Video Interview: ఎన్టీఆర్ అంటే నాకు పిచ్చి.. యంగ్ టైగర్ కోసం ఏం చేశానంటే? (వీడియో)
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు నటించిన విభిన్న కథా చిత్రం స్వాగ్. రాజ రాజ చోర సినిమాతో దర్శకుడిగా పరిచయమైన హసిత్ గోలి ఈ మూవీకి డైరెక్టర్. తెలుగు సినిమా ప్రపంచంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 4వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన దక్షా నగార్కర్ ఫిల్మీబీట్ తెలుగుతో మాట్లాడుతూ..
స్వాగ్ చిత్రం 1551 సంవత్సరంలో ప్రారంభం అవుంది. శ్వాగనిక వంశానికి చెందిన రాజు యయాతి జీవితం, ఆ తర్వాత ఆ వంశంలోని వివిధ కాలంలో ఉన్న వ్యక్తుల ఆధారంగా కథ సాగుతుంది. భవబూతి, సింగ పాత్రలు ఉంటాయి. నేను సింగకు భార్యగా నటిస్తున్నాను అని దక్ష నగార్కర్ తెలిపారు. ఈ సినిమాలో వింజమార రాణి పాత్ర చాలా కీలకమైంది అన్నారు.

దక్ష నగార్కర్ మాట్లాడుతూ.. నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన డ్యాన్స్ అంటే పిచ్చి.. మొదటి నుంచి ఆయన అభిమానినే. ఆయనను ఓ సినిమా సెట్‌లో కలిశాను. ఆయనతో మాట్లాడిన సందర్భం నాకు గొప్ప అనుభూతిని అందించింది. దేవర చిత్రాన్ని థియేటర్‌కు వెళ్లి చూశాను. నాకు బాగా నచ్చిందని అని చెప్పారు.


Click it and Unblock the Notifications











