అనిరుధ్‌ను ఎందుకు తప్పించామంటే.. అజ్ఞాతవాసి తర్వాత ఆ విషయం చెప్పా.. త్రివిక్రమ్
Recommended Video

అజ్ఞాతవాసి చిత్రం తర్వాత అరవింద సమేత చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ పనిచేయాల్సింది. కానీ అనిరుధ్ పక్కకు తొలిగి తెరపైకి తమన్ రంగ ప్రవేశం చేశాడు. అనిరుధ్‌ను తప్పించడంపై అనేక రూమర్లు వచ్చాయి. అయితే అరవింద సమేత చిత్ర రిలీజ్ సందర్బంగా త్రివిక్రమ్ మీడియాతో మాట్లాడుతూ.. అనిరుధ్ అంశంపై వివరణ ఇచ్చారు. అనిరుధ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని ఆయన తెలిపారు. అనిరుధ్‌ను తప్పించడంపై త్రివిక్రమ్ ఏమన్నారంటే..

అజ్ఞాతవాసి తర్వాత నేనేమి చెప్పానంటే
అజ్ఞాతవాసి చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్ రవిచంద్రన్‌నే అరవింద సమేత చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనుకొన్నాం. సినిమా ప్రారంభోత్సవానికి కూడా వచ్చాడు. కానీ ఆ తర్వాత అరవింద సమేత సినిమాకు కరెక్ట్ కాదని అనిపించాడు. అందుకే ఆయనను వద్దని అనుకొన్నాం. ఆయన స్థానంలో ఎస్ఎస్ థమన్‌ను తీసుకొన్నాం.

మీ మ్యూజిక్ అర్ధం కాదని
అనిరుధ్ క్లారిటీ ఓ విషయం చెప్పాను. తెలుగు సినిమాను మీరు అర్థం చేసుకోలేరు. నేను మీ మ్యూజిక్‌ను అర్ధం చేసుకోలేను. అందుకే గ్యాప్ తీసుకోవడం మంచిది. అందుచేత ఈ సినిమాకు మీతో నేను కొనసాగలేను అని చెప్పాను. ఆ తర్వాత తమన్‌తో మ్యూజిక్ జర్నీ మొదలైంది. అనిరుధ్ మ్యూజిక్ నాకు ఇష్టం. మళ్లీ కలిసి పనిచేస్తాం.

తమన్‌లో ఇంటెన్సిటీ మ్యూజిక్
తమన్ చాలా మంచి సంగీత దర్శకుడు. అతడు సినిమాలో పుట్టి పెరిగాడు. అతడికి సినిమానే జీవితం. ఆయన స్టయిల్, ఆలోచన విధానం చూసి షాక్ తిన్నాను. ఏదో సినిమా గురించి మాట్లాడుతూ.. ఆ చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అడగడం లేదు అని చెప్పడం సంగీతంపై ఆయనకు ఉన్న గ్రిప్ తెలిసింది.

తమన్‌కు ఎక్కువగా చెప్పలేదు
తమన్‌కు ఎక్కువగా ఏమీ చెప్పలేదు. కథ మాత్రమే చెప్పాను. పాటల్లో హిందీ ఉండకూడదు. ఈ సినిమాలో పాటలు, డ్యాన్సులు ఉండవు అనే షరతులను ఆయన ముందు పెట్టాను. నా ఆలోచన విధానానికి తగినట్టే మ్యూజిక్ చేశాడు. పైకి ఏమి కనిపిస్తారో అలా ఉండరు. తమన్‌లో గొప్ప ఇంటెన్సిటీ ఉంది.

దేవీ శ్రీ ప్రసాద్‌తో పనిచేయాలని
దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. కానీ కుదర్లేదు. అ.. ఆ సినిమాకు దేవీతో చేద్దామని అనుకొన్నాను. కానీ నా బడ్జెట్‌లో ఆయన సరిపోలేదు. అందుకే తీసుకోలేకపోయాను. అవకాశం వస్తే ఆయనతో కలిసి పనిచేస్తాను. మా ఇద్దరి మధ్య మాకు మంచి సంబంధాలున్నాయి.


Click it and Unblock the Notifications











