అందుకే నా భార్యను మంగళసూత్రం ధరించొద్దని చెప్పా.. రాహుల్ రవీంద్రన్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్ఫణలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు నటించారు.
ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహాి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫిని, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 7వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ప్రమోషన్స్‌లో భాగంగా రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. తన పెళ్లి గురించి, దాంపత్య జీవితం గురించి ఆసక్తికరంగా వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల్లోకి వెళితే..

ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఎమోషనల్ డ్రామా. ఈ సినిమా చూసిన తర్వాత అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకు రాదు. ఈ మూవీ రిలీజ్ తర్వాత ఈ చిత్రంలోని పాత్రల గురించి, సన్నివేశాల గురించి ప్రేక్షకులు చర్చించుకొంటారు. ఈ చిత్రంలోని కథను క్యారెక్టర్లు నడిపిస్తాయి. పాత్రల చుట్టూ తిరిగే కథ. చాలా విషయాలు కావాలనే దాచిపెట్టాం. సినిమా చూసేటప్పుడు థ్రిల్లింగ్ కలిగించాలని అలా నిర్ణయించాం అని రాహుల్ రవీంద్రన్ చెప్పాడు.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక అద్బుతంగా నటించింది. ఆమె పూర్తిస్థాయిలో పాత్రలో లీనమైంది. ఈ సినిమా ద్వారా ఆమె నాకు ఓ బహుమతిలా దొరికింది. పూర్తిస్థాయిలో తన పాత్రకు న్యాయం చేసింది. పాత్రను ఆకళింపు చేసుకొని నటించింది. తన పాత్రలో నటించిందని చెప్పడం కంటే.. జీవించిందా? అనే రేంజ్‌లో నటించింది అని రాహుల్ పేర్కొన్నారు.
రష్మిక, విజయ్ దేవరకొండ ఎంగేజ్‌మెంట్ గురించి ప్రశ్నను దాటవేశారు. ఆ విషయం గురించి నాకు తెలియదు. ఆమె నాకు కో ఆర్టిస్ట్ మాత్రమే. విజయ్ నాకు మంచి స్నేహితుడు. అంతకుమించి వారి వ్యక్తిగత జీవితం గురించి నాకు తెలియదు అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. మన్మథుడు 2 సినిమా డిజాస్టర్ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా నాకు చాలా విషయాలు నేర్పించింది అని చెప్పాడు.
ప్రేమ, పెళ్లి, మహిళా సాధికారిత గురించి మాట్లాడుతూ.. నేను మహిళా పక్షపాతిని. వారికి స్వేచ్ఛ ఇవ్వాలనుకొనే వాడిని. పెళ్లి సమయంలో మంగళసూత్రం ధరించాలా? వద్దా? అనే విషయం గురించి నా భార్యతో మాట్లాడుకొన్నాం. నీకు ఇష్టమైతే ధరించమని చెప్పాను. వివాహిత అని చెప్పుకోవడానికి మహిళలే ఎందుకు మంగళసూత్రం ధరించాలి? మగవాళ్లకు ఆ విషయం చెప్పుకోవడానికి ఎందుకు సంకోచించాలి. మహిళ వివాహిత అని చెప్పుకోవడానికి మంగళసూత్రమే సాక్ష్యం కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











