twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి పాత్రలు చేయను.. రొమాంటిక్‌గా నాకు హద్దులు.. తోలుబొమ్మలాట హీరోయిన్

    |

    సినీ ఇండస్ట్రీ.. కమర్షియల్ ఫార్మాట్ చుట్టూ తిరుగుతూ ఉన్న ఈ నేపథ్యంలో ఓ అచ్చ తెలుగు సినిమాను చూసి చాలా కాలమే అయింది. పల్లెటూరి ప్రేమలు, ఆహ్లాదకరమైన హాస్యం, కుటుంబ బంధాలు, ప్రేమానురాగాలతో కూడిన సినిమాలు రావడం తగ్గిపోయాయి. ఈ కాలంలో అలాంటి జానర్‌లో శతమానంభవతి వచ్చి పెద్ద సక్సెస్ సాధించింది. మళ్లీ అలాంటి బంధాలను గుర్తు చేసేందుకు తోలుబొమ్మలాట అనే చిత్రం రాబోతోంది. మోషన్ పోస్టర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ హీరోయిన్ హర్షితా చౌదరి మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది.

     ప్రతీ అమ్మాయి కనెక్ట్ అయ్యే పాత్ర

    ప్రతీ అమ్మాయి కనెక్ట్ అయ్యే పాత్ర

    ఈ చిత్రంలో తాను ప్రతీ అమ్మాయి కనెక్ట్ అయ్యే పాత్ర పోషించినట్టు తెలిపింది. ఇంట్లో వారందరితో ప్రేమగా ఉంటూ.. ఇన్నోసెంట్ క్యారెక్టర్‌ను చేశాను. యాడ్స్‌లో నటించడం సులభమే కానీ, సినిమాలు చేయడం అంత తేలికైన విషయం కాదు. సినిమాలకు వచ్చే సరికి ఆ పాత్రలతో ప్రయాణం చేయాల్సి వస్తుంది. అన్ని విమర్శలను తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

     అలాంటి పాత్రలే చేస్తాను..

    అలాంటి పాత్రలే చేస్తాను..

    కొన్ని యాడ్స్‌లో నటించాను.. సినిమాల కోసం తాను అంతగా ప్రయత్నించలేదని తెలిపింది. ఆఫర్స్ వస్తే అందులోంచి మంచివి సెలెక్ట్ చేసుకుందామని, అందులోనూ తనకు రొమాంటిక్ సన్నివేశాలు, డ్రెసింగ్ విషయాల్లో చాలా హద్దులున్నాయని తెలిపింది. తాను అలాంటి పాత్రలు చేయలేనని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ గురించి తెలుసు కాబట్టి.. మొదటగా తన తల్లిదండ్రులు వద్దని అన్నారు. ఒకవేళ చేస్తే మంచి పాత్రలను చేయమని సలహా ఇచ్చారని తెలిపింది.

    చాలా నేర్చుకున్నాను..

    చాలా నేర్చుకున్నాను..

    రాజేంద్ర ప్రసాద్ పెద్ద యాక్టర్ వస్తుంటే భయమేసిందని చెప్పుకొచ్చింది. వారి రేంజ్‌లో యాక్ట్ చేయడం అంటే కష్టమేనని.. వారి దగ్గరి నుంచి చాలా నేర్చుకున్నాని తెలిపింది. ఈ సినిమాతో టైమ్ మ్యానేజ్‌మెంట్, పాజిటివ్‌గా థింకింగ్ చేయడం లాంటివి నేర్చుకున్నానని పేర్కొంది.

    ఈ పాత్రను ఇంకా బాగా చేయొచ్చు..

    ఈ పాత్రను ఇంకా బాగా చేయొచ్చు..

    ఫైనల్ ఎడిట్ చూశాక ఈ పాత్రను ఇంకా బాగా చేయొచ్చు అని అనుకున్నా.. తరువాతి చిత్రంలో ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నా. తన దగ్గరు వచ్చిన సబ్జెక్ట్స్‌లో.. మంచివి సెలెక్ట్ చేసుకుంటానని తెలిపింది. రొమాంటిక్ పాత్రలు, డ్రెస్సింగ్‌లో నాకు చాలా పరిమితులున్నాయి. సినిమాలే తనకు లోకం కాదని.. చేసినా మంచివే చేద్దామని చూస్తున్నట్లు తెలిపింది.

    డబ్బంగ్ చెప్పాను కానీ..

    డబ్బంగ్ చెప్పాను కానీ..

    తన పాత్రకు డబ్బింగ్ చెప్పానని కానీ, తన వాయిస్ బేస్‌గా, హస్కీగా ఉంటుందని తెలిపింది. డబ్బింగ్ చెప్పాను.. తెరపై చూసినప్పుడు అందరి అటెన్షన్ తన వాయిస్‌పైనే ఉంటుందని.. రిస్క్ ఎందుకని వద్దనుకున్నాను. వేరే అమ్మాయి డబ్బింగ్ చెప్పడమే తనకు కలిసి వచ్చిందని తెలిపింది.

    Recommended Video

    Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
    డైలాగ్స్ బాగుంటాయి..

    డైలాగ్స్ బాగుంటాయి..

    ఫస్ట్ సినిమాగా ఇలాంటి కథను ఎంచుకున్నాడేంటీ అనుకున్నా.. కానీ కథ విన్నాక చాలా బాగా అనిపించిందని పేర్కొంది. ఈ మూవీలో డైలాగ్‌లు చాలా లోతుగా ఉంటాయని, పాటలతోనే తమ మధ్య ఉండే బంధాలను చక్కగా చూపించారని తెలిపింది. డైరెక్టర్ చాలా చక్కగా హ్యాండిల్ చేశారని పేర్కొంది. ఇలాంటివి నీకు అవసరమా? అని తన తల్లిదండ్రులు అనుకునే సినిమాలు చేయలేనని.. వారితో కలిసి కూర్చొని చూసే చిత్రాన్ని చేయాలనుకుంటున్నానని తెలిపింది.

    English summary
    Tholu Bommalata Heroin Harshitha Chowdary Interaction With Media. She Revaeled About Her Personal Life And Tells Some InterestingFacts About Movie. This Movie Is Directed By Vishwanath Maganti.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X