Video Interview: బ్రహ్మణులకు జంతువుల కొవ్వుతో తిరుపతి లడ్డా? యంగ్ హీరోయిన్ షాక్ (వీడియో)

తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరో శ్రీ విష్ణు తాజాగా నటించిన చిత్రం స్వాగ్. రాజ రాజ చోర లాంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు హసిత్ గోలి డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆక్టోబర్ 4వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీలక పాత్రను పోషించిన దక్షా నాగార్కర్ పలు విషయాలపై స్పందించారు. ముఖ్యంగా తిరుపతి లడ్డూ వివాదంపై ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ..

తిరుపతి లడ్డూ వివాదం గురించి నేను కూడా విన్నాను. మహా ప్రసాదంగా భావించే దానిలో జంతువుల కొవ్వును కలిపారనే విషయం విని షాక్ అయ్యాను. బ్రహ్మణులు గానీ, శాఖాహారులు గానీ అలాంటి లడ్డును ఏదో సమయంలో తిన్నామని తెలిస్తే.. గుండె పగిలిపోతుంది. వాస్తవంగా ఆ విషయం నిజమైతే అంత కంటే ఘోరం ఏదీ ఉండదు అని దక్ష నాగర్కర్ అన్నారు.

Swag Heroine Daksha Nagarkar Shocking Comments on Animal Fat in Tirupati laddu

తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన కుట్ర వెనుక ఎవరున్నారో కనుక్కోవాలి. వారికి సరైన శిక్ష విధించాలి. భవిష్యత్‌లో అలాంటి పునరావృతంగా కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. భక్తులను ఓ రకంగా మోసం చేసినట్టే. అలాంటి చర్యలను వెంటనే అరికట్టాలి అని దక్ష అభిప్రాయపడ్డారు.

తిరుపతి లడ్డూకు అపచారం కలిగించినందుకు ప్రాయశ్చిత్తంగా పవన్ కల్యాణ్ దీక్ష చేస్తున్నారనే వార్త విన్నాను. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండటంతో పూర్తిగా తెలుసుకోలేకపోయాను. ఇందుకు బాధ్యులైన నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని అనుకొంటున్నాను. శ్రీవారి ఆలయంలో శుద్ది కార్యక్రమం జరిపించి.. మళ్లీ భక్తుల మనోభావాలకు నైతిక మద్దతు ఇవ్వాలని అన్నారు.

ఇదిలా ఉండగా, నలుగు తరాల వంశం, మాతృస్వామ్యం అనే పాయింట్‌తో తెరకెక్కిన స్వాగ్ సినిమాలో శ్రీ విష్ణు నాలుగు పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో మీరా జాస్మిన్, శరణ్య, తదితరులు నటించారు. ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X