పాటలు లేకుండా సినిమా తీస్తా.. ఆ కథ పవన్ కల్యాణ్ కోసం.. త్రివిక్రమ్ (ఇంటర్వ్యూ)
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు చెప్పలేనంత క్రేజ్ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్లో కోబలి అనే సినిమా చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం పట్టాలెక్కలేదు. కానీ ఆ సినిమా ప్యార్లల్ (సమాంతర) సినిమాగా తెరకెక్కిస్తాను. ఆ సినిమాకు అరవింద సినిమాకు ఎలాంటి పోలీకలు లేవు అని త్రివిక్రమ్ స్పష్టం చేశారు. అక్టోబర్ 11న అరవింద సమేత చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో త్రివిక్రమ్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఆయన వెల్లడించిన విషయాలు మీకోసం..

కోబలి సినిమాకి సంబంధం లేదు
పవన్ కల్యాణ్‌తో తెరకెక్కిద్దామనుకొన్న కోబలి సినిమాకు అరవింద సమేత చిత్రానికి సంబంధం లేదు. అది పూర్తిగా వేరే కథ, ఇది వేరే కథ. అయితే ఆ కథను మరో రకంగా తీస్తాను. దానిని సమాంతర సినిమాగా తెరకెక్కిస్తా. పాటలు లేకుండా కేవలం కథనే చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను.

కోబలి కోసం పరిశోధన హెల్ప్ అయింది
కాకపోతే కోబలి సినిమా కోసం పనిచేసిన అనుభవం ఈ సినిమాకు పనికి వచ్చింది. ఆ సినిమా కోసం పరిశోధన చేసే సమయంలో కొంత మంది రాయలసీమ కవులతో పరిచయం ఏర్పడింది. తిరుమల రామచంద్రయ్యతో పరిచయం ఏర్పడింది.

ఆ పరిశోధన వల్లనే పెనిమిటి పాట
తిరుమల రామచంద్రయ్య గారి గురించి వినడం తప్ప చూసింది లేదు. తనికెళ్ల భరణి ఇచ్చిన హంపి నుంచి హరప్ప అనే పుస్తకం ద్వారా నాకు రాయలసీమ గురించి బాగా తెలిసింది. రాయలసీమలోని కడప, అనంతపురం ప్రాంతాల్లోని కరువు బలవంతంగా ఏర్పడింది. ఆ పరిశోధనలోనే పెనుమిటి పాట వచ్చింది.

హీరోపై పెనిమిటి పాటను
అరవింద సమేత పెనిమిటి పాటను హీరోపైనే షూట్ చేయడం కరెక్టే. తన తల్లి గురించి పాడే పాట. పాటలో 60 శాతం మేర సీన్లు కనిపిస్తాయి. 40 శాతం హీరో కనిపిస్తాడు. సినిమాలో హీరో తల్లిని రాయలసీమలో ఉండే ప్రతీ తల్లి ఆవేదనను, కష్టాన్ని చూపించాం.


Click it and Unblock the Notifications











