తొలి ప్రేమ తర్వాత పవన్ కల్యాణ్, రాంచరణ్ సినిమాలు రిజెక్ట్ చేశా.. ఎందుకంటే? వాసుకి (ఇంటర్వ్యూ)
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అన్నీ మంచి శకునములే. మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలని పెంచింది. తొలి ప్రేమ చిత్రంలో పవన్ కల్యాణ్ సోదరిగా నటించిన వాసుకీ ఈ చిత్రంలో క్యూట్ పాత్రను పోషించింది. ఈ చిత్రం మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వాసుకీ తన అనుభూతులను పంచుకొన్నది. ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే..
నటనకు ఎందుకు దూరంగా ఉన్నానంటే:తొలి ప్రేమ సినిమాలో నటించిన తర్వాత చేస్తున్న సినిమా అన్నీ మంచి శకునములే. దాదాపు 23 ఏళ్ల తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. అయితే నాకు మంచి ఆఫర్లే వచ్చాయి. కానీ నాకున్న బాధ్యతలు, నా పిల్లల సంరక్షణ వల్ల నేను సినిమాలు చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నా పిల్లలు ఇద్దరు యూకేలో చదువుకొంటున్నారు. ఆనంద్ సాయి ఎప్పుడూ బిజీగా ఉంటారు. ప్రస్తుతం నేను ఒంటరిగా ఉంటున్న సమయంలో స్వప్న నాకు కాల్ చేసి అడిగింది. దాంతో కథ వింటానని చెప్పి.. కథ విన్న వెంటనే నేను ఒకే చెప్పాను అని వాసుకి తెలిపారు.

సినిమాకు దూరమైన ఫీలింగ్:నేను సైకాలజీ స్టూడెంట్‌ను. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఏదైనా చేయగలననే టైమ్ అనిపిస్తున్నది. ఆ మధ్యలో రాంచరణ్, పవన్ కల్యాణ్ సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అయితే ఆ సమయంలో నేను చాలా బిజీగా ఉన్నాను. అందుకే నేను ఆ సినిమాలను వదిలేశాను. అంతేగానీ.. సినిమాలు చేయకూడదని మాత్రం నేను నిర్ణయం తీసుకోలేదు. నేను 23 ఏళ్లలో ఏనాడు దూరమైన ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఆనంద్ కారణంగా సినిమా మా చుట్టూ తిరుగుతునే ఉండేది అని వాసుకీ వెల్లడించారు.

ఆ ధైర్యంతోనే సినిమాల్లోకి వచ్చాను:నా జీవితంలో నేను ఏదీ సీరియస్‌గా తీసుకోను. నాకు ఇదే దారి, సినిమా, చదువు అనే విషయాలను కూడా సీరియస్ తీసుకోను. నా స్వభావం అలా ఉంటుంది. చాలా గ్యాప్ తర్వాత నేను ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు కొన్ని విషయాలను మైండ్‌లో ఉంచుకొన్నాను. తొలి ప్రేమ చేసేటప్పడు నా వయసు 18 సంవత్సరాలు. అప్పుడు నాకు ఏమీ తెలియదు. తెలుగు రాదు. డైలాగ్ చెప్పడం రాదు. సినిమా అంటే ఏమిటో తెలియదు. అయినా ధైర్యంతో సినిమాల్లోకి వచ్చాను అని వాసుకీ చెప్పారు.

ప్రస్తుతం అడగ్గానే ఒప్పుకొన్నాను.. :ప్రస్తుతం ఈ వయసులో సినిమా అంటే తెలుసు. చాలా విషయాలపై అవగాహన ఉంది. ఈ వయసులో ఎంట్రీ ఇవ్వాలంటే.. సేఫ్ సెక్యూర్డ్ జోన్‌ను చూసుకోవాలి. లేకపోతే సినిమాలు చేయననే ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి స్వప్న దత్ ఇంతకు ముందు చాలా ప్రాజెక్టులు అడిగింది. అయితే నేను బిజీగా ఉండటం వల్ల సినిమాలు చేయలేదు. కానీ ప్రస్తుతం అడగ్గానే వెంటనే ఒప్పుకొన్నాను. స్వప్న కారణంగా సెట్లో ఎలాంటి సమస్యలు రావని, అందుకే అన్ని మంచి శకునములే సినిమా నాకు చాలా సేఫ్ అని డిసైడ్ అయ్యాను అని వాసుకీ తెలిపారు.

నాకు అన్నలు, తమ్ముళ్లు లేరు.. :నందినీ రెడ్డి చెప్పిన కథ విన్న తర్వాత ఆ పాత్రకు కనెక్ట్ అయ్యాను. నిజ జీవితంలో నాకు అన్నయ్య, తమ్ముళ్లు లేరు. నాకు ఆ సెంటిమెంట్, ఎమోషన్స్ నాకు తెలియవు. కానీ డైరెక్టర్ ఇచ్చిన నేరేషన్‌తో నేను చేయగలననే నమ్మకం కలిగింది. సహజంగా నేను దేనికి ఆందోళన చెందను. నేను దేనికి భయపడను. చాలా కామ్‌గా ఉంటాను. సీన్‌ను అర్దం చేసుకొని ఆ పాత్రకు తగినట్టుగా బిహేవ్ చేస్తుంటాను.

నందిని రెడ్డి కోసమే ఈ సినిమా చేశాను..:అన్నీ మంచి శకునములే సినిమాకు దర్శకుడు మహిళ కావడం వల్ల చాలా ఈజీగా అనిపించింది. నందినీ రెడ్డి దర్శకత్వం చేస్తున్నారనే ఒక కారణంగా నేను ఈ సినిమాను ఒప్పుకొన్నాను. ఆమె వర్క్‌ను చూసి ఇంప్రెస్ అయ్యాను. ఇప్పుడు వచ్చే సినిమాల్లో హింస, అసభ్యతతో ఉండే సినిమాలు చేసి విసుగు చెందాను. అలాంటి పరిస్థితిలో మంచి కథ చదివితే ఎలా ఉంటుందో ఈ సినిమా కథ విన్నప్పుడు అలా అలనిపించింది.


Click it and Unblock the Notifications











