అలా అయితే నాకు విడాకులే.. ఈ నగరానికి ఏమైంది? గురించి తరుణ్ భాస్కర్

By Rajababu

Recommended Video

EE Nagaraniki Emaindi Director Tharun Bhascker Exclusively Shares Movie Experience

పెళ్లి చూపులు చిత్రంతో దర్శకుడు తరుణ్ భాస్కర్ అవార్డులు, రివార్డులతో హోరెత్తించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో తరుణ్ భాస్కర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో తన తదుపరి చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ నగరానికి ఏమైంది? అనే ఓ విభిన్న కథా చిత్రంతో తరుణ్ భాస్కర్ జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, అనిషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరీ నటించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర రిలీజ్‌ను పురస్కరించుకొని తరుణ్ భాస్కర్ తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. తరుణ్ భాస్కర్ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

కాన్ఫిడెన్స్ పెరిగింది

కాన్ఫిడెన్స్ పెరిగింది

పెళ్లి చూపులు ఘన విజయం తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా వస్తున్న నేపథ్యంలో కొంత ఒత్తిడి తగ్గింది. టెక్నికల్‌గా పెళ్లిచూపులు కంటే మంచి స్టాండర్ట్స్ ఉంటాయి. పెళ్లిచూపులు అవార్డు, రివార్డులు రావడంతో మేకింగ్ విషయంలో బ్యాలెన్స్ వచ్చింది. ఈ చిత్రంపై కాన్ఫిడెన్స్ పెరిగింది. పెళ్లిచూపులు షూట్ సమయంలో డబ్బుల సమస్య కొంత ఉండేది. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్ కావడంతో కొంత రిలీఫ్ ఉంది.

ఉద్వేగానికి లోనయ్యా

ఉద్వేగానికి లోనయ్యా

పెళ్లి చూపులు తర్వాత వచ్చిన ప్రశంసల నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ సక్సెస్‌ను అర్థం చేసుకొని తదుపరి సినిమాపై దృష్టిపెట్టడానికి కొంత సమయం పట్టింది. పెళ్లిచూపులు సక్సెస్‌తో ఉద్వేగానికి లోనయ్యా. ఆ సమయంలో కథ రాస్తే ఎలా ఉంటుందో అనే సందేహంతో కొంత టైమ్ తీసుకొన్నాను.

 పెద్ద హీరోలతో రిస్క్

పెద్ద హీరోలతో రిస్క్

పెళ్లి చూపులు సక్సెస్ తర్వాత పెద్ద హీరోలతో పనిచేయకుండా చిన్న హీరోలతో చేయడం వెనుక ప్రత్యేకించి కారణాలు లేవు. కథ డిమాండ్ మేరకే కొత్తవారితో పనిచేయాల్సి వచ్చింది. కథ కారణంగానే పెళ్లిచూపులు సక్సెస్ లభించింది. పెద్ద హీరోలంటే వారి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమా చేయాల్సి ఉంటుంది. పెళ్లిచూపులులో కూడా పెద్దగా తెలిసిన నటీనటులు లేరు.

స్టార్ హీరోలు ఆఫర్

స్టార్ హీరోలు ఆఫర్

పెళ్లిచూపులు తర్వాత ఇండస్ట్రీలో పెద్ద హీరోల నుంచి పిలుపు వచ్చాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్, నాగార్జున సార్‌ను కలిశాను. వారు పెళ్లిచూపులు చూసి నా పనితీరును అభినందించారు. చాలా మంది హీరోలు సినిమాలు చేద్దామని అడిగారు. ఎప్పుడైనా కలిసి పనిచేయడానికి మేము రెడీ అని చెప్పారు

టైటిల్‌ పెట్టడానికి కారణం

టైటిల్‌ పెట్టడానికి కారణం

ఈ నగరానికి ఏమైంది అనే టైటిల్ పెట్టడానికి కారణం నా బెస్ట్ ఫ్రెండ్ కౌశిక్. ఎవరికీ నచ్చదని అనుకొన్నాను. కానీ నిర్మాత సురేష్ బాబుకు కూడా నచ్చడంతో వెంటనే రిజిస్టర్ చేశాం. ఈ చిత్రంలో మద్యానికి వ్యసనం కావడం అనేది ఓ పాయింట్. దానిని దృష్టిలో పెట్టుకొని సినిమా చేశాం. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది.

 సురేష్ బాబుకు నచ్చడంతో

సురేష్ బాబుకు నచ్చడంతో

హ్యాంగోవర్, రాక్ ఆన్, దిల్ చాహ్తా హై, జిందగీ నా మిలేగి దుబారా చిత్రాల మాదిరిగా ఉంటుంది. స్నేహితులు, వారి జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలను సన్నివేశాలుగా మలిచాం. ఈ సినిమా కథను సురేష్ బాబుకు చెప్పడంతో వెంటనే షూటింగ్‌కు వెళ్లిపోండి అని భరోసా ఇచ్చారు. నటీనటలు ఎంపిక కూడా చక్కగా కుదిరింది. ఈ సినిమా ద్వారా అభినవ్ గోమటం అనే వ్యక్తి తెలుగు తెరకు మంచి నటుడుగా దొరుకుతాడు.

 రూ.150 గోవా టూర్

రూ.150 గోవా టూర్

ఈ నగరానికి ఏమైంది నా జీవిత కథ కాదు. అలా అయితే నా భార్య నాకు విడాకులు ఇవ్వడం ఖాయం. నా ఫ్రెండ్స్ జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనల ఆధారంగా పాత్రలను రాసుకొన్నాను. గోవాలో అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం. గోవాను కొత్తగా చూపించాం. 150 రూపాయలతో గోవా టూర్‌కు వెళ్లిన ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది.

అలా అనుకొంటే పొరపాటే

అలా అనుకొంటే పొరపాటే

వివేక్ సాగర్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఈ చిత్రంలో కొంకణ్, రష్యన్ భాషలో పాటలు ఉంటాయి. ఇప్పటికే పాటలకు మంచి రెస్సాన్ వచ్చింది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కల్పిస్తుంది. నా పేరు చూసి సినిమాకు ప్రేక్షకులు వస్తారనుకోవడం పొరపాటే. టైటిల్, కథ, పెళ్లిచూపులు కారణంగానే థియేటర్‌కు ప్రేక్షకులు వస్తారని భావిస్తున్నాను.

మూడో సినిమా సురేష్ ప్రొడక్షన్‌లోనే

మూడో సినిమా సురేష్ ప్రొడక్షన్‌లోనే

మూడో సినిమాపై ఇంకా ఎలాంటి నిర్ణయం లేదు. కానీ నా తదుపరి చిత్రం సురేష్ ప్రొడక్షన్‌లోనే ఉంటుంది. కథ రాసుకొన్న తర్వాతే హీరో ఎవరనేది ఆలోచిస్తాను. రానా, వెంకటేష్‌తో సినిమా తీసే అవకాశం వస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X