ట్విట్టర్ అంకుల్స్‌కి పని పాటా ఉండదు.. నా జీవితంలో మీరెవరు?.. తమన్నా భాటియా

భారతదేశంలోని స్టార్ హీరోయిన్స్‌లో ఖచ్చితంగా ఉండే పేరు తమన్నా భాటియా. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు మిల్కీ బ్యూటీ. గ్లామరస్ రోల్స్ అయినా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలైనా సరే న్యాయం చేయగల అతికొద్దిమంది నటీమణుల్లో తమన్నా ఒకరు. దాదాపు మూడేళ్లుగా నటుడు విజయ్ వర్మతో నడుస్తోన్న రిలేషన్‌కు బ్రేకప్ చెప్పి వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో కొద్దినెలల క్రితం సీనియర్ జర్నలిస్ట్ ప్రేమ నిర్వహిస్తున్న ప్రేమ ది జర్నలిస్ట్ ఛానెల్‌కు తమన్నా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన కెరీర్, విజయ్ వర్మతో రిలేషన్, కెరీర్‌లో పడిన ఇబ్బందుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడం కష్టం

'కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే యాక్టర్ అవ్వాలని కోరుకున్నా. చాలా త్వరగా అందరూ నన్ను స్టార్‌ని చేసేశారు, నా బాధ్యత ఏంటో నాకు అప్పుడే అర్ధమైపోయింది. నేను ఎంచుకున్న రంగం లోతైనది, నిజాయితీగా మంచి పాత్రలను ఎంచుకుంటూనే వచ్చా. ఒక్కపాత్రకే అంకితమైపోకుండా, నటిగా విభిన్న పాత్రలు చేసి మెప్పించాలని అనుకున్నా. నా జీవితంలో అతిపెద్ద ఆఫర్ అంటే బాహుబలియే, ఎక్కడో రాజమౌళి సర్ నా రోల్‌ని మైండ్‌లో ప్రిపేర్ అయిపోయారు, బహుశా నేను కూడా నన్ను చూడలేదు. క్యూట్, బబ్లీ గర్ల్స్ వంటి రోల్స్ చేస్తున్న నాలోనూ ఇంత ఫైర్ ఉంటుందని రాజమౌళికి అనిపించింది' అని తమన్నా గుర్తుచేసుకున్నారు.

Tamannaah Bhatia Opens About The Social Media negativity in Journalist Prema Podcast

ఒత్తిడి ఎదుర్కొన్న సందర్భాలు

'కెరీర్ ప్రారంభం నుంచి కూడా ఇలాంటి ఒత్తిడిని నేను ఎదుర్కోలేదు. నా తొలి తమిళ చిత్రంలో నెగిటివ్ క్యారెక్టర్ చేశా, ప్రతిసారి మేం నటించే పాత్రలను నైతిక కోణంలో చూడలేం. మనుషులందిరికీ మాస్క్ ఉంటుంది, కానీ ఓ యాక్టర్‌కి అలాంటి ముసుగు వేయలేం, ఎప్పుడో ఒకసారి దానిని తీసేయాలి. బాహుబలి తర్వాతే నాలో ఒక మార్పు వచ్చింది. తెలుగు సినిమా ఒక కమర్షియల్ ఫార్మాట్‌లో నడుస్తుంది. ఆ గీత దాటకుండానే నటీనటుల పాత్రలు రాయాల్సి ఉంటుంది' అని తమన్నా భాటియా తేల్చిచెప్పారు.

నా పేరెంట్స్‌ని మాటలతో వేధించారు

'నా తొలి సినిమా మొదలయ్యే సమయానికి సినిమాల్లో నటిస్తున్నానని తెలిసి బంధువులు, స్నేహితులు నా తల్లిదండ్రులను మాటలతో విసిగించేవారు. ఇంత చిన్నపిల్లని యాక్టింగ్‌కి పంపిస్తున్నారు, ఇండస్ట్రీలో దారుణ పరిస్ధితులు ఉంటాయని మా పేరెంట్స్‌ని భయపెట్టారు. కానీ నేనొక యాక్టర్ అవ్వాలని గట్టిగా ఫిక్సయ్యా, వాళ్లు చెప్పిన మాటలను వినుంటే ఇక్కడి వరకు వచ్చే దానిని కాదు. ట్విట్టర్‌లో ఉండే ఆంకుల్స్.. 2023లో అమ్మాయిలు ఎలా ఉండాలో చెబుతుంటారు. రెస్పాన్సిబిలిటీ ఉన్న మీడియా కూడా ఇలాంటి వారి ట్వీట్స్‌ని థంబ్స్‌గా పెట్టి హైలైట్ చేయడం సరైన పనికాదు'ని తమన్నా ఖండించారు.

Tamannaah Bhatia Opens About The Social Media negativity in Journalist Prema Podcast

అన్ని ప్రశ్నలకు గెలుపే సమాధానం

' నన్ను చూసి ఎవరో ఒకరు నటిగా మారాలని అనుకుంటారు. అలాంటి వారికి నేనేం చెబుతున్నాను అన్నదే నాకు ముఖ్యం. ఏ ప్రొఫెషనల్‌లో ఉన్నా ఒక అమ్మాయి ఎదగాలంటే ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది, సక్సెస్ ఒక్కటే అన్ని ప్రశ్నలకు సమాధానం. కాజోల్, రవీనా టాండన్, మాధురి దీక్షిత్, కరిష్మా వంటి నటీమణులు నన్నెంతో ప్రభావితం చేశారు. రైటర్స్, దర్శకులు ఫోన్ చేసి మేం అనుకున్న పాత్రకు మీరే న్యాయం చేయగలరని, అప్పుడే దానికి అర్ధం ఉంటుందని చెప్పినట్లు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలాగే, నేను కూడా కరోనా సమయంలో ఎంతో నేర్చుకున్నా' అని తమన్నా అన్నారు.

