ARM: 8 ఏళ్ల క్రితం.. 3 పాత్రలతో.. నా 50వ సినిమా.. ఎమోషనల్‌గా టోవిన్ థామస్ (ఇంటర్వ్యూ)

మలయాళంలో విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ఆకట్టుకొంటున్న నటుడు టోవినో థామస్. ఆయన నటించిన మిన్నల్ మురళీ మూవీని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. దాంతో ఆయన తెలుగు ఆడియెన్స్ చేరవయ్యారు. ఆయన తాజాగా నటించిన చిత్రం అజయంతే రాండమ్ మోషనమ్ (అజయన్ రెండో దొంగతనం). ఈ సినిమాలో అజయన్, కుంజ్లీకేలు, మానియన్ అనే మూడు పాత్రలు ధరిస్తున్నారు. కృతిశెట్టి, ఐశ్వర్య రాజేశ్ తదితరులు నటించిన ఈ సినిమాకు జితిన్ లాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా ఆయన తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

చిన్న చిన్న పాత్రలతో నా కెరీర్‌ మొదలైంది. 8 ఏళ్ల క్రితం ARM మూవీతో ట్రావెల్ అయినప్పుడు ఈ సినిమా నా కెరీర్‌లో 50వ సినిమా అవుతుందని ఊహించలేదు. నా మొదటి సినిమాతోనే నటుడి కావాలనే డ్రీమ్‌తో నా జీవితాన్ని కొనసాగిస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా మూడు పాత్రలను పోషిష్తున్నాను. అదే నాకు పెద్ద ఛాలెంజ్. మూడు క్యారెక్టర్లు చేయగలనా? అనే అనుమానం ఉండేది. కానీ నాపై ఆ నమ్మకం ఉందని చెప్పారు. ఆ నమ్మకమే ఈ సినిమా చేయడానికి ఉపయోగపడింది అని టొవినో థామస్ అన్నారు.

Tovino Thomas reveals secrets and fact behind ARM movie Which 50th Cinema in career

నా కెరీర్‌లో నటించిన అన్నీ పాత్రలు కూడా నాకు ఛాలెంజ్ లాంటివే. మూడు క్యారెక్టర్లు కూడా నాకు సవాల్ అనిపించాయి. రైటర్, డైరెక్టర్‌తో పలుమార్లు సుదీర్ఘంగా చర్చించాను. ఈ సినిమా కోసం కలరీ ఫైట్ గురించి తెలుసుకొన్నాను. దానిని 6 నెలలు ప్రాక్టీస్ చేశాను. నేను ఎప్పుడూ ఒకే సినిమాలో నటిస్తాను. ప్రతీ సినిమాకు ఎక్కువగా బ్రేక్ ఉండకూడదని చూసుకొంటాను.కలరి ఫైట్ గురించి ఆ బ్రేక్ లోనే తెలుసుకొన్నాను అని అన్నారు.

మూడు పాత్రలు ఛాలెంజింగ్ అయినప్పటికీ.. అజయన్ అనే నాకు దొంగ పాత్ర చాలా ఇష్టం. ఆ పాత్రను చాలా ప్రేమతో చేశాను. ఆ పాత్రలో నటించడానికి చాలా స్కోప్ ఉంటుంది. దర్శకుడికి తొలి సినిమా. అయితే ఆయనపై నా నమ్మకం గురించి.. ఆయన నాపై పెట్టుకొన్న నమ్మకం ఈ సినిమా చేయడానికి ఉపయోగపడింది. అయితే ఆయన ఈ సినిమా నాతో చేయడానికి 6 సంవత్సరాలు వెయిట్ చేశాడు అని అన్నారు.

Tovino Thomas reveals secrets and fact behind ARM movie Which 50th Cinema in career

తెలుగులో నేరుగా సినిమా చేయాలని ఉంది. అయితే నేను ఒకేసారి ఒక సినిమా మాత్రమే చేస్తాను. రెండు, మూడు సినిమాలు చేయను. మలయాళంలో కొన్ని సినిమాలు ఫినిష్ చేయాల్సి ఉంది. అందులో కొన్ని భారీ సినిమాలు, కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి. వాటిని ఫినిష్ చేసిన తర్వాత అవకాశం వస్తే.. తెలుగు సినిమాలు చేస్తాను. కానీ దాని కంటే ముందు తెలుగు నేర్చుకొంటాను అని టొవినో థామస్ అన్నారు.

నేను తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. నేను మొదటిసారి చిరంజీవి, శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా చూశాను. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమాలు చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు కొన్ని తెలుగు సినిమాల కథలు వింటున్నాను. ఏదైనా పాజిటివ్ విషయం ఉంటే మీకు వెల్లడిస్తాను అని టొవినో చెప్పారు.

More from Filmibeat

Read more about: tovino thomas arm kriti shetty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X