ క్రమంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనే అంశాల ఆధారంగా సినిమా ఉంటుంది. ఫస్టాఫ్‌లో కల్యాణి ప్రియదర్శన్, సెకండాఫ్‌లో కాజల్ అగర్వాల్ పాత్రలు గ్లామర్‌ను పండిస్తాయి.

     కాజల్ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించను

    కాజల్ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించను

    రణరంగంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ది అతిథి పాత్ర. ముందుగా చిన్న పాత్ర అయినప్పటికీ నటించడానికి ముందుకు వచ్చిన కాజల్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. కాజల్‌ రోల్ చిన్నగా ఉండటం వల్ల ప్రచారానికి వాడుకోవడం లేదు. ఎక్కువగా ఆమెను ప్రొజెక్ట్ చేసి ప్రేక్షకులను నిరాశ పెట్టడం ఇష్టం లేకపోవడమే ఎక్కువ ప్రమోషన్ చేయడం లేదు. కాజల్ పాత్రను తక్కువగా చేయడం వల్ల ఇప్పటికే ఆమె అభిమానులు ఫుట్‌బాల్ ఆడుకొంటున్నారు. ఏదిఏమైనా నిరాశపెట్టడం ఇష్టం లేకే ఆ పనిచేశాను. సినిమా చూసిన తర్వాత నేను ఎందుకలా చేశానో అర్ధం అవుతుంది.

    English summary
    Sharwanand and Kajal Aggarwal, Kalyani Priyadarshan starrer Ranarangam, written and directed by Sudheer Varma is releasing on 15th August. Sithara Entertainments., the producers of the film decided to go for 15th August, release. In this occassion, Heroine Kalyani Priyadarshini speak to filmibeat Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X