BRO తర్వాత సినిమాలకు బ్రేక్.. మాట పడిపోయి నా పరిస్థితి దారుణంగా.. సాయిధరమ్ తేజ్ షాకింగ్ నిర్ణయం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. థమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్ కథానాయికలు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ...
బ్రో మూవీ షూటింగ్ స్టార్టింగ్ నాకు డైలాగ్ చెప్పడం చాలా ఇబ్బందిగా ఉండేది. మాట సరిగా రాకపోవడం జరిగేది. మాట, వాయిస్ రాకపోయేది. దాని వల్ల డైలాగ్స్ చెప్పడం చాలా ఇబ్బంది పడ్డాం. దాంతో మాటల విలువ తెలిసింది. మాట పడిపోతే ఎలాంటి ఇబ్బందో, వ్యాల్యూ ఏమిటో తెలుసుకొన్నాను. డబ్బింగ్‌లో కష్టపడ్డాను. డబ్బింగ్ ఇంఛార్జి పప్పు చాలా హెల్ప్ చేశారు. పప్పు గారు చాలా సహయం చేశారు. నా నుంచి బెస్ట్ ఇవ్వడానికి ఆయన చాలా కష్టపడ్డారు అని సాయిధరమ్ తేజ్ తెలిపారు.

పవన్ కల్యాణ్‌తో కాంబినేషన్‌లో సినిమా అంటే వరుణ్, వైష్ణవ్ తేజ్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మొదట వరుణ్ నాకు అవకాశం దక్కలేదని కొంచెం జెలసీ ఫీలయ్యాడు. అది 10 శాతం మాత్రమే. 90 శాతం మా ఫ్యామిలీలో ప్రతీ ఒక్కరికి సంతోషం కలిగింది. చిరంజీవి గారు గుడ్ లక్ చెప్పారు. మా ఇద్దరికి బాగా సపోర్ట్ చేశారు. గురుశిష్యులు కలిసి బాగా చేసేయండి అంటూ సాయిధరమ్ తేజ్ తెలిపారు.
బ్రో సినిమా తర్వాత నాకు అవకాశం వస్తే మల్టీ స్టారర్ సినిమాల్లో నటించడానికి ప్రయత్నిస్తాను. మంచి కథ దొరికితే నాకు ఇష్టమైన హీరోలు ప్రభాస్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, మంచు మనోజ్‌తో కూడా చేస్తాను అని సాయిధరమ్ తేజ్ చెప్పారు. మంచి కథ లభిస్తే మెగా హీరోలే కాదు.. బయటి హీరోలతో కూడా పనిచేయడానికి ట్రై చేస్తాను అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.

బ్రో మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్‌తో కలిసి నటించాను. అయితే కేతిక శర్మ విషయానికి వస్తే.. వైష్ణవ్‌తో కలిసి నటించడం వల్ల నాకు ముందే తెలుసు. ఇక ప్రియా వారియర్‌తో స్క్రిప్టు రీడింగ్ చేశాను. ఆ సమయంలోనే ఆమె బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో ఫిలాసఫికల్ టచ్ ఎక్కువగా కనిపిస్తున్నది. అయితే ఈ సినిమాలో రొమాంటిక్ టచ్ కూడా ఉంటుంది. ఈ సినిమాకు ఎంత కావాలో అంత రొమాన్స్ ఉంటుంది అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.
బ్రో మూవీ తర్వాత ఆరు నెలల పాటు బ్రేక్ తీసుకొంటాను. ప్రస్తుతం నా ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని అనుకొంటున్నాను. యాక్సిడెంట్ తర్వాత నా ఆరోగ్యం కొంత మెరుగైంది. విరూపాక్ష కంటే బ్రో సినిమాకు మరింత బెటర్ అయ్యాను. ఆరు నెలలు గ్యాప్ తీసుకొని హెల్త్ గురించి ఆలోచిస్తాను. అలాగే సినిమా కథలపై దృష్టిలో పెడుతాను. నా క్లోజ్ ఫ్రెండ్ నవీన్ రూపొందించిన సత్య అనే షార్ట్ ఫిలింతో మీ ముందుకు వస్తున్నాను. ఆ షార్ట్ ఫిలిం ఆర్మీ బేస్డ్‌గా ఉంటుంది అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











