అజ్ఞాతవాసికి నష్టం వస్తే.. రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశా.. నన్ను నేను తిట్టుకొన్నా!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు చెప్పలేనంత క్రేజ్ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్లో కోబలి అనే సినిమా చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం పట్టాలెక్కలేదు. కానీ ఆ సినిమా ప్యార్లల్ (సమాంతర) సినిమాగా తెరకెక్కిస్తాను. ఆ సినిమాకు అరవింద సినిమాకు ఎలాంటి పోలీకలు లేవు అని త్రివిక్రమ్ స్పష్టం చేశారు. అక్టోబర్ 11న అరవింద సమేత చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో త్రివిక్రమ్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు.

గెలుపు, ఓటములు పట్టించుకోను

గెలుపు, ఓటములు పట్టించుకోను

గెలుపు, ఓటములను పట్టించుకోను అని చెబితే అబద్దమే. కానీ అది తాత్కాలికమే. ఏదో పనిలో పడి వాటిని త్వరగానే మరిచిపోతాం. బాక్సాఫీస్ లెక్కల విషయంలోనే అదే తీరు ఉంటుంది. హిట్టయితే దానిని మోసుకొంటూ తిరగను. దాని గురించే చెప్పుకొంటూ, పిసుక్కుంటూ ఉండను. ఆ సమయానికి ఎంజాయ్ చేస్తాను.

బాధపడుతాను.. కానీ

బాధపడుతాను.. కానీ

అత్తారింటికి దారేది హిట్ అయినా, అజ్ఞాతవాసి చిత్రం ఫ్లాప్ అయినా నేను ఒకేలా ఉంటాను. కొంతసేపు బాధపడుతాను. ఆ తర్వాత ఏమిటనే దానిపై దృష్టిపెడుతాను. ఖలేజా సినిమా ఫ్లాఫ్ అయినప్పటికి అందరూ గొప్పగా చెబుతుంటారు. అలా చెప్పినప్పుడు పెద్దగా పట్టించుకోను. వారిని బ్లాంక్‌గా చూస్తాను.

 నిర్మాతకు డబ్బు తిరిగి ఇచ్చేశాను

నిర్మాతకు డబ్బు తిరిగి ఇచ్చేశాను

అజ్ఞాతవాసి సినిమా కాపీరైట్ విషయంలో నేను చేయాల్సింది చేశాను. వారు పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ వాళ్లు నా వద్దకు వచ్చి నష్టపరిహారం అడిగితే.. బాధపడైనా ఇచ్చే వాడిని. నిర్మాత చినబాబు నష్టపోతే నా రెమ్యునరేషన్‌ను తిరిగి ఇచ్చేశాను. సినిమా నచ్చకపోవడానికి లక్ష కారణాలు ఉంటాయి. నచ్చకపోవడానికి అంతే కారణాలు ఉంటాయి.

ప్రశంసలకు లొంగిపోను.. పట్టించుకోను

ప్రశంసలకు లొంగిపోను.. పట్టించుకోను

రచయితగా, డైరెక్టర్‌గా నన్ను విడదీసుకొని చూసులేను. నేను సినిమాలు తీసినా రచయితగా బాగా రాస్తాడని అంటారు. దానిని ముళ్ల కిరీటం భావించను. నన్ను మాటల మాంత్రికుడు అంటే పెద్దగా పట్టించుకోను. ఎవరైనా యాంకర్లు నా గురించి చెప్పడం ప్రారంభించకముందే స్టేజి ఎక్కేస్తాను. నా గురించి గొప్పగా చెప్పడం నాకు ఇష్టం ఉండదు.

మంచి సినిమాల చూసి

మంచి సినిమాల చూసి

నేను ప్రతీ సినిమాను థియేటర్‌కు వెళ్లి చూస్తాను. మంచి సినిమా చూసిన ప్రతీసారి ఈర్ష్యతో రగలిపోతాను. నన్ను నేను తిట్టుకొంటాను. మంచి సినిమా తీయాలని అనుకొంటున్నాను. అర్జున్ రెడ్డి, రంగస్థలం, కేరాఫ్ కంచెర్లపాలెం, పెళ్లిచూపులు, ఆర్ఎక్స్ 100, గూఢచారి లాంటి చిత్రాలు బాగా నచ్చాయి. గూఢచారి చిత్రాన్ని పరిమితమైన బడ్జెట్‌తో బాగా తీశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X