బొడ్డు వివాదంపై తాప్సీ రియాక్షన్.. కే రాఘవేంద్రరావును కలుస్తా..

టాలీవుడ్, సౌత్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో దుమ్మురేపుతున్న తాప్సీ పొన్ను తాజాగా గేమ్ ఓవర్ అనే సినిమాలో నటించింది. దర్శకుడు శశి రూపొందించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందించినప్పటికీ.. హిందీలో డబ్ అవుతున్నది. ఈ సినిమాను చూసిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విదేశీ భాషల్లో రిలీజ్ చేసేందుకు చర్యలు తీసుకొంటున్నారు. అలాంటి సినిమా రిలీజ్ నేపథ్యంలో తాప్సీ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించింది. ఆమె ఏమన్నారంటే.

సోలో హీరోయిన్‌గా సినిమా చేయడం ఓ ఛాలెంజ్. ఎందుకంటే సినిమా మొత్తంలో ఆడియెన్స్‌ను గ్రిప్పింగ్‌గా ఉంచే బాధ్యత నాపైనే ఉంటుంది. అందుకే నాపై ఒత్తిడి ఉంటుంది. ఒకవేళ ఆడియెన్స్‌ను కనెక్ట్ చేయలేకపోతే నా సత్తా ఏంటో తెలిసిపోతుంది. కేవలం సోలో క్యారెక్టర్ల పరిమితం కాలేదు. గ్లామర్ హీరోయిన్ పాత్రలు చేయాలని ఉంది.

Tapsee Ponnu reaction on K Raghavendra Rao Contraversy

దర్శకుడు కే రాఘవేంద్రరావు రూపొందించిన ఝుమ్మంది నాదం సినిమాలోని ఓ పాట గురించి గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. బొడ్డుపై కొబ్బరికాయంతో కొట్టడంలో ఏం సెక్సప్పీల్ ఉందో తెలియదు. ఆ షాట్ చేసినప్పుడు చాలా బాధపడ్డాను. ఏ పాటకైనా కంటెంట్ ఉండాలి. అలాంటి పాటల్లో డ్యాన్స్ చేయడానికి సిద్ధం. పాటల్లో పూలు, పండ్లతో డ్యాన్స్ చేయాలని కూడా ఉంది. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆ వివాదం గురించి వివరణ ఇవ్వడానికి రాఘవేంద్రరావును కలుస్తున్నాను. ఆయన తప్పకుండా కలిసి మాట్లాడుతాను అని అన్నారు.

హీరోయిన్‌గా మరో హీరోయిన్‌తో పోటీ పడకూడదని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నంబర్ల రేసు నాకు నచ్చదు. ఒకసారి నెంబర్ వన్ అంటూ.. మరోసారి నెంబర్ త్రీ అంటారు. అలాంటి ట్రాక్‌లో ఉండకూడదని ఉద్దేశపూర్వకంగానే డిసైడ్ అయ్యాను. అందుకే నాకంటూ ఓ ట్రాక్‌ను సృష్టించుకొని నాకు నేనుగా పోటీ పడుతున్నాను. ఒక్కదానిని దానిపై పరుగెత్తుతున్నాను అని తాప్సీ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X