Rama Banam రిలీజ్ ఆలస్యం ఎందుకంటే?.. బాలకృష్ణ సూచించినందుకే .. నిర్మాత విశ్వప్రసాద్ (ఇంటర్వ్యూ)

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై దర్శకుడు శ్రీవాస్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం రామబాణం. గోపిచంద్, జగపతిబాబు, డింపుల్ హయతీ, కుష్బూ, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, తరుణ్ అరోరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మే 5వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ..

రామ బాణం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్:పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్రాండ్ గురించి పట్టించుకోకుండా సినిమా కంటెంట్‌పైనే దృష్టిపెడుతాం. మంచి సినిమా తీయాలనే ధమాకా చేశాం. దర్శకుడు శ్రీవాస్ ఈ కథను తెచ్చినప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనిపించింది. రిచ్ మేకింగ్‌తో ప్రేక్షకులను సంతృప్తి పరుచాలనే ఉద్దేశంతో రామబాణం స్టార్ట్ చేశాం. ప్రొడక్షన్ పనుల్లో నేను జోక్యం చేసుకోను. క్రియేటివ్ పార్ట్ దర్శకుడు శ్రీవాస్ చూసుకొన్నారు అని విశ్వ ప్రసాద్ చెప్పారు.

TG Vishwa Prasad interview about Rama Banam, Nandamuri Balakrishna, Gopichand

సాఫ్ట్‌వేర్ రంగం నుంచి :ఫ్యాక్టరీ కాన్సెప్ట్‌తోనే ఇండస్ట్రీలోకి ప్రవేశించాం. దాని కోసం రెండేళ్లు రిసెర్చ్ చేశాం. ఈ మోడల్‌ను గత ఐదేళ్లుగా అమలు చేస్తున్నాం. సాఫ్ట్ వేర్ రంగం నుంచి వచ్చినప్పటికీ.. సినిమా ఇండస్ట్రీ అనేది నాకు చాలా ఇష్టం. సినిమా, ఐటీ బిజినెస్ వేర్వేరు. రెండింటిని ఒకేలా చూడకూడదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా నిర్మిస్తున్న సినిమాలతో మాకు మంచి సంతృప్తి చేందాం అని

అన్ని భాషల్లో సినిమాలు:మా మొదటి సినిమా కన్నడలో చేశాం. ఆ తర్వాత తెలుగులోకి వచ్చాం. క్రాస్ ఓవర్ సబ్జెక్ట్‌తో హాలీవుడ్ యాక్టర్లతోపాటు అనుష్క శెట్టితో నిశ్శబ్దం అనే సినిమా చేశాం. త్వరలోనే ఇతర భాషల్లో సినిమాలు చేస్తాం. ఈ సినిమాలో యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి. మంచి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే అంశాలు కూడా ఉన్నాయి అని విశ్వ ప్రసాద్ తెలిపారు.

TG Vishwa Prasad interview about Rama Banam, Nandamuri Balakrishna, Gopichand

బాలకృష్ణ సూచించినందుకే టైటిల్:గోపిచంద్ హీరోగా వస్తున్న సినిమాకు రకరకాల టైటిల్స్ అనుకొన్నాం. మేము ఏం టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్న సమయంలో నందమూరి బాలకృష్ణ సూచించడంతో రామబాణం టైటిల్‌ను పెట్టాలని నిర్ణయించుకొన్నాం. ఈ టైటిల్ పెట్టడానికి బాలకృష్ణ కారణం. ఈ సినిమా అన్నదమ్ముల సెంటిమెంట్‌తో నడుస్తుంది. అందుకే ఈ టైటిల్ కరెక్ట్‌గా ఉంటుదని భావించాం అని నిర్మాత విశ్వప్రసాద్ చెప్పారు.

అన్నదమ్ముల సెంటిమెంట్‌తో :అన్నదమ్ముల సంబంధం, సెంటిమెంట్ మీద చాలా సినిమాలు వచ్చినప్పటికీ.. రామబాణం సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతీ మూవీకి కథలో ఓ బలం, ఆత్మ ఉంటుంది. ఆ పాయింట్ ఈ సినిమాకు పాజిటివ్. రామబాణం తప్పకుండా మంచి ఎంటర్‌టైనర్ అవుతుంది. మ్యా బానర్‌లో ఎక్కువ సినిమాలు చేయాలని నిర్ణయించుకొన్నాం. క్రియేటివ్ సైడ్ మాత్రం మేము పట్టించుకోం. ప్రొడక్షన్ ఎంత కాస్ట్, ఎలా చేయాలనే విషయాలపై దృష్టిపెడుతాం అని విశ్వప్రసాద్ తెలిపారు.

TG Vishwa Prasad interview about Rama Banam, Nandamuri Balakrishna, Gopichand

సినిమా రిలీజ్ ఎందుకు లేట్ అంటే?:రామబాణం సినిమా దాదాపు ఒక సంవత్సరం పాటు ప్రొడక్షన్‌లో ఉంది. అందుకే వేరే కారణాలు ఉన్నాయి. ఆ విషయాలను, కారణాలను దర్శకుడు శ్రీవాస్ చెబుతారు. గోపిచంద్ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల కొద్ది రోజులు షూటింగ్ ఆగింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో సమ్మె కారణంగా ఓ నెలపాటు షూటింగ్ ఆగింది. ఓవరాల్‌గా సినిమా మాకు మంచి అవుట్‌పుట్ వచ్చింది. ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని అనుకొన్నాం. కానీ సమ్మర్ అయితే ఎక్కువ రీచ్ ఉంటుందని అనుకొన్నాం అని విశ్వ ప్రసాద్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X