అమ్మకు, చిరంజీవికే చెప్పలేదు.. నాకు చెప్తారా? పవన్ రాజకీయాలపై త్రివిక్రమ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ప్రత్యేకమైన బంధం ఉంది. వారిద్దరి స్నేహం గురించి స్పెషల్‌గా చెప్పుకొంటారు. జల్సా సినిమాతో ప్రారంభమైన వారి జర్నీ మొన్నటి అజాతవాసి వరకు సాగింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా పవన్ ఉండటం మూలనా త్రివిక్రమ్‌తో కొంత గ్యాప్ ఏర్పడింది. జనసేన పార్టీ వ్యవహారాల్లో తల మునకలైన పవన్ కల్యాణ్ గురించి తివ్రిక్రమ్ తనదైన శైలిలో వెల్లడించాడు. ఆయన ఏమన్నారంటే..
Recommended Video


పవన్ కల్యాణ్‌తో దూరం పెరుగలేదు
పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నాకు దూరమయ్యాడని నేను. నేను ఆయనకు దూరమయ్యామనే ఫీలింగ్ లేదు. పదేళ్లుగా మేము ఎలా ఉన్నామో. ఇప్పుడూ అలానే ఉన్నాం. సాధారణంగా మేము కలిస్తే సినిమాల గురించి అసలే మాట్లాడుకోం. ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం మధ్య దూరం తగ్గలేదు.

నేను సలహాలు ఇవ్వలేదు
సినిమాల్లో నటించమని, లేదా రాజకీయాల్లో ఇలా ఉండమని సలహా ఇచ్చారా అనే ప్రశ్న చాలా అమాయకమైన ప్రశ్న. ఆయనకు ఎలాంటి సలహాలను ఇవ్వను. ఆయన తీసుకోరు. ప్రతీ ఏడాది ఆయనలో అనేక మార్పులను తీసుకొచ్చింది. గత 15 ఏళ్లలో ఆయనలో ఎన్నో మార్పులు చూశాను. మా మధ్య ఫ్రెండ్‌షిప్ అలానే ఉంటుంది. ఒకసారి నా జర్నీ మొదలైతే చనిపోయే వరకు నేను ఫ్రెండ్‌గాను ఉంటా.

వాళ్ల అన్న, అమ్మకే చెప్పలేదు
రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు పవన్ కల్యాణ్ నా నుంచి ఎలాంటి సలహాలు తీసుకొలేదు. ఆయన వాళ్ల అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి, వాళ్ల అమ్మకే చెప్పలేదు. అలాంటి వ్యక్తి నాకు చెబుతారా? నేను పేపర్లలో చూసే తెలుసుకొన్నాను. ఆయన పాలిటిక్స్ వరకు స్వంతంగా ఆయనే నిర్ణయాలు తీసుకొంటారు.

జనసేనతో నాకు సంబంధం లేదు
పవన్ కల్యాణ్ పార్టీని మీరే వెనుక ఉండి నడిపిస్తున్నానే వార్తలో ఎలాంటి నిజం లేదు. ఆ పార్టీ వ్యవహారాలకు నేను స్క్రిప్టు రాస్తున్నానని వస్తున్న వార్తలో వాస్తవం లేదు. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నేను సరిగా న్యూస్ పేపర్ చదవను. టెలివిజన్‌లో న్యూస్ కూడా చూడను.

పవన్‌తో ఓ రకమైన కంఫర్ట్
స్నేహితుల మధ్య ఒకరకమైన సౌలభ్యం ఉంటుంది. బాధలో ఉన్నప్పుడో, లేదా సంతోషంలో ఉన్నప్పుడో ఒకరినొకరు భావాలు పంచుకోవడం జరుగుతుంది. పవన్‌తో మా మధ్య రిలేషన్ అలాంటిదే. ఆయనకు సలహాలు ఇవ్వడానికో లేదా డైరెక్ట్ చేయడానికో రిలేషన్స్ ఉండవు. మా మధ్య ఫ్రెండ్‌షిప్ ప్రత్యేకమైనది.


Click it and Unblock the Notifications











