పవన్ స్మైల్ చూడగానే అవన్నీ హాంఫట్.. వకీల్ సాబ్‌కు ముందు ఆ టైటిల్ అనుకొన్నాం.. డైరెక్టర్ వేణు శ్రీరాం
హిందీ, తమిళంలో ఘనవిజయం సాధించిన పింక్ మూవీకి రీమేక్‌గా వస్తున్న వకీల్ సాబ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో లైక్స్, వ్యూస్ సాధించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఎప్రిల్ 9వ తేదీన సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు వేణు శ్రీరాం మాట్లాడుతూ...

ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణం
వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయింది. అందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. కరోనా సమయంలో సెలబ్రేషన్స్‌కు చోటు దక్కలేదు. అందుకే ఫ్యాన్స్ కు ఓ పండగ వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో వకీల్ సాబ్ ట్రైలర్‌ను థియేటర్లలో రిలీజ్ చేశాం అని దర్శకుడు వేణు శ్రీరాం అన్నారు.

సెట్లో పవన్ కల్యాణ్‌ను చూడగానే
వకీల్ సాబ్‌గా పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేయడం హ్యాపీగా ఉంది. ఇది ఛాలెంజ్‌గానో లేదా ఒత్తిడిగానో తీసుకోలేదు. నాకు ఓ జాబ్ ఇచ్చారు. దానిని అద్భుతంగా తీర్చి దిద్ది ప్రేక్షకులను మెప్పించేలా సినిమాను తయారు చేశాం. ప్రతీ సినిమాకు ప్రతీ డైరెక్టర్‌కు ఉండే ఒత్తిళ్లే నాకు లభించాయి. పవన్ కల్యాణ్‌ను సెట్లో చూడగానే వచ్చే స్మైల్‌తో అన్ని మరిచిపోయాను అని వేణు శ్రీరాం పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు తగినట్టుగా
పింక్ సినిమాలో మార్పులు చేసిన తీరును ఒకేసారి చెప్పలేదు. పలు దఫాలుగా కలిసి కథను నేరేట్ చేశాను. కథకు, పవన్ కల్యాణ్ క్రేజ్‌కు అవసరమయ్యే మార్పులనే చేశాం. ట్రైలర్ చూస్తే మీకు కథ ఏమిటో తెలుస్తుంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోసం మరింత రీచ్ ఉండేలా కొన్ని మార్పులు చేశాం అని వేణు శ్రీరాం తెలిపారు.

స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకొని
పింక్ సినిమా తమిళంలో రీమేక్ చేసినప్పుడు అజిత్ తగినట్టుగా మార్పులు చేశారు. కమర్షియల్ అంశాలను జోడించారు. ఇక్కడ పవన్ కల్యాణ్ చేస్తున్నప్పడు ఆయన స్టార్‌డమ్‌కు తగినట్టుగా మార్పులు చేశాం. కమర్షియల్ అంశాలను ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మార్చాం అని వేణు శ్రీరాం చెప్పారు.

ఆ టైటిల్ పెడుదామని అనుకొన్నాం
వకీల్ సాబ్ టైటిల్ పెట్టాలనుకొన్నప్పుడు చాలా ఆలోచించాం. లాయర్ సాబ్ టైటిల్ పెట్టాలా? లేదా వకీల్ సాబ్ టైటిల్ పెట్టాలా? అని ఆలోచించాం. ఈ రెండు టైటిల్స్‌కు ముందు మగువ.. లోకానికి నీ విలువ తెలుసా అనే టైటిల్ గురించి ఆలోచించాం. కానీ ట్రేడ్, ఫ్యాన్స్ నిరాశపరిచవద్దని వకీల్ సాబ్ టైటిల్‌ను ఖరారు చేశాం అని వేణు శ్రీరాం వెల్లడించారు.


Click it and Unblock the Notifications











