Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మోహన్ లాల్ సడెన్‌గా వచ్చి కొట్టేశాడు.. తోలు బొమ్మలాట హీరో కామెంట్స్
ఎంతసేపు యాక్షన్, మాస్ మసాలా కాన్సెప్ట్‌లతో సినిమాలు వస్తోన్న నేపథ్యంలో.. పల్లెటూరి ప్రేమలు, ఆహ్లాదకరమైన హాస్యం, కుటుంబ బంధాలు, ప్రేమానురాగాలతో కూడిన సినిమా ఒకటి వస్తోంది. అలాంటి జానర్లో శతమానంభవతి వచ్చి పెద్ద సక్సెస్ సాధించగా.. మళ్లీ అలాంటి బంధాలను గుర్తు చేసేందుకు తోలుబొమ్మలాట అనే చిత్రం రాబోతోంది. మోషన్ పోస్టర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ హీరో విశ్వంత్ మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించాడు.
కేరింత సమయం నుంచే దర్శకుడు విశ్వనాథ్ తనకు పరిచయమని , ఒకే రూమ్‌లో ఉండేవాళ్లమని హీరో విశ్వంత్ చెప్పుకొచ్చాడు. జెర్సీ మూవీ టైమ్‌లోనే ఈ కథ చెప్పాడని, అయితే డేట్స్ లేకపోతే మాత్రం చేయలేనని చెప్పానని, మధ్యలో ఓ నాలుగు రోజులు ఈ రెండు మూవీ షూట్స్ చేయడం చాలా కష్టంగా అనిపించిందని, చివరకు డేట్లు సెట్ అవడంతో ఈ సినిమాను ఓకే చేశానని అన్నాడు.
ఈ సినిమాలో ప్రత్యేకంగా ఓ హీరో అంటూ లేడని, ప్రతీ పాత్ర దానికదే ప్రత్యేకమని, అన్ని క్యారెక్టర్స్‌కు ఇంపార్టెన్స్ ఉంటుందని పేర్కొన్నాడు. కథ నచ్చితినే సినిమాలు చేస్తానని, తన పాత్రకు ప్రాముఖ్యం ఇస్తామని, పెద్ద బ్యానర్ అని చెబితే ఒకే చెప్పనని తెలిపాడు. కథ నచ్చితే పాత్ర గురించి ఆలోచించని అన్నాడు.
మనమంతా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో మోహన్ లాల్ఎంతో క్లోజ్‌గా ఉండేవారు.. ఒకరోజు సడెన్‌గా వెనక నుంచి వచ్చి భుజంపై కొట్టారు.. అంత సరదాగా ఉండేవారు.. అలా సీనియర్స్ క్లోజ్‌గా ఉంటే నటించడం చాలా ఈజీ అవుతుందని అన్నాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్ కూడా ఎంతో చనువుగా ఉండేవారు.. అందుకే ఆయనతో నటించడం కూడా సులభంగానే అనిపించిందని తెలిపాడు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం, మాటలు చక్కగా కుదిరాయని అన్నాడు.