ఆ విషయంలో పవన్ స్పూర్తి.. ముందు గౌరవించడం నేర్చుకో అంటూ చిరంజీవి.. వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
లాక్‌డౌన్ తర్వాత ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఉప్పెన. మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో రూపొందిన చిత్రంతో బుచ్చిబాబు దర్శకుడిగా, చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 12వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వైష్ణవ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ...
Recommended Video

యాక్టర్ కావాలనే ఆలోచనల లేదు..
నాకు నటుడిగా మారాలనే ఆలోచన లేదు. కెరీర్ గురించి ఆలోచించినప్పుడు రకరకాల ప్రొఫెషన్స్ గుర్తొచ్చాయి. మొదట సైంటిస్ట్‌గా కావాలనుకొన్నాను. ఆ తర్వాత గ్రాఫిక్ డిజైనర్ కావాలని కోరుకొన్నాను. అవన్నీ పక్కన పెట్టి ఆర్మీలో చేరిపోవాలనుకొన్నాను. కానీ చివరకు నేను ఉప్పెన ద్వారా సినీ నటుడిగా మారిపోయాను. ఇప్పటికి పోస్టర్లు చేసుకొంటుందే దానిపైన ఉన్నది నేనేనా అనిపిస్తుంటుంది అని పంజా వైష్ణవ్ తేజ్ అన్నారు.

చిరంజీవి ఎలాంటి సలహా ఇచ్చారంటే
ఉప్పెన సినిమా కథను బుచ్చిబాబు చెప్పి మీరే హీరో అని చెప్పినప్పుడు గానీ, లేదా ఇతర దర్శకుల నుంచి ఆఫర్లు వచ్చినప్పుడు చిరంజీవి గారు నాకు ఓ సలహా ఇచ్చారు. నీకు వచ్చిన ఆఫర్లను మొదట గౌరవించి సినిమా చేయి. సినిమాల్లో ప్రయత్నించడంలో తప్పేమీ లేదని మెగాస్టార్ చెప్పారని వైష్ణవ్ తేజ్ అన్నారు.

పవన్ కల్యాణ్ నాకు స్ఫూర్తి
మా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. నాకు ఇన్సిపిరేషన్ మాత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన సలహాలు, సూచనలు పాటిస్తాను. ఆయన ట్రైలర్ చూసిన తర్వాత బాగుంది. మీ సినిమా కథలో మట్టి వాసన కనిపిస్తున్నదని పవన్ చెప్పారు. ఆయన ప్రోత్సాహం వల్లే ధైర్యంగా సినిమాల్లోకి వచ్చాను అని వైష్ణవ్ తేజ్ చెప్పారు.

ఉప్పెన దర్శకుడు చాలా కష్డపడ్డారు..
ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా రోజులుగా డైరెక్టర్ కావాలని కష్టపడ్డారు. సినిమా షూటింగులో నాకు చాలా విషయాలు నేర్పించారు. సినిమా కోసం అద్బుతంగా డైలాగ్స్ రాశారు. సినిమా చూసిన తర్వాత ప్రతీ ప్రేక్షకుడు ఆయన పడిన కష్టాన్ని గుర్తిస్తారు. బుచ్చిబాబు ప్రతిభ హైలెట్ అవుతుంది అని వైష్ణవ్ తేజ్ పేర్కొన్నారు.

ఓటీటీలో రిలీజ్ చేయాలని...
లాక్‌డౌన్ సమయంలో ఉప్పెన సినిమాను ఓటీటీ రిలీజ్ చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ ఎన్ని రోజులైనా మైత్రీ మూవీస్ నిర్మాతలు సినిమాను థియేటర్‌లోనే రిలీజ్ చేయాలని అనుకొన్నారు. దర్శకుడు బుచ్చిబాబు కూడా చాలా పట్టుబడ్డారు. ఇది ఓటీటీ సినిమా కాదు.. థియేటర్‌లోనే చూడాల్సిన సినిమా అని భావించారని వైష్ణవ్ తేజ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











