నా టార్గెట్ అదే.. నా తండ్రి ఆఫర్‌ను రిజెక్ట్.. అమ్మను మూడుసార్లు.. వరలక్ష్మీ
తమిళ సూపర్‌స్టార్ శరత్ కుమార్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి వరలక్ష్మీ ప్రవేశించారు. ఆ తర్వాత నటిగా అంచెలంచెలుగా ఎదుగుతూ విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా ఆమె సర్కార్ సినిమాలో విజయ్ సరసన నటించారు. ఆ చిత్రం దీపావళీ కానుకగా విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో ఆమె తన వ్యక్తిగత విషయాలను, భవిష్యత్‌లో తీసుకొనే నిర్ణయాలను వెల్లడించారు. వరలక్ష్మీ చెప్పిన విషయాలు ఏమిటంటే..

నా అడుగులు పాలిటిక్స్ వైపే
నా యాక్టింగ్ కెరీర్‌ను పక్కన పెడితే .. వచ్చే ఐదేళ్లలో నా అడుగులు రాజకీయాల వైపే పడుతాయి. నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం. ఏ విషయంపైనైనా భయపడకుండా మాట్లాడే వాయిస్ నాకు ఉంది. సమస్యలపై స్పందించే గుణం ఉంది. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకొంటున్నారు. పాలిటిక్స్ చెడు అని మనలాంటోలు అనుకొంటే ఇంకా ఎవరు వాస్తారు అని వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నారు.

ఏ పార్టీలోనూ చేరను
నేను ఏ పార్టీలో చేరను. నా తండ్రి స్థాపించిన పార్టీలో కూడా చేరను. రాజకీయాల్లోకి రావాలని నా ఫాదర్ నన్ను కోరారు. అయితే నేను చేరను అని చెప్పాను. రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు. భయమనేది లేకుండా ఉండే ప్రతీ ఒక్కరు రాజకీయాల్లోకి రావాలి. పాలిటిక్స్ అంటే భయపడకూడదు. కమల్, రజనీల్లో ఎవరు బెటర్ అనేది వారి మాటలను బట్టికాకుండా చేతలను బట్టి తెలుస్తుంది.

జయలలిత వారసురాలిగా
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత వారసురాలిగా నేను రాజకీయాల్లోకి ప్రవేశిస్తాను. ఓ మహిళగా, విద్యావేత్తగా తమిళనాడు రాష్ట్రాన్ని చక్కగా పాలిచ్చింది. అమ్మ అంటే నాకు ఇష్టం. సేవ విషయంలో ఆమె నాకు స్ఫూర్తి. నా జీవితంలో అమ్మను మూడుసార్లు కలిసే అదృష్టం కలిగింది. ఆమెను కలిసిన ప్రతీసారి నన్ను గుర్తుపట్టింది. చక్కగా మాట్లాడింది.

సమయమే సమాధానం చెబుతుంది
జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతున్నది. ఆ స్థితిని నుంచి బయటపడేసే రాజకీయ నేతల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. జయలలిత స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఎన్నికల సమయంలో ప్రజలు తీసుకునే నిర్ణయం, వారు వేసే ఓటు ద్వారా నిర్ణయించబడుతుంది. సమయమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ఆ సమయం కోసం అందరం వేచి చూడాలి అని చెప్పింది.


Click it and Unblock the Notifications











