అప్పుడు ఛాన్స్ దొరకలే.. ఇప్పుడు చిరంజీవితో ఫుల్ రొమాంటిక్‌గా మతిపోయే స్టెప్పులు.. తమన్నా భాటియా
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో వస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్. రామబ్రహ్మం సుంకర సమర్పిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర తన సొంత బ్యానర్ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తమన్నా భాటియా మీడియాతో మాట్లాడుతూ..
ఆగస్టు నెల నాకు చాలా స్పెషల్. నేను నటించిన రెండు భారీ చిత్రాలు ఒకే రోజు వ్యవధిలో విడుదలవుతున్నాయి. ఒక సినిమా మెగాస్టార్ చిరంజీవి, మరొ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో చేశాను. ఇద్దరు సూపర్ స్టార్స్‌తో నటించడంతో నా డ్రీమ్ నెరవేరింది. చిరంజీవి, రజనీకాంత్‌తో కలిసి పనిచేసే అవకాశం అందరికీ రాదు. నాకు లభించడం చాలా హ్యాపీగా ఉంది. భోళా శంకర్, జైలర్ సినిమాలు ప్యాన్ ఇండియా వైడ్‌గా అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి అని తమన్నా భాటియా అన్నారు.

గతంలో సైరా సినిమాలో చిరంజీవితో కలిసి నటించాను. కానీ ఆ సినిమాలో ఆయనతో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి గారితో పాటలకు స్టెప్పులేసే అవకాశం రావడం అదృష్టంగా ఉంది. ఆ పాట కూడా మిల్కీ బేబీ అని ప్రారంభం కావడం హ్యాపీగా ఉంది. ఆ పాట చాలా క్యూట్‌గా ఉంటుంది. ఆ పాటలో డ్యాన్స్ చేయడం ద్వారా చాలా స్టెయిల్స్ ఆయనను చూసి నేర్చుకొన్నాను అని తమన్నా భాటియా అన్నారు.
భోళా శంకర్ సినిమా నా కెరీర్‌లో, నా లైఫ్‌లో స్పెషల్. మిల్కీ బేబీ పాట రొమాంటిక్‌గా, మెలోడిగా సాగుతుంది. ఈ పాటలో ఒక హుక్ స్టెప్ కూడా ఉంటుంది. ఈ పాటలో ఫుల్ గ్రేస్ మూమెంట్స్ ఉంటాయి. ఈ పాటను స్విట్జర్లాండ్‌లోని అద్బుతమైన ప్రదేశాల్లో షూట్ చేశాం అని తమన్నా భాటియా చెప్పారు.

తమిళంలో అజిత్ నటించిన సక్సెస్‌ఫుల్ చిత్రం వేదాళం సినిమాకు రీమేక్‌గా భోళా శంకర్ రూపొందింది. అయితే వేదాళం సినిమాకు భారీగా మార్పులు చేశారు. ఒరిజినల్ సినిమాలో నా పాత్ర చిన్నగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో నా పాత్ర ఫుల్ లెంగ్త్ ఉంటుంది. జైలర్ సినిమా విషయానికి వస్తే.. నాది చిన్న పాత్రే. కావాలయ్య అనే పాట సూపర్ హిట్ అయింది. క్యారెక్టర్ పరంగా రెండు పాత్రలు డిఫరెంట్‌గా, వేర్వేరుగా ఉంటాయి అని తమన్నా భాటియా చెప్పింది.
భోళా శంకర్ సినిమా నాకు మంచి అనుభవాన్ని, అనుభూతిని పంచింది. అన్ని వర్గాలను ఆకట్టుకొనే ఎలిమెంట్స్‌తోపాటు ఫుల్లుగా కమర్షియల్ అంశాలు ఉంటాయి. ఈ సినిమాలో పాటలన్నీ అద్బుతంగా వచ్చాయి. మిల్కీ బేబీ, జామ్ జామ్ పాటలు నాకు బాగా నచ్చాయి. ఈ సినిమాను రాజీ లేకుండా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. గతంలో కూడా వారితో కలిసి పనిచేశాను అని తమన్నా గుర్తు చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











