For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అందుకే విజయ్ దేవరకొండ ఇష్టం: మాళవిక నాయర్.. మీ టూ‌పై సెన్సేషనల్ కామెంట్స్

  |
  Malavika Nair Interview : Chiranjeevi Is My Favorite Hero | Filmibeat Telugu

  దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ హీరోయిన్లలో మాళవిక నాయర్ ఒకరు. మాళవిక నటించిన ఎవడే సుబ్రమణ్యం, మహానటి, టాక్సీవాలా, విజేత చిత్రాలు ఆమె ప్రతిభకు సాక్ష్యంగా నిలిచాయి. తాజాగా ఆమె నటించిన టాక్సీవాలా చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో మాళవిక పాత్రకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. సినిమా సక్సెస్‌తో దూసుకెళ్తున్న నేపథ్యంలో మాళవిక తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..

  టాక్సీవాలాని గీత ఆర్ట్స్ వాళ్ళు తగలబెట్టేస్తారు.. ఇదొక గుణపాఠం, విజయ్ దేవరకొండ రెండోసారి!

  టాక్సీవాలా మూవీతో

  టాక్సీవాలా మూవీతో

  టాక్సీవాలా సక్సెస్‌తో నాపై నాకు నమ్మకం పెరిగింది. నేను ఎంచుకొన్న సబ్జెక్ట్ అని నిరూపించిన సినిమా ఇది. నాకు రాహుల్ సంక్రిత్యన్ కథ చెప్పినప్పుడే ఎక్సైట్ అయ్యాను. రాహుల్‌పై నాకు పూర్తి నమ్మకం ఉండేది. నేను థియేటర్లో రెండుసార్లు ఈ సినిమా చూశాను. మొదట్లో టెన్షన్‌గా చూశాను. రెండోసారి నేను ప్రేక్షకులతో నవ్వుతూ చూశాను. మొత్తానికి చాలా హ్యాపీగా ఉంది.

   చిన్న పాత్రే కానీ బలమైనదీ..

  చిన్న పాత్రే కానీ బలమైనదీ..

  టాక్సీవాలా చిత్రంలో నాది చిన్న పాత్రే కానీ.. సినిమాకు చాలా బలంగా ఉండే రోల్. నాపై చాలా సీన్లు తీశారు. కొన్ని కారణాల వల్ల వాటిని సినిమాలో పెట్టలేకపోయారు. ఆస్ట్రాల్ ప్రొజెక్షన్ (ఆత్మలు మాట్లాడుకోవడం) అనే కాన్సెప్ట్‌పై రాహుల్ ఎంత రీసెర్చ్ చేశారో నాకు తెలుసు. ఆయన కష్టానికి ఫలితం దక్కింది. నా పాత్ర చిన్నదైనా మంచి గుర్తింపు లభిస్తున్నది. అందుకు సంతోషంగా ఉంది.

  నటనకు స్కోప్ ఉంటే..

  నటనకు స్కోప్ ఉంటే..

  హీరోయిన్ పాత్రలకు పరిమితం కాదల్చుకోలేదు. సినిమాలో పాత్ర ప్రభావాన్ని నేను చూస్తాను. నేను పూర్తిగా హీరోయిన్ పాత్రలో కనిపించిన చిత్రం విజేత. మహానటి, టాక్సీవాలాలో ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించాను. నటనకు స్కోప్ ఉన్న పాత్రల కోసం నేను ఎదురుచూస్తాను. హీరోయిన్ పాత్రలే వేయాలనే నిబంధన పెట్టుకోలేదు. టాక్సీవాలాలో క్యారెక్టర్ నచ్చడం వల్లే సినిమా చేశాను.

   పాత్ర నిడివి తక్కువే కానీ

  పాత్ర నిడివి తక్కువే కానీ

  టాక్సీవాలాలో నేను చేసిన పాత్ర పరిధి తక్కువే అయినప్పటికీ ప్రేక్షకులకు నచ్చుతాయనే ఉద్దేశంతోనే చేశాను. మహానటి, టాక్సీవాలా నా నమ్మకాన్ని నిలబెట్టాయి. సినిమా చూసిన తర్వాత నా పాత్ర గుర్తుంటే నాకది చాలూ. సినిమాలో నా క్యారెక్టర్ ఏమిటని చూడను. సినిమాకు ఎంత బలమనేది చూస్తాను. వైవిధ్యం ఉన్న పాత్రలనే చేయాలనుకొంటున్నాను.

   కమర్షియల్ సక్సెస్‌ను పట్టించుకోను

  కమర్షియల్ సక్సెస్‌ను పట్టించుకోను

  నా కెరీర్‌లో కమర్షియల్ సక్సెస్ లేకపోవడాన్ని నేను పెద్దగా పట్టించుకోలేను. సాధారణంగా కమర్షియల్‌ సినిమాలన్నీ హీరో ఓరియెంటెడ్ సినిమాలే. అర్జున్ రెడ్డి సినిమా తీసుకొంటే విజయ్ దేవరకొండకు నటించడానికి చాలా అవకాశం దొరికింది. కమర్షియల్ సక్సెస్ సాధించే స్క్రిప్టు గురించి నేను చూస్తున్నాను.

   మీ టూపై నా అభిప్రాయం ఏమిటంటే

  మీ టూపై నా అభిప్రాయం ఏమిటంటే

  సినీ పరిశ్రమలను మీ టూ ఉద్యమం కుదిపేయడం మంచిదే. ఇలాంటి చర్చ జరగడం మహిళలకు చాలా ఉపయోగకరంగా మారింది. ఆలస్యంగా ఇలాంటి చర్చ జరిగినా పరిశ్రమకు మేలు జరుగుతుంది. కేవలం ఏ ఒక్క పరిశ్రమకో పరిమితం కాలేదు. అన్ని పరిశ్రమల్లోనూ ఇది ఉంది.

  నాకు లైంగిక వేధింపులు..

  నాకు లైంగిక వేధింపులు..

  నాకు జీవితంలో ఎలాంటి లైంగిక వేధింపులు ఎదురుకాలేదు. అందుకు నేను లక్కీ. కెరీర్ ఆరంభంలో నా పేరెంట్స్ చాలా ప్రొటెక్ట్ చేశారు. నా కుటుంబం నాకు బలంగా మారింది. నా వ్యవహారాలు మేనేజర్లే చూసుకొంటారు. కాబట్టి అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు.

  నాకు నచ్చిన హీరో ఎవరంటే..

  నాకు నచ్చిన హీరో ఎవరంటే..

  నాకు నచ్చిన హీరో విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, టాక్సీవాలా చిత్రాల్లో కలిసి నటించాను. ఆయన యాక్టింగ్ అంటే ఇష్టం. ఎవడే షూటింగ్‌లో ఎలా ఉన్నాడో.. అర్జున్ రెడ్డి, గీత గోవిందం భారీ సక్సెస్ తర్వాత కూడా అలానే ఉన్నాడు. రెండు సంవత్సరాల క్రితం టాక్సీవాలాలో పాత్ర ఆయన కారణంగానే వచ్చింది. అందుకే విజయ్ అంటే ఇష్టం అని మాళవిక నాయర్ అన్నారు.

  English summary
  Malavika Nair is an actress who has appeared in Malayalam, Telugu and Tamil language films as a child. She played her first lead role in the Telugu adventurer film in Yevade Subramanyam (2015). Now, She has done good role in Taxiwaala. Her role impressed critics. In this occassion, She speak to Telugu Filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X