Samantha Ruth Prabhu అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ నా సూపర్ హీరోలు.. ఏ విషయంలోనో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి వరుస చిత్రాల్లో ఆఫర్లను దక్కించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. అయితే మొదటి సినిమాలో తనతో పాటే కలిసి నటించిన హీరో నాగ చైతన్యతో.. ప్రేమలో పడింది. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు వీరిద్దరూ ప్రేమాయణం సాగించారు.
కొంత కాలానికి ఇరు కుటుంబాలను ఒప్పించి మరీ వీరు పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్నేళ్లకే విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించి అందిరినీ షాక్ కు గురి చేశారు. ఇది నిజమని ప్రేక్షుకులు జీర్ణించుకునే లోపే విడాకులు తీసుకొని విడిపోయిన ఆ జంట ఎవరి లైఫ్ లలో వాళ్లు బిజీగా మారిపోయారు. అయితే చైతో విడిపోయిన తర్వాత సామ్ అనేక చిత్రాల్లో నటించింది. కెరియర్ పై మాత్రమే దృష్టి పెట్టి కెరియర్ గ్రాఫ్ ను విపరీతంగా పెంచేసుకుంది. అయితే కొన్ని నెలల క్రితమే తాను ఓ సమస్యతో బాధ పడుతున్నట్లు తెలిపి మరోసారి అందరికీ షాకిచ్చింది.

ముఖ్యంగా తాను చాలా కాలంగా మయోటైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది. సినిమాలకు మధ్య మధ్యలో బ్రేక్ లు తీసుకుంటూనే ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. ఓవైపు సినిమాలు, మరోవైపు ఆరోగ్య సమస్యలతో బాగానే నలిగిపోయింది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన అల్లు అర్జున్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండలపై ఆసక్తికర కామెంట్లు చేసింది. వారిద్దరూ తన సూపర్ పవర్స్ అని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
కెప్టెన్ మార్వెల్ చిత్రానికి సీక్వెల్ అయిన ది మార్వెల్స్ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలోనే సమంత పాల్గొంది. గతంలో కెప్టెన్ మార్వెల్ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాలు ఒకే స్టేజిపై నిలిచి అందరినీ అలరించారు. అయితే ఈ ఏడాది కూడా సామ్ దాని సీక్వెల్ చిత్రం ప్రమోషన్ లో పాల్గొంది. ఇందులో భాగంగానే అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన సామ్.. ఆ తర్వాత యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

మీరు ద మార్వెల్స్ టీంలో ఉంటే... మీతోపాటు ఎవరు ఉండాలని మీరు కోరుకుంటారని యాంకర్ అడగ్గా... తన ఫ్యాన్స్ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పంది. ఇక ఆ తర్వాత అభిమానులు కాకుండా, సినీ రంగానికి సంబంధించిన వాళ్లలో ఎవరు ఉండాలని భావిస్తారని అడగ్గా... అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఆలియా భట్, ప్రియాంక చోప్రాల పేర్లను చెప్పుకొచ్చింది. తనతో పాటు వీరంతా తన టీంలో ఉంటే బాగుంటుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సామ్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











