‘భారత్‌ను చైనా నుంచి కాపాడేది అతడొక్కడే.. శివుడు ఆడిన ఆటే శివం భజే’

బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, యువ హీరో అశ్విన్ బాబు, యువ హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ నటించిన చిత్రం శివం భజే. గంగా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన చిత్రంలో కమెడియన్ హైపర్ ఆది, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్ నటించారు. ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో న్యూ ఏజ్ కథ తో ఆఫ్సర్ ఖాన్ దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 1వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అశ్విన్ బాబు మాట్లాడుతూ..

శివం భజే సినిమాకు కర్త, కర్మ, క్రియ మా నిర్మాత మహేశ్వర్ రెడ్డి. అఫ్సర్ ఖాన్‌ను తీసుకొచ్చి ఆయన కథ చెప్పించారు. కథ బ్యాక్ డ్రాప్ విన్న మీ పేరు ఏమిటని అడిగాను. ఆయన తన పేరు అఫ్సర్ ఖాన్ అని చెప్పారు. ఆఫ్సర్ ఖాన్ అనే ముస్తిం మతానికి చెందిన వ్యక్తి శివ మాయ గురించి, శివలీల గురించి కథలో మెలికలు పెట్టిన తీరుతో నేను షాక్ గురయ్యాను అని హీరో అశ్విన్ బాబు చెప్పారు.

Telugu Actor Ashwin Babu Bollywood actor and producer Arbaaz Khan s latest movie is Shivam Bhaje

అఫ్సర్‌ను శివలీలను ఇంత అందంగా ఎలా కథలో జొప్పించావని అడిగితే.. కథకు ఎనర్జీ ఇచ్చేలా దేవుడు కావాలి. భారత దేశానికి చైనా నుంచి వచ్చిన ముప్పు ఎదురించి కాపాడే దేవుడు కావాలి. అలా ఏ దేవుడైతే బాగుంటుందని అనుకొన్నప్పుడు నాకు శివయ్యే గుర్తుకొచ్చారని ఆయన చెప్పారని తెలిపారు.

శివ భగవానుడికి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆయనకు భక్తులు అఘోరాలు, నాగసాధువులు, రకరకాల భక్తులు ఉంటారు. దక్షిణ భారతంలో కంటే ఉత్తర భారతంలో ఎక్కువగా భక్తులు శివయ్యకు ఉంటారు. ద్వాదశ జ్యోతిర్లంగాల్లో ఎక్కవ జ్యోతిర్లింగాలు ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. అలాంటి దేవుడి చుట్టూ కథ రాశానని చెప్పినప్పుడు ఎలా రాశారానే విస్మయానికి గురయ్యాన్ని అశ్విన్ బాబు చెప్పారు.

శివం భజే సినిమా మొత్తం శివుడి కృపతోనే జరిగింది. ఈ సినిమా విషయంలో శివ మాయ జరిగింది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి పేరు శివుడితో కనెక్ట్ అయి ఉంది. మేము సినిమాటోగ్రాఫర్ సంప్రదిస్తే.. ఆయన పేరు శివేంద్రే. అలాగే మా అన్నయ్యను కథ గురించి మా అన్నయ్య ఓంకార్‌ను అడిగితే అతడు ఒకే చెప్పాడు. అతడి పేరు శివుడే. ఇలా డెస్టీనీ మమ్మల్ని సినిమా చేసేలా చేసింది అని అశ్విన్ బాబు చెప్పారు.

Telugu Actor Ashwin Babu Bollywood actor and producer Arbaaz Khan s latest movie is Shivam Bhaje

శివం భజే సినిమాలో నాకు ఇష్టమైన దేవుడి ఆయుధం త్రిశూలం, డమరుకం లాంటివి పట్టుకొన్నాననే అంటే నా గత జన్మలో చేసుకొన్న అదృష్టమే అందుకు కారణమని అనుకొంటాను. ఈ సినిమా నా వద్దకు రావడం అంతా దైవలీల అని భావిస్తాను. ఇక ప్రేక్షకులే ఈ సినిమాను చూసి ఎలా ఉందో చెబుతారనే ఎదురు చూస్తున్నాను అని అశ్విన్ బాబు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X