‘పెళ్లైన 16 రోజులకే విడాకులు.. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దు’

నటుడు, సింగర్, రాపర్ గా తెలుగు ప్రేక్షకుల్లో నోయెల్ సీన్ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. తన గాత్రంతో, నటనతో వెండితెరపై ఆడియెన్స్ ను వీలైనంత వరకు అలరించాడు. అటు టెలివిజన్ రంగంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ దాదాపు 20 ఏళ్లుగా ప్రేక్షకులను బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో అలరిస్తూనే వస్తున్నారు. ఇదిలా ఉంటే.. నోయెల్ తనకు పెళ్లైన 16 రోజుల్లోనే విడాకులు తీసుకోవడం అప్పట్లో కాస్తా చర్చగా మారిన అంశం. అయితే దాని వల్ల కెరీర్ గ్రాఫ్ పెరుగుతున్న నోయెల్ కాస్తా డౌన్ అయ్యారు. డివోర్స్ ఎందుకు అయ్యిందనే అంశాలపై నోయెల్ స్పందించారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ఆ వివరాల్లోకి వెళితే..

మల్టీ టాలెంటెడ్ గా నోయెల్..
నోయెల్ సీన్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడు. 1982 నవంబర్ 28న జన్మించారు. 2006 నుంచి చిత్ర పరిశ్రమలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. సంభవామి యుగే యుగే అనే చిత్రంతో తొలిసారిగా వెండితెరపై మెరిశారు. ఆ తర్వాత ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో సింగర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మాస్ మహారాజా రవితేజ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం విక్రమార్కుడుకు తన గాత్రం అందించి సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. ఓవైపు నటుడిగా, మరోవైపు సింగర్ గా ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నారు. అలాగే నాన్ ఫిల్మ్ సాంగ్స్ తోనూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు.

Tollywood Actor and Singer divoreced after 16 days of Marriage

నోయెల్ వివాహం.. విడాకులు..
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నోయెల్ ఫైన్ ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత వెబ్ డిజైనర్ కోర్సును కంప్లీ చేసి ప్రముఖ టెక్ కంపెనీ కాగ్నిజెంట్ లో ట్రైయినీగా ఉద్యోగం కూడా చేశారు. ఇదే సమయంలో నటుడిగా, సింగర్ గా అవకాశాలను అందుకుంటూ వచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి రైజ్ అవుతున్న సమయంలో 2019లో నోయెల్ సీన్ నటి ఎస్తేర్ నోరోన్హాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో గానీ డిసెంబర్ లో పెళ్లి కాగా జనవరిలోనే సెపరేట్ అయ్యారు. ఇక 2020 అక్టోబర్ 31న పబ్లిక్ గా తమ డివోర్స్ ను ప్రకటించారు.

అయితే నోయెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకులపై స్పందించారు. అసలు పెళ్లి విషయంలో తానే తొందరపడ్డానని చెప్పారు. ఆమె తనపై ఎన్నో ఇంటర్వ్యూల్లో చెడుగా ప్రచారం చేసిందని, కానీ తాను మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయాలని అనుకోవడం లేదని చెప్పారు. తన కెరీర్ గ్రాఫ్ హైకి వెళ్తున్న సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. నాలాంటి పరిస్థితి శత్రువుకు కూడా రాకూడదని తెలిపారు. అయితే గతంలో నోయెల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండటం విశేషం.

నోయెల్ విక్రమార్కుడు, చందమామ, మంత్ర, కృష్ణార్జున, రామ రామ కృష్ణ కృష్ణ, పూల రంగడు, జై సింహ వంటి చిత్రాలకు సింగర్ గా పని చేశారు. ఇక నటుడిగా మంత్ర, నేను మీకు తెలుసా, ఇందుమతి, శశిరేక పరిణయం, మగధీర, ఈగ, కుమారి 21ఎఫ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, హలో గురు ప్రేమ కోసమే, పడి పడి లేచే మనసు, రంగబలి, పొట్టెల్ వంటి చిత్రాలతో అలరించారు. అలాగే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 3, సీజన్ 4తో టీవీ ప్రేక్షకులను అలరించారు.

More from Filmibeat

Read more about: noel sean ester noronha divorce
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X