Santosham Film Awards నాగార్జున చెప్పిన ఆ మాటే నాకు స్పూర్తి.. చిరు, బాలయ్య ప్రోత్సాహంతో.. సురేష్ కొండేటి

జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన సురేష్ కొండేటి.. ఆ తర్వాత డిస్టిబ్యూటర్‌గా, నిర్మాతగా, నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నారు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరూ చేయని విధంగా సంతోషం అవార్డులను దాదాపు 21 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. Santhoshwam Awards 2023 వేడుకను గోవాలో, ఓటీటీ అవార్డలు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న నేపథ్యంలో సురేష్ కొండేటి మాట్లాడుతూ..

తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి వెళ్లక ముందే 2007 సంవత్సరంలో దుబాయ్‌లోని షార్జా స్టేడియంలో 40 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో భారీ ఫంక్షన్ చేశాను. అప్పుడు మహేష్ బాబుతోపాటు స్టార్ హీరోలు, హీరోయిన్లు హాజరయ్యారు. ఆ తర్వాత సౌత్ ఇండియా స్థాయిలో అవార్డులను చేస్తూ వస్తున్నాను. ఈ క్రమంలో సౌత్ ఇండియన్ స్టార్లను నార్త్‌ ఇండియాకు పరిచయం చేయడానికి సంతోషం అవార్డులను గోవాలో నిర్వహించేందుకు ప్లాన్ చేశాం. ఏర్పాట్లు ముమ్మురంగా జరుగుతున్నాయి అని సంతోషం అవార్డుల నిర్వాహకుడు, నిర్మాత, జర్నలిస్టు సురేష్ కొండేటి చెప్పారు.

Suresh Kondeti revealed facts and files of Santosham Film Awards 2023 in Goa and OTT Awards 2023

గోవాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంతోషం అవార్డుల వేడుకలకు అందరి హీరోల అభిమానులు రావాలని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న స్పాన్సర్లకు, ఇండస్ట్రీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నా ఒక్కడి కార్యక్రమం కాదు. అందరి సహకారంతో చేస్తున్నానని నేను ఫీలవుతున్నాను. సౌత్ ఇండియాలోని ప్రతీ భాషలోని అగ్ర నటులు కూడా ఈ వేడుకలో పాల్గొంటారు అని సురేష్ కొండేటి తెలిపారు.

సంతోషం అవార్డుల కాకుండా ఇండియాలోనే తొలిసారి ఓటీటీ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించాను. రెండో ఓటీటీ అవార్డుల వేడుకను నవంబర్ 8వ తేదీన హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాయి. వాటి కంటే ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది. లాభం, నష్టం అని బేరిజు వేసుకోకుండా శతృత్వం పెరిగినా నేను అనుకొన్నది చేస్తున్నాను అని సురేష్ కొండేటి చెప్పారు.

Suresh Kondeti revealed facts and files of Santosham Film Awards 2023 in Goa and OTT Awards 2023

సంతోషం అవార్డులను నిర్వహించడానికి ప్రధాన కారణం నాగార్జున అక్కినేని. సంతోషం వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఫిలింఫేర్ అవార్డులు ఘనంగా జరుగుతాయి. తెలుగులో సంతోషం అవార్డులు కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఆ సత్తా సురేష్ కొండేటికి ఉంది అని చిన్న మాట అన్నారు. ఆయన చెప్పిన మాట నా మనసులో నాటుకుపోయింది. అలాగే చిరంజీవి, బాలకృష్ణ కూడా ప్రోత్సహించారు. అలా సంతోషం అవార్డుల కార్యక్రమం 21 ఏళ్లుగా కొనసాగిస్తున్నాను. మొత్తం 25 ఏళ్ల పాటు కొనసాగించాలని అనుకొంటున్నాను అని సురేష్ కొండేటి చెప్పారు.

సంతోషం అవార్డుల ఫంక్షన్‌ను గోవాలో నిర్వహించాలని అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించాను. గతంలో నేను నిర్వహించిన అవార్డు ఫంక్షన్ల బుక్‌లెట్, బ్రోచర్లు చూసి గోవా సీఎం ఆశ్చర్యపోయారు. గోవాలో ఇయర్ ఎండ్ సీజన్ అయినప్పటికీ.. సంతోషం అవార్డులను నిర్వహించుకొనేందుకు సహకారం అందించారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టుగానే ఆ ప్రభుత్వం సహకారం అందించింది అని సురేష్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X