twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ లాల్ సడెన్‌గా వచ్చి కొట్టేశాడు.. తోలు బొమ్మలాట హీరో కామెంట్స్

    |

    ఎంతసేపు యాక్షన్, మాస్ మసాలా కాన్సెప్ట్‌లతో సినిమాలు వస్తోన్న నేపథ్యంలో.. పల్లెటూరి ప్రేమలు, ఆహ్లాదకరమైన హాస్యం, కుటుంబ బంధాలు, ప్రేమానురాగాలతో కూడిన సినిమా ఒకటి వస్తోంది. అలాంటి జానర్‌లో శతమానంభవతి వచ్చి పెద్ద సక్సెస్ సాధించగా.. మళ్లీ అలాంటి బంధాలను గుర్తు చేసేందుకు తోలుబొమ్మలాట అనే చిత్రం రాబోతోంది. మోషన్ పోస్టర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ హీరో విశ్వంత్ మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించాడు.

    కేరింత సమయం నుంచే దర్శకుడు విశ్వనాథ్ తనకు పరిచయమని , ఒకే రూమ్‌లో ఉండేవాళ్లమని హీరో విశ్వంత్ చెప్పుకొచ్చాడు. జెర్సీ మూవీ టైమ్‌లోనే ఈ కథ చెప్పాడని, అయితే డేట్స్ లేకపోతే మాత్రం చేయలేనని చెప్పానని, మధ్యలో ఓ నాలుగు రోజులు ఈ రెండు మూవీ షూట్స్‌ చేయడం చాలా కష్టంగా అనిపించిందని, చివరకు డేట్లు సెట్ అవడంతో ఈ సినిమాను ఓకే చేశానని అన్నాడు.

    Tholu Bommalata Hero Viswant Duddumpudi Interaction With Media

    ఈ సినిమాలో ప్రత్యేకంగా ఓ హీరో అంటూ లేడని, ప్రతీ పాత్ర దానికదే ప్రత్యేకమని, అన్ని క్యారెక్టర్స్‌కు ఇంపార్టెన్స్ ఉంటుందని పేర్కొన్నాడు. కథ నచ్చితినే సినిమాలు చేస్తానని, తన పాత్రకు ప్రాముఖ్యం ఇస్తామని, పెద్ద బ్యానర్ అని చెబితే ఒకే చెప్పనని తెలిపాడు. కథ నచ్చితే పాత్ర గురించి ఆలోచించని అన్నాడు.

    మనమంతా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో మోహన్ లాల్ఎంతో క్లోజ్‌గా ఉండేవారు.. ఒకరోజు సడెన్‌గా వెనక నుంచి వచ్చి భుజంపై కొట్టారు.. అంత సరదాగా ఉండేవారు.. అలా సీనియర్స్ క్లోజ్‌గా ఉంటే నటించడం చాలా ఈజీ అవుతుందని అన్నాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్ కూడా ఎంతో చనువుగా ఉండేవారు.. అందుకే ఆయనతో నటించడం కూడా సులభంగానే అనిపించిందని తెలిపాడు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం, మాటలు చక్కగా కుదిరాయని అన్నాడు.

    English summary
    Tholu Bommalata Hero Viswant Duddumpudi Interaction With Media. She Revaeled About Her Personal Life And Tells Some InterestingFacts About Movie. This Movie Is Directed By Vishwanath Maganti.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X