ప్రభాస్ మూవీ అప్‌డేట్ష్ అప్పుడే.. పవన్ కల్యాణ్ మూవీ టైటిల్ రివీల్ ఎప్పుడంటే? టీజీ విశ్వప్రసాద్
సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై దర్శకుడు శ్రీవాస్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం రామబాణం. గోపిచంద్, జగపతిబాబు, డింపుల్ హయతీ, కుష్బూ, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, తరుణ్ అరోరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మే 5వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ..
సినిమా పరిశ్రమలో ఎంట్రీ అయినప్పుడు చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొంటూ సినిమా రంగంలోకి ప్రవేశించాం. సినిమాకు సంబంధం ఉండే ప్రతీ రంగంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. 2015 నుంచి అమెరికాలో మేము ప్లాన్ చేస్తున్నాం. అప్పట్లో దర్శకుడు వీఎన్ ఆదిత్యను అమెరికాకు పిలిచి కంటెంట్ గురించి ఎక్సర్‌సైజ్ చేశాం. మా తొలి ప్రయత్నంగా ఈటీవీలో పాడుతా తీయగా షోను ప్రారంభించాం. అప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది. అందుకే టీవీ షోలు చేయాలని ప్లాన్ చేశాం. ప్రస్తుతం వెన్నెల కిషోర్‌తో అలా మొదలైంది షో ప్రారంభించాం అని విశ్వ ప్రసాద్ చెప్పారు.

సినిమా రంగంలోకి ప్రవేశించడానికి మాకు సినిమానే స్పూర్తి. ఒక్కటి మాత్రం చాలా వేగంగా టాలీవుడ్‌లో 100 సినిమాలను నిర్మించాలనే ప్లాన్‌లో ఉన్నాం. వేగంగా చిత్రాలు చేయడం వల్ల వచ్చే నష్టాలను బ్యాలెన్స్ చేయడానికే ఎక్కువ సినిమాలు చేస్తున్నాం. నిర్మాతగానే నేను నా కెరీర్‌ను కొనసాగిస్తాను. దర్శకత్వం చేపట్టే ఆలోచన లేదు అని టీజీ విశ్వ ప్రసాద్ అన్నారు.
ప్రభాస్, మారుతి సినిమాను ఎలాంటి ఆర్బాటం లేకుండా ప్రారంభించడానికి వేరే కారణాలు ఉన్నాయి. ఆ సినిమా అప్‌డేట్స్ గురించి చెప్పడానికి చాలా సమయం ఉంది. దానికి ప్రత్యేకంగా వేరే కారణాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ సినిమా టైటిల్ గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. త్వరలోనే సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాం అని టీజీ విశ్వ ప్రసాద్ చెప్పారు.

నిర్మాతగా యాక్టీవ్‌గా 5 సంవత్సరాలుగా ప్రొడక్షన్ చేస్తున్నాం. నిర్మాతగా నా కెరీర్‌లో మంచి సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. మధ్యలో కోవిడ్ వలన ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఇటీవల గూఢచారి - 2 లాంచ్ చేసాం. ఆన్ సెట్స్ వెళ్ళడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది. కార్తికేయ-3 ప్లాన్‌లో ఉంది. చందుకు ఇంకొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి అని టీజీ విశ్వ ప్రసాద్ తెలిపారు.


Click it and Unblock the Notifications











