‘రజనీకాంత్ కూతురు నా వెంటపడింది.. తలైవా అలాంటి షాక్’
సూపర్ స్టార్స్ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్‌తోపాటు టాలెంటెడ్ స్టార్స్ రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్ నటించిన వేట్టయన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొంటున్నది. జై బీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మాత సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రంలో ఘన విజయం సాధిస్తున్న నేపథ్యంలో దర్శకుడు జ్ఞానవేల్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎన్‌కౌంటర్ల గురించి వచ్చిన వార్తలను చదివాను. స్వతహాగా జర్నలిస్టును కావడంతో ఆ కోణంలో పరిశోధించాను. ఎన్‌కౌంటర్లు చేయడం సమంజసమేనా? వాటిలో ఎంత వరకు వాస్తవం ఉంది. తమిళనాడులో ఎన్‌కౌంటర్, తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ల పేరిట అమాయకులను కాల్చి చంపడం నన్ను కదిలించి వేసింది. ఇలాంటి దుర్మార్గమైన సంఘటనల్లో రాజకీయ నేతలు, సంపన్నవర్గాలు తప్పించుకోవడం దారుణం అని అన్నారు.

జైభీమ్ సినిమా రిలీజ్ తర్వాత నాతో రజనీకాంత్, ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ పొగిడారు. నా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. రజనీ లాంటి గొప్ప హీరో నా వర్క్‌ను పొగడటం నాకు గర్వంగా అనిపించింది. ఆ తర్వాత రజనీకి సరిపడే ఏదైనా కథ ఉందా? అని ఐశ్వర్య రజనీకాంత్ వాకబు చేశారు. పలుమార్లు ఏదైనా నాన్నకు సరిపడే కథ రాయమని అడుగుతూ నాతో చర్చలు జరిపారు అని జ్ఞానవేల్ తెలిపారు.
ఐశ్వర్య రజనీకాంత్ సూచన మేరకు రజనీ సార్‌ను కలిశాను. అప్పడే ఆయనతో ఓ మాట చెప్పాను. నేను మీ తరహా కమర్షియల్ సినిమాలు తీయడం నాకు రాదు అని చెప్పాను. అయితే కమర్షియల్ సినిమాలు కావాలంటే నేను లోకేష్ కనకరాజ్, నెల్సన్ లేదా వేరే డైరెక్టర్లను అప్రోచ్ అయ్యేవాడిని అంటూ షాకిచ్చారు. కానీ ఆ తర్వాత నీ తరహా చిత్రంలో నేను నటించాలని అనుకొంటున్నానని రజనీ చెప్పారు. దాంతో వేట్టయన్ కథ చెప్పడంతో ఆయన ఒకే చేశారు అని అన్నారు.

రజనీకాంత్‌తో రూపొందించే సినిమా కథ నా తరహా అయినప్పటికీ.. ఆయన ఫ్యాన్స్‌ను అలరించే అంశాలు, కంటెంట్‌తో చిత్రాన్ని తెరకెక్కించడమే నా మెయిన్ టార్గెట్‌గా భావించాను. ఇలాంటి కథలో రజనీ స్టైయిల్, స్వాగ్, మేనరిజాన్ని జోడించడమే నాకు ఛాలెంజింగ్‌గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత రజనీ ఫెర్ఫార్మెన్స్ చూసి అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు అని ఆయన అన్నారు.
వేట్టయన్ సినిమా కథ రాయడానికి ముందు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ చేసిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన మీడియా కథనాలను సేకరించాను. వాటిని పరిశోధించాను. నా పరిశోధన ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పులు, మానవ హక్కుల కమిషన్‌తో చర్చలపై దృష్టి సారించడంపై జరిగింది. ఎన్‌కౌంటర్లకు సంబంధించి చట్టపరమైన, నైతిక అంశాలను అర్థం చేసుకోవడానికి ఈ సినిమా మంచి అనుభవాన్ని అందించింది అని దర్శకుడు జ్ఞానవేల్ తెలిపారు.


Click it and Unblock the Notifications











