మా నాన్న నన్ను ఎస్ఐ చేయాలని చూస్తే.. నేను హీరో అయ్యా.. మేమ్ ఫేమస్ గురించి సుమంత్ ప్రభు
మేజర్, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో విజయాలన అందుకొన్న ఛాయ్ బిస్కట్, లహిరి ఫిల్మ్స్ బ్యానర్లు తాజాగా నిర్మించిన చిత్రం మేమ్ ఫేమస్. యమణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రల్లో నటించారు. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు నిర్మించారు. సుమంత్ ప్రభాస్ హీరోగానే కాకుండా దర్శకత్వం, రచన విభాగాల పర్యవేక్షించారు. ఈ చిత్రం మే 26వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో సుమంత్ ప్రభాస్ మీడియాతో మాట్లాడుతూ..
డిగ్రీ థర్ట్ ఇయర్ చదివే సమయంలో మేము అందరికి తెలియాలనే ఉద్దేశంతో షార్ట్ ఫిలిం తీశాం. మాకు సినిమాల్లోకి రావాలనే కనీస ఆలోచన కూడా అప్పట్లో లేదు. మేము చేసిన షార్ట్ ఫిలిం చూసి ఓ ఫిల్మ్ స్కూల్ వాళ్లు కంటెంట్ క్రియేట్ చేయమని రిసోర్స్ ఇచ్చారు. దాంతో పిల్ల పిలగాడు అనే వెబ్ సిరీస్ చేశాం. ఆ వెబ్ సిరీస్ చూసి ఛాయ్ బిస్కెట్ శరత్, అనురాగ్ అన్నలు పిలిచి అవకాశం ఇచ్చారు. అయితే నాకు ఎస్ఐ జాబ్ చేయాలని ఉంది అని సమాధానం చెప్పాను. అయితే ఎస్సై అయితే వచ్చే డబ్బు, సంపాదించే ఇల్లు.. ఇక్కడ చాలా తొందరగా వస్తాయి అని చెప్పాడు అని సుమంత్ ప్రభాస్ తెలిపాడు.

చాయ్ బిస్కెట్ బ్యానర్‌లో వెబ్ సిరీస్ చేద్దామని శరత్, అనురాగ్ అంటే.. లేదన్నా సినిమా చేస్తాను అని చెప్పాను. నా కాన్ఫిడెన్స్ చూసి నవ్వుకొన్నారు. అయితే నీకు సినిమా గురించి తెలియదు. ఎలా సినిమా తీస్తావంటే.. నేను తీస్తాను అని చెబితే.. సరే నీవు కథ రాసుకొని రా.. అప్పుడు చూద్దామని చెప్పారు. దాంతో మేము ఫేమస్ సినిమా కథ రాసి వారికి ఆరు గంటలు నేరేషన్ ఇచ్చారు. దాంతో చాలా క్లారిటీతో ఉన్నావు. ఈ సినిమాకు నువ్వే డైరెక్టర్ అని చెప్పారని సుమంత్ ప్రభాస్ చెప్పాడు.
మేమ్ ఫేమస్ కథ రాసిన తర్వాత హీరో కోసం చాలా మందిని చూశాం. అయితే ఏ ఒక్కరు కూడా నా విజన్‌కు దగ్గరగా రాలేదు. షూటింగ్‌కు వెళ్లే 10 రోజుల ముందు శరత్, అనురాగ్ వద్దకు వెళ్లి.. నేనే హీరోగా చేస్తానని చెబితే.. షాక్ తిన్నారు. ఫస్ట్ టైం డైరెక్టర్ నీవు, సినిమాను ఎలా చేస్తావు. ఎలా యాక్టింగ్ చేస్తావు అని అడిగారు. అయితే సీన్ చేసేటప్పుడు వాళ్లకు ఎలా చేయాలో చూపిస్తాను కదా.. అదే నేను చేసి డైరెక్టర్‌గా మానిటర్ చూసుకొంటానని చెప్పడంతో .. సరే ఓకే అని ఇంకొంత మంది స్టాఫ్ ఇచ్చారు. దాంతో నేను హీరోగా మారాను. నాపై నిర్మాతలు పెట్టుకొన్న నమ్మకంతోనే హీరోను అయ్యాను అని సుమంత్ ప్రభాస్ చెప్పాడు.

ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు నాకు ఎలాంటి టెన్షన్ అనిపించలేదు. కథ, కథనాలపై చాలా క్లారిటీతోనే ఉన్నాను. సినిమా మొత్తం ముందుగా ఫోన్‌లో ఆఫీస్‌లో షూట్ చేశాను. ఫోన్‌లో షూట్ చేసి టైమ్ లైన్ మీద చూసుకొన్నప్పడు నా మీద నాకే రెండింతలు నమ్మకం కుదిరింది. సెట్స్‌కు వెళ్లినప్పుడు ఏదైతే ఫోన్‌లో షూట్ చేశానో.. అదే సీన్లను రూరల్ బ్యాక్ డ్రాప్‌తో షూట్ చేశాను అని సుమంత్ ప్రభాస్ అన్నాడు.
మేమ్ ఫేమస్ సినిమాలో 50 మంది కొత్త వాళ్లతో తీశాం. కానీ వాస్తవానికి 50 కాదు.. మొత్తం లెక్క వేస్తే 100 మంది వరకు ఉంటారు. ఈ చిత్రంలో ఊర్లో అందరి దృష్టిలో పడాలనుకొనే కుర్రాళ్ల కథ. ఏం చేసినా ఫోకస్‌తోపాటు ఫేమస్ కావాలనుకొనే వాళ్ల కథ ఇది. పాత్రల తగినట్టు కుర్రాళ్లు కొత్తవారైనప్పటికీ.. బ్రిల్లియెంట్‌గా ఫెర్పార్మ్ చేశారు అని సుమంత్ ప్రభాస్ తెలిపాడు.

మాది మధ్య తరగతి కుటుంబం. మా ఇంట్లో ఇన్ షర్ట్ కూడా ఎవరు వేసుకోరు. మా డాడీ ఏడో తరగతి, మా అమ్మ 10 వ తరగతి చదువుకున్నది. నాన్న గారు ఫ్రెండ్స్‌తో కలిసి రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. నన్ను ఎస్ఐ చేయాలనుకొని అనుకొన్నారు. నేను ఎస్ఐ అయితే ఆయనకు హెల్ప్‌గా ఉంటుందని అనుకొన్నారు. కానీ మనం ఈ లైన్‌లోకి వచ్చాం. నా పేరు సుమంత్ రెడ్డి. నేను ప్రభాస్‌కు పిచ్చి ఫ్యాన్స్‌ను. ఫేస్‌బుక్‌లో అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు నా పేరు పక్కన ప్రభాస్ పేరు తగిలించుకొన్నాను అని సుమంత్ ప్రభాస్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











