twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆఫర్.. రాజమౌళి మర్యాద రామన్న సీక్వెల్‌.. సునీల్ దిమ్మతిరిగే జవాబు

    |

    Recommended Video

    Sunil Speaks About Trivikram Srinivas And His Personal Problems || Filmibeat Telugu

    కమెడియన్ నుంచి హీరోగా అవతారం ఎత్తిన సునీల్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలుత హీరోగా హిట్లు పడటం ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్‌ తారసపడటంతో సునీల్‌ మళ్లీ కమెడియన్‌గా అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఇటీవల కమెడియన్‌గా సునీల్ నటించిన అరవింద సమేత, చిత్రలహరి సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్‌తో సునీల్ మాట్లాడుతూ...

    కామెడీ పాత్రలు ఇవ్వడం మానేశారని

    కామెడీ పాత్రలు ఇవ్వడం మానేశారని

    యాక్షన్ హీరోగా పాకులాడటం వల్లే ప్లాఫ్స్ వచ్చాయన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను కేవలం కమెడియన్‌గా మాత్రమే నటించాలనుకొన్నాను. అంతేకాకుండా, కమెడియన్‌గా నటిస్తూనే హీరో వేషాలు అప్పుడప్పుడు వేయాలని అనుకొన్నాను. అదే విషయాన్ని పలు ఇంటర్వ్యూలో చెప్పాను. అయితే నేను హీరోగా మారానని, కమెడియన్ పాత్రలు ఇవ్వడం మానేశారు అని సునీల్ పేర్కొన్నారు.

    తెలుగులో జాకీచాన్‌ మాదిరిగా

    తెలుగులో జాకీచాన్‌ మాదిరిగా

    తెలుగు చిత్ర పరిశ్రమలో చాకీ చాన్ మాదిరిగా యాక్షన్‌తో కమెడియన్లు కొరత ఉండేది. ఆ జానర్‌లో సినిమాలు చేయాలనే కోరిక ఉండేది. నిర్మాతల కోరిక మేరకు అలాంటి సినిమాలు చేశాను. అయితే మన ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవడంతో పూర్తి స్థాయి కమెడియన్ పాత్రల వైపు దృష్టిపెట్టాను. సిక్స్ ప్యాక్ ఉన్న నటుడు కామెడీ చేస్తే హాలీవుడ్, చైనాలో వర్కవుట్ అవుతుంది. కానీ తెలుగులో చాలా కష్టం అని అన్నారు.

    కమెడియన్ అంటే అలా ఫిక్స్

    కమెడియన్ అంటే అలా ఫిక్స్

    టాలీవుడ్‌లో కమెడియన్ అంటే బొర్ర, లావుగా, చూడగానే నవ్వే విధంగా పర్సనాలిటీ ఉండాలి. అలాంటి పాత్రలకే ప్రేక్షకులు అలవాటుపడిపోయారు. దాంతో నేను సిక్స్ ప్యాక్‌తో కామెడీ చేసినా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో కమెడియన్, క్యారెక్టర్ పాత్రల వైపే మొగ్గుచూపుతున్నాను. హీరోగా మంచి పాత్ర వస్తే తిరిగి చేయడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు అని అన్నారు.

    త్రివిక్రమ్, రాజమౌళి ఆఫర్లపై

    త్రివిక్రమ్, రాజమౌళి ఆఫర్లపై

    ఒకవేళ ఒకే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి కామెడీ పాత్రతో, రాజమౌళి మర్యాద రామన్న సీక్వెల్‌తో ఆఫర్లు ఇస్తే ఎటు వైపు ఓటేస్తావు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. రెండు చేస్తాను. షూటింగ్ సమయాలను అడ్జస్ట్ చేసుకొని సమయానికి ఆయా షూటింగ్‌లకు చేరుకొంటాను. త్రివిక్రమ్ కామెడీ పాత్రను వదులుకోవడం ఇష్టం లేదు. అలాగే మర్యాద రామన్న సీక్వెల్‌ను వదులుకొను అని సునీల్ తెలివిగా జవాబిచ్చారు.

    ఖలేజా, మర్యాద రామన్న చిత్రాలు ఒకేసారి

    ఖలేజా, మర్యాద రామన్న చిత్రాలు ఒకేసారి

    గతంలో రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి ఇదే పరిస్థితి ఎదురైంది. ఒకే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఖలేజా, రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న చిత్రాలు ఒకేసారి షూటింగ్ జరిగాయి. ఆ రెండు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు పూర్తి చేశాను. ఇప్పుడు కూడా అలానే వారిద్దరి సినిమాలు వదులుకోకుండా నటిస్తాను అని సునీల్ చెప్పారు.

    English summary
    Actor and Comedian Sunil speak to filmibeat on success of Chitralahari movie news. He played crucial role in this movie along with Sai Dharam Tej. He speaks about Trivikram Srinivas and His personal problems.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X