జీవితాన్ని రిస్క్‌లో పెట్టా.. ఆ గదిలో అలాంటి కష్టాలు.. వరంగల్ టూ హైద్రాబాద్.. టీవీ నటి మహతి ఎమోషనల్ స్టోరీ
బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటిస్తూ మంచి పాపులారిటీని సొంతం చేసుకొంటున్న నటి మహతి. నటనపై ఉన్న మక్కువతో ఆమె కుటుంబ బాధ్యతలు ఓ వైపు చక్కబెడుతూనే.. తనకు ఇష్టమైన యాక్టింగ్ కెరీర్‌లో సుస్థిరమైన స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా మహతి మీడియాతో మాట్లాడుతూ..

జీవితాన్ని రిస్క్‌లో పెట్టి
స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. కట్ అనే మాటల వినడం కోసం పస్తులు ఉండటానికి కూడా సిద్ధమయ్యాను. ఆస్తులు ఉన్నా అవి నాకు సంతృప్తిని ఇవ్వలేదు. జీవితాన్ని కొంత రిస్క్‌లో పెట్టి టెలివిజన్ పరిశ్రమకు వచ్చాను. నాకు నేనుగా నిలబడి ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను అంటూ మహతి తెలిపారు.

17 ఏళ్లకు పెళ్లి.. 20 ఏళ్లకే ఇద్దరు పిల్లలు
నా చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలు నెత్తిమీద పడ్డాయి. 17 ఏళ్లకే నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేశారు. 20 ఏళ్లకు ఇద్దరు బిడ్డల తల్లినయ్యాను. టెలివిజన్ తెరపై నటిగా రాణించాలనే ఆశతో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాను. చిన్న గది తీసుకొని 2005లో పోరాటాన్ని ప్రారంభించాను. ఆ క్రమంలో అనేక కష్టాలు పడ్డాను అంటూ మహతి చెప్పారు. నా పట్టుదల, లక్ష్యం చేరాలనే కోరిక వల్లే నేను సీరియల్స్ నిర్మించే స్థాయికి వచ్చాను. ప్రస్తుతం నిర్మాణంతోనే కాకుండా పలు మెగా సీరియల్స్‌లో మంచి పాత్రల్లో నటిస్తున్నాను అని మహతి తెలిపారు.

వదినమ్మ సుజిత నాకు స్పూర్తి..
నటనలో వదినమ్మ సీరియల్ ఫేమ్ సుజిత నాకు ఇన్సిపిరేషన్. లక్ష్మీ కల్యాణం, త్రినయిని, అమ్మ సీరియల్స్ పోషించిన పాత్రలు నాకు వ్యక్తిగతం సంతృప్తిని ఇచ్చాయి. అంతేకాకుండా నాకు మంచి పేరును సంపాదించిపెట్టాయి అని మహతి తెలిపారు.
Recommended Video

ఎప్పటికైనా చిరకాలం గుర్తుండిపోయేలా...
ప్రస్తుతం పాపే మా జీవనజ్యోతి సీరియల్‌లో నటిస్తున్నాను. ఆ సీరియల్‌లో నాది నెగిటివ్ రోల్. ఆ పాత్ర కూడా నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం కోవిడ్ కారణంగా షూటింగ్స్‌కు వెళ్లడం లేదు. ఇంటి వద్దే ఉంటున్నాను. ఎప్పటికైనా ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే పాత్రలో నటించాలన్నది నా కోరిక అని మహతి అన్నారు.


Click it and Unblock the Notifications