ఇంటిమేట్ సీన్స్‌లో అబ్బాయిలు సిగ్గుపడతారు

'ఇండస్ట్రీలో నాకెవ్వరూ గాడ్ ఫాదర్ లేడు, ప్రతి సినిమా నుంచి నేను నేర్చుకున్నదే. కొన్ని తప్పులు చేశా, అవి చేయడం మంచిదైంది.. ఎందుకంటే ఆ తప్పులు గుణపాఠాలు నేర్పాయి. బాహుబలిలో బ్యాక్ చూపించే సీన్ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.. కానీ సెట్‌లో డైరెక్టర్ మాటే ఫైనల్, ఒక నటిగా దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చేయడమే. ఇంటిమేట్, కిస్ సీన్స్ చేసే విషయంలో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ సిగ్గు పడతారు' అని తమన్నా అసలు విషయం బయటపెట్టారు.

విజయ్‌ వర్మకి పెద్ద అభిమానిని

'నా రిలేష‌న్‌ని ఎక్కడా దాయలేదు. ఒకరిపై అభిప్రాయం కలగడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. విజయ్‌ వర్మ నటనకు నేను పెద్ద అభిమానిని, ఎదుటివారిపై సానుభూతి, ఎవరి వ్యక్తిత్వాన్ని కించపరచకపోవడం, ఓర్పు వంటి అరుదైన లక్షణాలు విజయ్‌లో ఉన్నాయి. కొందరు టచ్ చేయడానికి భయపడే క్యారెక్టర్స్ కూడా విజయ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు' అని విజయ్‌తో ప్రేమపై ఓపెన్‌గా చెప్పారు తమన్నా.

Tamannaah Bhatia Opens About The Social Media negativity in Journalist Prema Podcast

హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్‌‌పై

'హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్‌ అనేది అన్ని ఇండస్ట్రీలలో ఉంది. కానీ పరిశ్రమ మార్కెట్‌ను బట్టి నడుస్తుంది, అమ్మాయిలకు కూడా బలమైన మార్కెట్ ఉంటే రెమ్యునరేషన్ అదే మారుతుంది. త్వరలోనే అది హీరోలతో సమానవుతుందన్న నమ్మకం ఉంది. మార్పు మొదలైంది, యువత ఇండస్ట్రీలోకి వస్తోంది. కొందరు మేకర్స్‌ అమ్మాయిలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించి సెట్ మొత్తం నింపేస్తారు. శేఖర్ కమ్ముల, మెహర్ రమేశ్ వంటి దర్శకులు అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారు' అని పారితోషికం విషయంలో హెచ్చుతగ్గులపై తమన్నా కుండబద్ధలు కొట్టారు.

బాలకృష్ణతో రొమాన్స్ చేయాలనుంది

'డీ గ్లామర్ రోల్‌లో పల్లె యువతి క్యారెక్టర్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది, క్యాస్టింగ్, రోల్స్ అనేవి దర్శకుల చేతిలో ఉంటాయి. ప్రేక్షకులు గ్లోబల్ సినిమా చూస్తున్నప్పుడు మేం కమర్షియల్ చట్రంలో ఇరుక్కోకూడదు. బాహుబలిలో అవంతిక పాత్ర చాలా బరువైనది, ఆ క్యారెక్టర్ తర్వాతే మహిళలు ఫిజికల్‌గానూ స్ట్రాంగ్ అని అర్ధమైంది. నేను అందరు స్టార్స్‌తో చేశాను కానీ బాలకృష్ణ గారితో చేయలేదు, ఆయన పక్కన సెట్ చేయమని మేకర్స్‌ని అడుగుతుంటాను. నేను స్టార్‌ని అన్న సంగతి మైండ్‌లోకి రానివ్వను, జనాల్లోకి వచ్చినప్పుడు వారి స్పందన చూసినప్పుడు నేను కూడా స్టార్‌ని అన్న భావన కలుగుతుంది' అని తమన్నా తేల్చేశారు.

Take a Poll

హైదరాబాద్‌లో ఇల్లు ఎందుకు లేదు

'హైదరాబాద్‌లో ఇల్లు ఎందుకు లేదని అందరూ అడుగుతుంటారు.. నా తల్లిదండ్రులు ముంబైలో ఉంటారు. బట్టలు ఉతుక్కోలేను, మధ్య రాత్రిలో ఆకలి వేస్తే ఎవరు తీరుస్తారు. హైదరాబాద్ బాగా అభివృద్ది చెందుతోంది, ఇండియాలో ఏది కొత్తగా వచ్చినా అది హైదరాబాద్‌కి వచ్చేస్తుంది. హైదరాబాదీలు చాలా అభిమానం చూపిస్తారు, జీవించడానికి ఈ నగరం ది బెస్ట్' అని హైదరాబాద్‌పై అభిమానం చాటుకున్నారు తమన్నా భాటియా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X