Ukraine War 85 ఏళ్ల వ్యక్తి గన్ పట్టుకొని.. గుండెను పిండేసే విషయాలు చెప్పిన తారక్, చెర్రీ, రాజమౌళి

RRR సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం వచ్చిపడింది. కరోనావైరస్ విషయం అందర్ని వెంటాడింది. అయితే కరోనా మా ఒక్కరినే ఎఫెక్ట్ చేయలేదు. అందరం అదే స్థితిలో ఉన్నాం కాబట్టి మాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం నాకు తెలుసు. అందుకే నేను ఈ సినిమా విషయంలో గాబరా పడటలేదు అని రాంచరణ్ చెప్పారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హోరాహోరీ యుద్దం జరుగుతున్న ఉక్రెయిన్ గురించి రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి చెప్పిన షాకింగ్ విషయాలు ఏమిటంటే..

RRR సినిమా పూర్తిగా ఫిక్షనల్

RRR సినిమా పూర్తిగా ఫిక్షనల్

RRR సినిమా అనేది పూర్తిగా ఫిక్షనల్ సినిమా. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్లో ఇలా జరిగి ఉంటే ఎలా ఉంటుందనే కోణంలో కథ రాశాం. అటెన్ బరో తీసిన గాంధీ సినిమాలో కూడా డ్రామా ఉంటుంది. హిస్టారికల్ సినిమా తీస్తే ఎంత డ్రామా ఉంటుందనే లెక్కలేసుకొవాలి. కానీ నేను తీసిన సినిమా పూర్తిగా ఫిక్షన్. కాబట్టి మేము కథాపరంగా చాలా జాగ్రత్తలు తీసుకొన్నాం అని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.

మూడు లాక్‌డౌన్స్ వల్ల అలా జరిగింది

మూడు లాక్‌డౌన్స్ వల్ల అలా జరిగింది

కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా చాలా బడ్జెట్ పెరిగింది. ఆ విషయం మన చేతిలో ఏమి లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బడ్జెట్ పెంచాల్సి వచ్చింది. అయితే కరోనా ఉపద్రవం వల్ల సినిమాకు కొంత మంచే జరిగింది. ఫస్ట్ లాక్‌డౌన్ సమయంలో మేము షూట్ చేసిన మెటీరియల్ తీసుకోవడానికి కూడా అవకాశం దక్కలేదు. కొద్ది రోజులు ఆగి చూసినప్పుడు సినిమాపై కొంత మంచి అభిప్రాయం కలిగింది. రెండో లాక్‌డౌన్ తర్వాత కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టే అవకాశం లభించింది. ఇక మూడో లాక్‌డౌన్ తర్వాత 3డీ వెర్షన్‌పై ఫైన్ ట్యూనింగ్ చేసే అవకాశం లభించింది అని రాజమౌళి చెప్పారు.

ఉక్రెయిన్ షూటింగ్ గురించి రాజమౌళి

ఉక్రెయిన్ షూటింగ్ గురించి రాజమౌళి

ఉక్రెయిన్‌లో RRR సినిమాకు సంబంధించిన షూటింగ్ అనుభవాలు చాలా ఉన్నాయి. ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితులు ఉన్నాయనే విషయం అప్పుడు అక్కడ కనిపించలేదు. అక్కడ మాకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. మా షూటింగ్ యూనిట్‌లో ప్రతీ ఒక్కరికి ఒక టీమ్ ఉండేది. తారక్‌ చాలా మందితో మాట్లాడాడు. చరణ్ కూడా అక్కడి వారితో మాట్లాడారు. నేను కూడా అక్కడి వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడి పరిస్థితులు మారిపోయాయి. వారికి మేసేజ్ చేసి యోగక్షేమాలు కనుక్కొంటే.. వారు చెప్పిన మాటలు మా హృదయాలను కదిలించాయి అని రాజమౌళి అన్నారు.

ఉక్రెయిన్ షూటింగ్ గురించి ఎన్టీఆర్

ఉక్రెయిన్ షూటింగ్ గురించి ఎన్టీఆర్


RRR కోసం ఉక్రెయిన్‌లో ఓ పాట షూట్ చేశాం. ఆ పాట చాలా అద్భుతంగా వచ్చింది. కొద్ది రోజుల్లోనే మీరు తెరపై చూస్తారు. ఇక అక్కడి డ్యాన్సర్లు ఫెంటాస్టిక్. వాళ్ల ప్రొఫెషనలిజం చూసి నేను షాక్ అయ్యాను. ఉక్రెయిన్‌లో ఇంటరాక్టివ్ షూటింగ్ జరిగాయి. అక్కడ ఫుడ్, సంస్క‌ృతి చూసి నేను, చరణ్ ముగ్దులయ్యాం. ఉక్రెయిన్ షూట్ చేయడం నిజంగా ఓ కొత్త అనుభూతి అని ఎన్టీఆర్ అన్నారు.

Recommended Video

RRR : That's Ram, Bheem | RRR Latest Posters || Filmibeat Telugu
85 ఏళ్ల వ్యక్తి గన్ పట్టుకొని అంటూ రాంచరణ్

85 ఏళ్ల వ్యక్తి గన్ పట్టుకొని అంటూ రాంచరణ్


RRR షూటింగ్ కోసం ఉక్రెయిన్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పటి వాతావరణంతో పోల్చుకొంటే చాలా డిఫరెంట్. చాలా పెద్ద యూనిట్‌తో లార్జ్ స్కేల్‌లో షూటింగ్ చేశాం. అక్కడ ఉన్న ప్రజలు చాలా మంచి వారు. సినిమా పరిశ్రమతో వారికి మంచి అనుబంధం, అభిరుచి ఉంది. నా సెక్యూరిటి కోసం కొందరు పనిచేశారు. 85 ఏళ్ల వయసు ఉన్న ఓ వ్యక్తి గన్ పట్టుకొని సెక్యూరిటీ సేవలు అందించారు. అయితే యుద్దం జరుగుతున్న సమయంలో మాతో ఉక్రెయిన్‌లో మాకు పరిచయమైన వారితో మాట్లాడుతున్నాను. వారికి కొంత డబ్బు కూడా నేను పంపించాను. ఈ పరిస్థితుల్లో వారికి ఎంత సహాయం అందించినా చాలా తక్కువే. త్వరలోనే అక్కడ మంచి వాతావరణం నెలకొని వారికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను అని రాంచరణ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X