బీహార్‌లో పవన్ కల్యాణ్ అలా ఫేమస్.. పవర్ స్టార్‌కు ఫుల్ ఫాలోయింగ్.. FDFS హీరోయిన్ సంచిత (ఇంటర్వ్యూ)

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌లో రూపొందిన యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ First Day First Show. జాతి రత్నాలుతో బ్లాక్ బస్టర్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కేవీ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, టిక్‌టాక్ స్టార్ సంచిత బాషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. నటుడు, నిర్మాత ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2 తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరోయిన్ సంచితా బాషు మీడియాతో మాట్లాడుతూ..

నేను బీహార్‌కు చెందిన టిక్‌టాక్ స్టార్‌ను

నేను బీహార్‌కు చెందిన టిక్‌టాక్ స్టార్‌ను

నా పేరు సంచితా బసు. నేను బీహార్ రాష్ట్రానికి చెందిన దానిని. నేను టిక్ టాక్ స్టార్‌ను. నేను చేసిన టిక్ టాక్ వీడియో వైరల్ కావడం, ఈ సినిమా యూనిట్ ఆ వీడియోను చూసి నన్ను సంప్రదించారు. First Day First Show సినిమాలోని పాత్రకు నేను కరెక్ట్‌గా సరిపోతారని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చారు. బీహార్ నుంచి చాలా తక్కువ మంది వస్తారు. కానీ నేహా శర్మ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నాకు స్పూర్తి. బీహార్ నుంచి చాలా మంది బాలీవుడ్‌లో ఉన్నారు అని సంచితా బసు తెలిపారు.

టిక్‌టాక్‌లో సినిమాలు చూసి..

టిక్‌టాక్‌లో సినిమాలు చూసి..

సోషల్ మీడియాలో టిక్‌టాక్‌లో నా వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. వాటిని చూసిన దర్శకుడు అనుదీప్ నా కాస్టింగ్ మేనేజర్‌కు ఫోన్ చేసి లుక్ టెస్ట్‌కు రమ్మని అడిగారు. వాస్తవానికి ఈ సినిమా కోసం నన్ను లుక్ టెస్ట్ చేయలేదు. కానీ First Day First Show సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. నాకు చిన్నతనం నుంచే నటిని కావాలనే కోరిక ఉంది. కానీ ఇంత చిన్న వయసులో నాకు ఓ సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం రావడం నా అదృష్టం. నా వయసు 12th class చదువుతున్నాను అని సంచితా బసు చెప్పారు.

భాష నాకు సమస్య అయినా..

భాష నాకు సమస్య అయినా..

డైరెక్టర్ అనుదీప్ కామెడీ సినిమాలు తీస్తారు. నాకు భాష ఓ సమస్య ఉంది కాని.. నేను షూటింగ్‌కు వచ్చే ముందు నేను చాలా భయపడ్డాను. కానీ టీమ్ నాకు చాలా కంఫర్ట్ ఇచ్చారు. నాకు డైలాగ్స్‌ను హిందీలో ఇచ్చారు. వాటిని నేను వాటిని బాగా ప్రాక్టీస్ చేసి డైలాగ్స్ చెప్పాను.దాంతో ఆయన కామెడీ లైన్స్‌‌ను పర్‌ఫెక్ట్‌గా అర్ధం చేసుకొన్నాను. లక్ష్మీనారాయణ, వంశీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నన్ను బాగా గైడ్ చేశారు. నన్ను బాగా ఎంకరేజ్ చేశారు అని సంచితా బసు తెలిపారు.

 పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా నటిస్తున్నా

పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా నటిస్తున్నా

First Day First Show సినిమాలో లయ అనే పాత్రను పోషిస్తున్నాను. నేను టిక్ టాక్ వీడియోలు చేసే యువతిగా నటిస్తున్నాను. నేను ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ను. పవన్ కల్యాణ్‌ను అభిమానితో ప్రేమలో పడుతాను. ఖుషీ సినిమా రిలీజ్ రోజున ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ కావాలని అడుగుతాను. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా కథ అని సంచిత చెప్పారు.

బీహార్‌లో పవన్ కల్యాణ్‌కు క్రేజ్

బీహార్‌లో పవన్ కల్యాణ్‌కు క్రేజ్

First Day First Show సినిమాలో అవకాశం రాకముందే నాకు పవన్ కల్యాణ్ సార్ తెలుసు. ఆయన సినిమాలు హిందీలో డబ్ అయితే చూశాం. కానీ నేను చూసిన సినిమాల తెలుగు పేర్లు తెలియవు. బీహార్‌లో పవన్ కల్యాణ్‌కు మంచి క్రేజ్ ఉంది. ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. బీహార్ వాసులకు సౌత్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఖుషీ సినిమా హిందీ వెర్షన్‌లో చూశాను. నాకు బాగా నచ్చింది అని సంచిత అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X