Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్‌ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాజమౌళి అవకాశం ఇవ్వడం వల్లే.. సైనికుడుతో గుర్తింపు.. ఇంద్ర (ఇంటర్వ్యూ)
Recommended Video
విలన్, హీరో పాత్రలతో టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఔత్సాహిక నటుడు ఇంద్ర. కుర్ కురే, పుత్రుడు సినిమాలు ఆయనకు హీరోగా మంచి గుర్తింపునిచ్చాడు. హీరోగా మారక ముందు రాజమౌళి రూపొందించిన సై, మహేష్ బాబు సైనికుడు చిత్రంలో మంచి పాత్రల్లో కనిపించాడు ఇంద్ర. తాజాగా సూపర్ స్కెచ్ చిత్రంలో ఫుల్ లెంగ్త్ పాత్రలో విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుండగా ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు.
సూపర్స్కెచ్లో విలన్‌గా
సూపర్ స్కెచ్ మూవీలో నేను విలన్‌గా నటించాను. పాత్ర విలన్‌గా అనిపించినా హీరోలకు ఉండే మాదిరిగానే నాకు మూడు పాటలు ఉన్నాయి. నేను ఈ చిత్రంలో రచయితగా కనిపిస్తాను. పలు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం సంతోషంగా ఉంది. సినిమాలో పాత్రకు సంబంధించిన హీరో, విలన్, ఇంటిలిజెంట్, కన్నింగ్ షేడ్స్ ఉంటాయి.
రాజమౌళి సై చిత్రంతో
నా మొట్టమొదటి చిత్రం ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన సై చిత్రంలో విలన్ బ్యాచ్‌లో ఒకడిగా నటించాను. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన సైనికుడు చిత్రంలో నటించాను. దాదాపు ఆ చిత్రం కోసం 40 రోజులు పనిచేశాను. కుర్ కురే మూవీలో హీరోగా చేశాను. ఆ తర్వాత పుత్రుడు అనే చిత్రంలో హీరోగా నటించాను. శ్రీమన్నారయణ, కిక్2, ధ్రువ చిత్రంలో చిన్న చిన్న పాత్రల్లో నటించాను.
సూపర్ స్కెచ్ రీరిలీజ్
గతంలో సూపర్ స్కెచ్ చిత్రం విడుదల చేశాం. దాదాపు పెద్ద చిత్రాల మధ్య సినిమా వేశాం. థియేటర్లు దొరకలేదు. అందుకే మళ్లీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నాం. చాలా థియేటర్లు దొరికాయి. దాదాపు 40 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం.
కరాటే కోచ్‌గా ఇంద్ర
నా జన్మస్థలం శంషాబాద్. నాకు వారియర్స్ కరాటే ఇనిస్టిట్యూట్ ఉంది. కోచ్‌గా నాకు దాదాపు 40 వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. సై సినిమా తీసేటప్పుడు రాజమౌళి స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నావారికి చూస్తుండగా ఆయనను కలిశాను. దాంతో సై చిత్రంలో నటించే అవకాశం లభించింది.
సైరాలో కూడా నటిస్తున్నాను
ప్రస్తుతం సైరా నర్సింహారెడ్డి సినిమాలో ఓ యుద్ధ వీరుడిగా నటించాను. నాకు మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి విలన్‌గా గుర్తింపు పొందే పాత్రల్లో నటించాలని అనుకొంటున్నాను. సూపర్ స్కెచ్ ద్వారా విలన్‌గా గుర్తింపు వస్తుందని అనుకొంటున్నాను. ఓ మైండ్ గేమ్‌తో సాగే చిత్రంగా సూపర్ స్కెచ్ రూపొందింది.