For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Tollywood Drug Case: వాళ్లు దేశద్రోహులు.. ఘాటుగా స్పందించిన ప్రకాశ్ రాజ్!

  |

  తెలుగు సినిమా పరిశ్రమ ప్రతిష్టను మసక బారేలా చేస్తున్న డ్రగ్స్ కేసు వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) ఎంట్రీ ఇవ్వడంతో భారీ ట్విస్ట్ ఏర్పడింది. దాంతో నాలుగేళ్ల క్రితం నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరింత యాక్టివ్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశ్ రాజ్ శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో డ్రగ్స్ కేసుపై స్పందించారు. ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి? డ్రగ్స్ కేసులో తాజా విచారణకు సంబంధించిన వివరాలు ఏమిటంటే...

  విదేశాలకు అక్రమంగా డబ్బు తరలింపు

  విదేశాలకు అక్రమంగా డబ్బు తరలింపు

  టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ కేవలం నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగంకే పరిమితం కాలేదు. అక్రమంగా విదేశాలకు డబ్బును తరలించి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారు. డ్రగ్స్ కొనుగోలు కోసం అక్రమ మార్గాల్లో భారీ మొత్తంలో డబ్బును తరలించారనే విషయం ఈడీ దర్యాప్తులో వెలుగులో చూసింది. పలువురు తారలు విదేశాల్లో ఉన్న డ్రగ్స్ సప్లయర్స్ డబ్బు తరలించారనే ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తున్నారు.

  పూరీ జగన్నాథ్ విచారణతో కొత్త ట్విస్టు

  పూరీ జగన్నాథ్ విచారణతో కొత్త ట్విస్టు

  అయితే మానీలాండరింగ్ వ్యవహారంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను తొలుత విచారించారు. బుధవారం జరిగిన విచారణలో పలు ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. అయితే తనకు తెలిసిన సమాచారాన్ని తెలియజేయడమే కాకుండా మిగిత సమాచారాన్ని తన ఆడిటర్ చేత ఇప్పించినట్టు తెలిసింది. దాంతో ఈ విచారణపై ఈడీ అధికారులు ఎంత సీరియస్‌గా ఉన్నారనే విషయం స్పష్టమైంది.

   రకుల్ ప్రీత్ సింగ్ విచారణ సుదీర్ఘంగా

  రకుల్ ప్రీత్ సింగ్ విచారణ సుదీర్ఘంగా

  ఇక స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అయితే ఈ విచారణకు సంబంధించిన విషయాలను అధికారికంగా గోప్యంగా ఉంచారు. దాంతో ఈ కేసు విచారణపై మరింత ఆసక్తి పెరిగింది. సుదీర్ఘమైన విచారణ అనంతరం రకుల్ పెద్దగా స్పందించకుండా ముభావంగా వెళ్లిపోవడం అనేక సందేహాలకు తావిచ్చింది.

  ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో హేమ, జీవితా రాజశేఖర్

  ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో హేమ, జీవితా రాజశేఖర్

  ఇక మా ఎన్నికల సంగ్రామం మొదలైన నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ అట్టహాసంగా ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం వరకు ప్రకాశ్ రాజ్‌పై కత్తుల దూసినట్టు కనిపించిన హేమ, జీవితా రాజశేఖర్ తాజా ప్యానెల్‌లో కనిపించే సరికి అందరికి ఆశ్చర్యం కలిగింది. దీని వెనుక పెద్ద మంత్రాగమే జరిగినట్టు తెలుస్తున్నది. పలురు సినీ పెద్దలు జరిపిన రహస్య చర్చలే ఈ ప్యానెల్ కూర్పుకు కారణమని తెలుస్తున్నది.

  MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
   డ్రగ్స్ యువతను పట్టి పీడిస్తున్నదంటూ

  డ్రగ్స్ యువతను పట్టి పీడిస్తున్నదంటూ

  ఇదిలా ఉండగా ప్యానెల్‌ను ప్రకటించిన ప్రకాశ్‌రాజ్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు ఇచ్చారు. ఈ సంద్భంగా మీడియా ప్రతినిధులు డ్రగ్స్ కేసు గురించి ప్రస్తావించగా ప్రకాశ్‌రాజ్ ఘాటుగా స్పందించారు. డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టి పీడిస్తున్నదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఈ కేసు గురించి ఊహించని వ్యాఖ్యలు చేయడం అందర్నీ షాక్ గురిచేసింది.

  డ్రగ్స్ తీసుకొనే వాళ్లు దేశద్రోహులు

  డ్రగ్స్ తీసుకొనే వాళ్లు దేశద్రోహులు

  డ్రగ్స్ కేసు గురించి ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ... డ్రగ్స్ తీసుకోవడం తప్పు. నాకు అలాంటి విషయాలు పడవు. మన యువతరాన్ని ఎంత నాశనం చేస్తుందో తెలుసా? డ్రగ్స్ కేసు విచారణ జరుగుతున్నది. ఆరోపణల ఆధారంగా దర్యాప్తు జరుగుతున్నది. ఆరోపణలు రుజువు అయితే తప్పకుండా నేనే చర్యలు తీసుకొంటాను. డ్రగ్స్ తీసుకొనే వాళ్లు దేశద్రోహులు. డ్రగ్స్ వాడకాన్ని ఎవరూ ఉపేక్షించకూడదు. డ్రగ్స్ అనేవి భావితరాలకు, ఆలోచనలకు, అభివృద్దికి, ఆరోగ్యానికి, సమాజానికి అడ్డంకిగా మారతున్నది. డ్రగ్స్ వాడకాన్ని ఎవరైనా తప్పుపట్టాల్సిందే అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.

  English summary
  Tollywood's Drug Case probe going with high note. Actor Prakash Raj Who heading for MAA Elections, says Drug Addicts are Anti Nationalists.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X