నా సినిమాలు చూసుకొంటే.. అప్పుడప్పుడు నాకే సిగ్గేస్తుంటుంది.. త్రివిక్రమ్
అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం అరవింద సమేత.. వీర రాఘవ. యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజాహెగ్డే జంటగా నిర్మాత చినబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్‌తో మరోసారి ఎన్టీఆర్‌ను వీర రాఘవగా సరికొత్తగా త్రివిక్రమ్ చూపించబోతున్నారు. మహిళా సాధికారిత ప్రధానాంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు త్రివిక్రమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వివరించారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను, వ్యక్తిగత అంశాలను తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. త్రివిక్రమ్ చెప్పిన విషయాలను ఆయన మాటల్లోనే..

అరవింద సమేతలో రాయలసీమను గొప్పగా
అరవింద సమేతలో కేవలం ఫ్యాక్షన్‌ను మాత్రమే చూపించలేదు. రాయలసీమ భాషలో ఉండే గొప్పతనాన్ని, సొగసును అందంగా చూపించాం. అక్కడ మాట్లాడే భాష, యాస సొగసును ప్రేక్షకుడికి చూపించే ప్రయత్నం చేశాం. కేవలం హింసను చూపించాలని తాపత్రయపడలేదు.

జగపతిబాబు పాత్రను క్రూరంగా
జగపతిబాబు పాత్రను చాలా క్రూరంగా చూపించాం. కొందరిని మార్చేందుకు ప్రయత్నం చేసినా అది కుదరదు. అలాంటి పాత్రే జగపతి పాత్ర. ఈ సినిమా కోసం హింసను పూర్తిగా నమ్ముకోలేదు. ఆ పాత్రను చూసి ప్రేక్షకులు ద్వేషించుకొంటారు. ఆయన ప్రవర్తించే తీరుపై కోపగించుకొంటారు అని త్రివిక్రమ్ అన్నారు.

ఎన్టీఆర్‌కు నాలుగు కథలు చెప్పా
అరవింద సమేతకు ముందు ఎన్టీఆర్‌కు మూడు, నాలుగు కథలు చెప్పా. కానీ వర్కవుట్ కాలేదు. నాన్నకు ప్రేమతో తర్వాత ఎలాగైనా చేయాలని ఫిక్స్ అయ్యాం. ఆ సమయంలో అ..ఆ సినిమా చేస్తున్నాను. ఆయన అరవింద సమేత చేస్తున్నాడు. చివరగా ఈ సినిమా కథ గురించి చర్చించినపుడు ఇద్దరం ఎక్సైట్ అయ్యాం. ఎలాగైనా చేయాలనుకొన్నాం. ఇది చేశాం.

నేను సిగ్గుపడిన దాఖలాలు
సాధారణంగా కొన్నిసార్లు రాత్రి ఏదో జోష్‌లో కథ రాస్తేస్తాను. తెల్లారి లేచిన తర్వాత చదువుకుంటే ఇదా నేను రాసిందని సిగ్గుపడుతాను. రాసిన కథలే కాదు.. నేను తీసిన సినిమాలు చూసి సిగ్గుపడిన దాఖలాలు ఉన్నాయి. నా కెరీర్‌లో అలాంటివి జరుగుతుంటాయి.

సుప్రియా పాథక్‌ను అందుకే తీసుకొన్నాం
బలమైన నానమ్మ పాత్రను, మంచి మాటను చూపించడానికి ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తుండగా ఎన్టీఆర్ బాలీవుడ్ నటి సుప్రియా పాథక్ పేరు చెప్పారు. నాకు కూడా భలే అనిపించింది. ఆమెను అడగ్గానే చేస్తానని ముందుకొచ్చారు. ఆమెకు న ముందుగానే ఆమెకు స్క్రిప్టు పంపి డైలాగ్స్ నేర్పించాం. రామ్‌లీలా సినిమాలోని పాత్రకు ఈ సినిమాలోని పాత్రకు అసలు పోలీకలు లేవు. అరవింద సమేత కథ పూర్తిగా మన స్టోరి అని త్రివిక్రమ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











