For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను సింగిల్, ఆమె డబుల్.. ఆ విషయంలో ఆమె బాగా హెల్ప్ చేసింది..

  |

  అలనాటి అందాల నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతోన్న చిత్రం "సువర్ణసుందరి". ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా దర్శకుడు సూర్య ఎమ్ఎస్ఎన్ తెరకెక్కించారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి రెండ‌వ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర హీరో ఇంద్రా విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఆయన వెల్లడించిన విషయాలు మీకోసం..

   సువర్ణ సుందరి అంటే ఏమిటంటే

  సువర్ణ సుందరి అంటే ఏమిటంటే

  సువ‌ర్ణ‌సుంద‌రి అంటే ఒక విగ్ర‌హం. ఆకాలం 600 సంవ‌త్స‌రాల‌ నుంచి ఈ కాలం వ‌ర‌కు క‌థ‌ ట్రావెల్ అవుతుంది. దానికి సంబంధించిన సినిమా ఇది.ఒక సోషియో ఫ్యాంట‌సీ మూవీ. మైథ‌లాజిక‌ల్ కూడా. హైబ‌డ్జెట్ మూవీ అనుకున్నాం కానీ ఇంకా చాలా హై బ‌డ్జెట్ అయింది. సినిమాపై ఉన్న అభిరుచితో జ‌నాలు ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌కంతో సూర్య‌గారు చేశారు. అవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది.

  ఇంద్ర పాత్రలో లీడ్‌ రోల్‌లో

  ఇంద్ర పాత్రలో లీడ్‌ రోల్‌లో

  సువర్ణ సుందరి చిత్రంలో నా క్యారెక్టర్ పేరు ఇంద్ర. ఇందులో లీడ్ రోల్‌లో న‌టించాను. ఈ చిత్రాని కంటే ముందు నేను వంగ‌వీటిలో న‌టించాను. రామ్‌గోపాల్‌వ‌ర్మ్‌ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆ చిత్రంలో నేను ఒక కీల‌క‌మైన పాత్ర‌ను పోషించాను. లీడ్ రోల్‌లో చెయ్య‌డం ఇదే మొద‌టిసారి నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన డైరెక్ట‌ర్ సూర్య‌గారికి నేను జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. ఒక కొత్త హీరోను న‌మ్మి ఒక లీడ్ రోల్ ఇవ్వ‌డం అనేది ఈ రోజుల్లో సామాన్య‌మైన విష‌యం కాదు.

  సువర్ణ సుందరిలో నా పాత్ర రొమాంటిక్‌గా

  సువర్ణ సుందరిలో నా పాత్ర రొమాంటిక్‌గా

  సువర్ణ సుందరి చిత్రంలో నాది సింగిల్ రోల్. హీరోయిన్ సాక్షి డబుల్ రోల్‌లో కనిపించింది. నా పాత్ర రొమాంటిక్‌గా ఉంటుంది. రెండు షేడ్స్‌లో సాగే చిత్రంలో ఒకటి పీరియాడిక‌ల్‌, ఇంకోటి ప్ర‌జంట్‌. నేను సాక్షికి జంటగా చేశాను. ఒక రొమాంటిక్ హీరోగా క‌న‌ప‌డ‌తాను. సువర్ణ సుందరి సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూస్తే మీకు అర్ధ‌మ‌వుతుంది. ఆయన ఎంత బాగా తీశారు అన్న‌ది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప‌బ్లిసిటీ కూడా చాలా బాగా చేస్తున్నారు. అన్నీ ఆయ‌నే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు అని అని ఇంద్రా అన్నారు.

  సువ‌ర్ణ‌సుంద‌రి థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్

  సువ‌ర్ణ‌సుంద‌రి థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్

  ఇటీవల విడుద‌లైన సువ‌ర్ణ‌సుంద‌రి థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా చిన్న సినిమాగా మొద‌లై ఇప్పుడు చాలా పెద్ద సినిమా అయింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న చిత్రంలో న‌టించ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని సెన్సార్‌కి అప్లైచేశాము. ఈ చిత్రం విడుద‌ల‌వ్వ‌డానికి అన్ని విధాల రెడీగా ఉన్నాం. ఈ సినిమా ఇంత మంచిగా రావ‌డానికి ప్ర‌ధాన‌కార‌ణం సూర్య‌గారే.

  యాక్టింగ్ ప‌రంగా హెల్ప్

  యాక్టింగ్ ప‌రంగా హెల్ప్

  హీరోయిన్ సాక్షి చాలా బాగా చేశారు. త‌ను చాలా సినిమాల్లో నటించారు. షూటింగ్ టైంలో నాకు కూడా యాక్టింగ్ ప‌రంగా చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాలో అంద‌రూ చాలా బాగా చేశారు. సాయికుమార్‌, జ‌య‌ప్ర‌ద‌గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె న‌టించిన సినిమాలో చేయ‌డం నా అదృష్టం. జ‌య‌ప్ర‌ద‌గారితో నాకు సీన్స్ ఏమీ లేవు.

  రామదూత క్రియేషన్స్ మాదే మీ గురించి...

  రామదూత క్రియేషన్స్ మాదే మీ గురించి...

  నేను విజ‌య‌వాడ‌లో పుట్టాను. నేను దాస‌రి కిర‌ణ్‌కుమార్ క‌జిన్‌ని. రామదూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ మాదే. కానీ నేను ఎప్పుడూ నా బ్యాక్‌గ్రౌండ్ ఎక్క‌డ చెప్ప‌కుండానే ఆడిష‌న్స్‌కి వెళ్ళాను. నేను వంగ‌వీటిలో చేస్తుండ‌గా నాకు సూర్య‌గారు ఫోన్ చేసి ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చారు.
  మ‌ధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందాను.

  మార్చి రెండోవారంలో రిలీజ్

  మార్చి రెండోవారంలో రిలీజ్

  సువర్ణ సుందరి తర్వాత రామ‌చ‌క్క‌ని సీత అనే చిత్రంలో చేస్తున్నాను అందులో కూడా లీడ్‌రోల్ లో చేస్తున్నాను. ఓంకార్ గారి అసిస్టెంట్ శ్రీ‌హ‌ర్ష మండా గారితో చేశాను. ఈ రెండూ సినిమాలు డిఫ‌రెంట్ జోన‌ర్స్. 5, 6 రోజుల్లో షూటింగ్ పూర్త‌వుతుంది. అది కూడా విడుద‌ల‌కు ద‌గ్గ‌ర‌లో ఉంది. న‌న్ను నేను ప్రూవ్ చేసుకోడానికి ఈ రెండు సినిమాలు నాకు మంచి అవ‌కాశాలుగా భావిస్తున్నాను. ఈ సినిమా మార్చిరెండో వారంలో మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా చూసి న‌న్ను ఆద‌రిస్తార‌ని నాకు మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయ‌ని కోరుకుంటున్నాను అన్నారు.

  English summary
  Suvarna Sundari is a socio Fantacy movie. Jaya Prada, Poorna, Sakshi Chowdary are the lead actors. Indra is introducing as hero in this movie. This movie is set to release in March Second week. In this occassion, Hero Indra speaks to Telugu Filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X