ఒకే ఒక్క ఛాన్స్.. ఆ స్టార్ హీరోతో ఒక్కసారి.. తమన్నా సింహాద్రి మనసులో మాట
ఫైర్ బ్రాండ్ ట్రాన్స్‌జెండర్, బిగ్‌బాస్ సెలబ్రిటీ తమన్నా సింహాద్రి అంటే ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాతుంది. ఎవరైనా సరే తన అభిప్రాయాన్ని, వాదాన్ని నిర్భయంగా వెల్లడిస్తుంది. బిగ్‌బాస్ షోలోకి వచ్చిన తర్వాత తమన్నాకు సెలబ్రిటీగా మంచి గుర్తింపు వచ్చింది. బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలను దుయ్యబట్టిన తీరు వివాదాస్పదంగా మారింది. అలాంటి తమన్నా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే..

ఆడతనం అంటే ఇష్టం
ఆడతనం అంటే చిన్నతనం నుంచే ఇష్టం. మా అమ్మ నాకు మగ పిల్లల బట్టలు వేస్తే కోపం వచ్చేది. అయితే నా తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయాను. అప్పటి నుంచి నా తల్లికి దూరమయ్యాను. నా కుటుంబ సభ్యులు నన్ను వెలివేశారు అని తమన్నా ఆవేదన వ్యక్తం చేశారు.

టాన్స్‌జెండర్ల గుర్తింపు కోసమే
ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు రావడానికే తాను రాజకీయాల్లోకి ప్రవేశించాను. మంగళగిరిలో నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి ముఖ్య కారణం అదే. నాకంటూ, అలాగే ట్రాన్స్‌జెండర్లపై అవగాహన కల్పించడానికే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాను. అంతేకానీ రాజకీయాలంటే నాకు మోజు కాదు. ఏది ఏమైనా ఆ పోటీ వల్ల ట్రాన్స్‌జెండర్లకు రావాల్సిన గుర్తింపు నాకు వచ్చింది అని తమన్నా సింహాద్రి పేర్కొన్నారు.

బిగ్‌బాస్‌లోకి ఎందుకు ప్రవేశించానంటే
ఇక బిగ్‌బాస్‌లోకి ప్రవేశించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. నా కంటూ ఆర్థికంగా ఉండటానికి, అలాగే నేనంటే ఏమిటో గుర్తింపు తెచ్చుకోవడానికి రియాలిటీ షోలో పాల్గొన్నాను. కానీ అక్కడి పరిస్థితులకు లొంగకుండా నేను ఎలా ఉంటానో అలానే ఉన్నాను. నేను ఎవరికీ భయపడను. దేనికి లొంగను అని తమన్నా తెలిపారు.

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటించాలని
ఇక సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ఉంది. హీరోయిన్‌గా చేయాలనే కోరికతో ఎదురు చూస్తున్నాను. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో నన్ను అందరూ రంభలా ఉంటారని చెప్పారు. నాకు ఉన్న టాలెంట్‌ను వెండితెరపైన ఉపయోగించుకోవాలని ఎదురు చూస్తున్నాను. ఎప్పటికైనా హీరోయిన్‌గా తెర మీద కనిపించాలన్నది నా కోరిక. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తున్నాను అని తమన్నా పేర్కొన్నారు.
Recommended Video

ఖడ్గం సినిమాలో మాదిరిగా చిరుతో ఒక్క ఛాన్స్
తెలుగు సినిమా పరిశ్రమలో నాకు చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించాలని ఉంది. రంభ మాదిరిగా చిరుతో డ్యాన్సులు చేయాలని ఉంది. ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్ అన్నట్టు ఉంది నా పరిస్థితి. ఒకే ఛాన్స్ ఇస్తే నా టాలెంట్ ఏమిటో చూపిస్తాను. తమిళ చిత్ర పరిశ్రమ ట్రాన్స్‌జెండర్లను ఆదరిస్తున్నది. అలాగే టాలీవుడ్ కూడా నాలాంటి ట్రాన్స్‌జెండర్లకు అవకాశాలివ్వాలని కోరుకొంటున్నాను అని తమన్నా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











