విడాకులు తీసుకున్న రెండేళ్లకు కారణాలు వెలుగులోకి.. సమంతను అలా వేధించారట.. తొలిసారి నోరు విప్పిన సామ్ క్లోజ్
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఆమె.. అదే చిత్రంలో హీరోగా చేసిన అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడింది. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించిన ఈ జంట.. కొంత కాలానికి ఇరు కుంటుంబాల పెద్దలను ఒప్పించి మరీ వీరు పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్నేళ్లకే విడాకులు తీసుకొని ఇండస్ట్రీతో పాటు వాళ్ల అభిమానులకు గట్టి షాక్ ఇచ్చారు. ఇది నిజమని ప్రేక్షుకులు నమ్మక ముందే ఇద్దరూ విడిపోయారు.
ప్రస్తుతం ఎవరి లైఫ్ లో బిజీగా మారి... కెరియర్ లో దూసుకుపోతున్నారు. గత కొంత కాలంగా సామ్ మయోటైటిట్ అనే సమస్యతో బాధ పడుతూ చికిత్స పొందుతోంది. ఈ మధ్య కాస్త బాగైన ఆమె.. నటిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా మారబోతున్నట్లు రెండ్రోజుల క్రితమే ప్రకటించింది. ట్రాలాలా అనే ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించినట్లు చెప్పింది. మరోవైపు నాగ చైతన్య కూడా తన తొలి వెబ్ సిరీస్ దూత హిట్టుతో ఫుల్ ఖుషీలో ఉన్నాడు. అయితే తాజాగా వీరిద్దరి విడాకులకు సంబంధించిన ఓ విషయం మరోసారి వైరల్ గా మారింది. ముఖ్యంగా సామ్ అక్కినేని ఫ్యామిలీ విధంచడం వల్లే ఆమె విడాకులు తీసుకుందని తెలిసింది.

అయితే సమంతతో ఉండే క్లోజ్ ఫ్రెండ్స్ యే ఈ విషయాలు టాలీవుడ్ నటి మాధవీ లతకు చెప్పారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. మరోసారి సామ్, చై విడాకులపై స్పందించారు. సమంతను అక్కినేని కుటుంబ సభ్యులు మనీ సంపాధించే మిషన్ లాగా చూశారే తప్ప ఏనాడు మనిషిగా చూడలేదని అన్నారు. తాను వృత్తి నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలన్నా తీసుకోనివ్వకుండా.. సినిమాలు చేయాలని టార్చర్ చేసినట్లు మరోసారి చెప్పుకొచ్చారు. అయితే ఆ టార్చర్ భరించలేకే సమంత విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.
తాను చెబుతున్నది అంతా నిజమేనని... సమంతకు అత్యంత దగ్గరి వాళ్లే ఈ విషయం తనతో చెప్పారని చెప్పుకొచ్చింది. అయితే వారిద్దరూ ప్రస్తుతం ఎవరి జీవితాల్లో చాలా సంతోషంగా ఉన్నారని.. కానీ మరోసారి దీనిపై మాట్లాడి వైరల్ అవ్వాలని తనకు లేదని పేర్కొంది. కానీ అమ్మాయిలను డబ్బు సంపాధించే మిషిన్లలాగా చూడొద్దని.. అందరి అమ్మాయిలకు తల్లి కావాలని ఉంటుందని మాధవీ లత స్పష్టం చేసింది. అలాంటి బట్టలు వేసుకోవద్దు, ఇలా ఉండు.. ఈ సినిమాలు తీయు అంటూ ఆర్డర్లు వేస్తూ... ఎవరూ ఎక్కువ కాలం భరించలేరంటూ సెన్సేషనల్ కామెంట్లు చేసింది.
అలాగే రాహుల్ రవీంద్రన్ భార్య సింగర్ చిన్మయి గురించి కూడా మాధవీ లత మాట్లాడారు. ఆమె తనకు ఎలాంటి సమస్య వచ్చినా వెంనటే స్పందిస్తుందని అలాంటి వారికి తాను ఎప్పుడూ సాయంగా ఉంటానని చెప్పుకొచ్చింది. అమ్మాయిలకు ఎక్కడ అన్యాయం జరిగినా.. తాను ముందుంటానని మరోసారి పేర్కొంది మాధవి లత.


Click it and Unblock the Notifications











