Drishika Chander: సుయోధన మూవీతో గొప్ప అనుభవం.. గిన్నిస్ రికార్డుతో అలాంటి గుర్తింపు
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ యాక్టర్లు ప్రియదర్శి, సాయికుమార్, విష్ణు ఓఐ, దేవీ ప్రసాద్, దృషికా చందర్, రాజశ్రీ నాయర్ తదితరులు నటించిన చిత్రం సుయోధన. ఈ సినిమాకు వైఎస్ మాధవ్ రెడ్డి దర్వకత్వం వహించారు. ప్రజ్వల లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోసుబాబు నిడిమోలు నిర్మాతగా ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, జయ్ క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, కార్తీక్ కొప్పెర సినిమాటోగ్రాఫర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. ఈ చిత్రం మార్చి 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రంలో హీరోయిన్‌గా నటించిన దృషికా చందర్ ఫిల్మీబీట్‌తో తన అభిప్రాయాలను, సినిమా విశేషాలను పంచుకొన్నారు. ఈ సినిమా గురించి, ఆమె కెరీర్ గురించి చెప్పిన విషయాల్లోకి వెళితే..

నా కుటుంబానికి సినిమా నేపథ్యం ఉంది. మా అమ్మ గారు అరుంధతి సినిమాకు క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఆమె ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆర్ట్ విభాగంలో, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన విశేష అనుభవం ఉంది. అయితే చిన్నతనంలోనే నాకు సినిమాల్లో నటించాలని కోరిక కలిగింది. అయితే చదువు పూర్తయిన తర్వాతే సినిమాల్లో నటించమని అమ్మ సలహా ఇచ్చారు. దాంతో నేను చదువు పూర్తి చేసుకొని న్యూయార్క్ ఫ్యాషన్ స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేశాను. కిక్ బాక్సింగ్ నేర్చుకొన్నాను. డైవింగ్‌లో శిక్షణ పొందాను. ఆ తర్వాత థియేటర్‌లో నాటకాలు ప్రదర్శించాను. నా కెరీర్‌కు పూర్తిగా అమ్మ సహాకారం ఉంది అని ఆమె చెప్పారు.
నేను నాటకాల్లో నటించినప్పుడు నా పెర్ఫార్మెన్స్ చూసి సుయోధన కథ చెప్పారు. ఆయన ఆడిషన్ చేసిన తర్వాత ఈ సినిమాలో ఆఫర్ ఇచ్చారు. ప్రియదర్శి, సాయికుమార్ గారితో పనిచేయడం గొప్ప అనుభూతి. సాయికుమార్ గారితో నాకు కాంబినేషన్ సీన్లు లేవు. కానీ షూటింగ్ సమయంలో ఆయన నటించేటప్పుడు సెట్‌లో ఉండి చాలా నేర్చుకొన్నాను. నేను ఈ సినిమాలో సమిత అనే పాత్రలో నటించాను. ఫిల్మ్ మేకర్ పాత్రలో కనిపించబోతున్నాను. సైకలాజికల్ జోనర్‌తో కథ ఉంటుంది. లవ్, ఎమోషన్స్ ఉన్న పాత్రలో నటించాను. నా పాత్ర అందరికీ నచ్చుతుంది అని దృషిక తెలిపారు.
సయోధన సినిమాకు ముందు మనసానమ: షార్ట్ ఫిలింలో నటించాను. ఆస్కార్ అర్హత పొందిన ఘనతతోపాటు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించింది. ఏవం ఇంద్రజిత్ అనే హిందీ నాటికలో ఆరు విభిన్న కోణాలున్న మహిళా పాత్రను పోషించాను. ఈ చిత్రంలో నా పాత్రకు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించాయి. తెలుగులో బుచ్చినాయుడు కండ్రిగ, ఏ బ్యూటీఫుల్ గర్ల్ అనే సినిమాల్లో నటించాను. ఇటీవల జియో సినిమా ఓటీటీలో హే కమీనీ అనే హిందీ సినిమాలో నటించాను అని తెలిపారు.
నాకు అవకాశం వస్తే స్పోర్ట్ స్టార్ బయోపిక్‌లో నటించాలని ఉంది. నాకు రణ్‌వీర్ సింగ్ అంటే ఇష్టం. శ్రీదేవీ, రేఖ అంటే ఇష్టం. ధురంధర్ సినిమా ఇంకా చూడలేదు. త్వరలోనే చూస్తాను. అన్ని రకాల పాత్రలు పోషిస్తానని పేరు తెచ్చుకోవడమే నా టార్గెట్. సుయోధన సినిమా నాకు యాక్టర్‌గా గొప్ప అనుభవాన్ని నేర్పింది. సాయికుమార్, ప్రియదర్శి పక్కన బెటర్‌గా నటించానని పేరు తెచ్చుకొంటే చాలూ అదే నాకు గొప్ప అవకాశం అని అన్నారు.


Click it and Unblock the Notifications











