విశాల్‌తో డేటింగ్ చేయడం లేదు.. అతడిని వివాహం చేసుకోను.. ఎందుకంటే..

Recommended Video

Varalaxmi Sarathkumar Shares Her Experiences

తమిళ సూపర్‌స్టార్ శరత్ కుమార్ కూతురిగా వరలక్ష్మీ శరత్ కుమార్ దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితులు. 2012లో కెరీర్ ప్రారంభించిన వరలక్ష్మీ తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించారు. తాజాగా పందెంకోడి2 సినిమాలో విలన్‌గా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత విజయ్ కలిసి నటించిన సర్కార్ మూవీ రిలీజ్‌కు సిద్దమైంది. సర్కార్ విడుదల నేపథ్యంలో వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. సర్కార్ సినిమా, విశాల్‌తో పెళ్లి గురించి వరలక్ష్మీ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

తెలుగులో చేయకపోవడానికి కారణం

తెలుగులో చేయకపోవడానికి కారణం

తమిళంలోనే ఎక్కువ అవకాశాలు రావడంతో తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నాను. పందెంకోడి2 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాను. వెంటనే సర్కార్ సినిమాతో టాలీవుడ్‌లో కనిపించే ఛాన్స్ లభించింది. టాలీవుడ్‌లో నా ఎంట్రీ విషయంలో నా టైం మొదలైందని అనుకొంటున్నాను.

నాకు కథలు నచ్చలేదు

నాకు కథలు నచ్చలేదు

గతంలో చాలా తెలుగు కథలు నా వద్దకు వచ్చాయి. కాకపోతే నాకు పెద్దగా నచ్చలేదు. తమిళంలో నేను చాలా విభిన్నమైన చిత్రాలు చేశాను. నా కెరీర్ గ్రాఫ్ చూస్తే కథలు, క్వాలిటీ ఉన్న సినిమాలకు నేను ప్రాధాన్యం ఇస్తాను. అందుకే టాలీవుడ్‌లో కనిపించలేదు.

సర్కార్ మూవీలో నా పాత్ర ఏమిటంటే

సర్కార్ మూవీలో నా పాత్ర ఏమిటంటే

నాకు హీరోయిన్ పాత్రలే చేయాలనే రూల్ పెట్టుకోలేదు. యాక్టరంటే అన్ని పాత్రలు చేయాలి. అప్పుడే ఓ గౌరవం లభిస్తుంది. పందెంకోడి2 చిత్రంలో విలన్‌గా నటించాను. సర్కార్‌లో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న రాజకీయ నేత పాత్రలో కనిపిస్తాను. పందెంకోడి2 చిత్రంలోని భవానీ పాత్ర మాదిరిగానే ఈ పాత్రను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది.

సర్కార్ మూవీ పొలిటికల్ థ్రిల్లర్

సర్కార్ మూవీ పొలిటికల్ థ్రిల్లర్

సర్కార్ సినిమా బిజినెస్, రాజకీయ నేతల మధ్య జరిగే సన్నివేశాల ఆధారంగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్. సినిమా కథ, పాత్రలు చాలా బలంగా ఉంటాయి. నేను ఇంకా సినిమా పూర్తిగా చూడలేదు. సాధారణంగా నేను ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లలో చూస్తాను. నా పాత్ర వరకు నా సన్నివేశాలు చూశాను. ఓటు ప్రాధాన్యం చెప్పే సినిమా ఇది. తప్పకుండా ప్రేక్షకులు మా సినిమా ప్రాధాన్యతను గుర్తిస్తారని అనుకొంటున్నా. ఈ సినిమాలో నా పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుంది.

 నా టైమ్ మొదలైందని

నా టైమ్ మొదలైందని

ఆరేళ్లకుపైగా కెరీర్‌లో తక్కువ సినిమాలు చేయడానికి ప్రత్యేకమైన కారణం లేదు. ప్రతీ మనిషికి టైం, అదృష్టం ఉంటుంది. దానిని బట్టే జీవితంలో ఏదైనా జరుగుతుందని భావిస్తున్నా. ఇప్పుడు నా టైం మొదలైందని అనుకొంటున్నాను. యాక్టర్‌గా ఎదగడానికి నా తండ్రి పేరును ఎక్కడా ఉపయోగించుకోలేదు. కాకపోతే శరత్ కుమార్ తండ్రి కావడం గర్వంగా ఫీలవుతాను. తమిళంలో మేమిద్దరం కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నాం.

విశాల్‌తో పెళ్లా?

విశాల్‌తో పెళ్లా?

విశాల్‌తో పెళ్లి ఎప్పుడని అందరూ నన్ను అడుగుతున్నారు. వాస్తవానికి నేను విశాల్‌తో నేను డేటింగ్ చేయడం లేదు. మా మధ్య లవ్ అఫైర్ లేదు. కేవలం మేమిద్దరం గుడ్ ఫ్రెండ్స్. మా ఇద్దరి మధ్య ప్రత్యేకమైన రిలేషన్ ఉంది. ఆయన పెళ్లి చేసుకోవాలనుకొంటే చేసుకోమని చెప్పండి. నేను ఆయన పెళ్లి చేయలేను.

విశాల్‌ను పెళ్లి చేసుకోను

విశాల్‌ను పెళ్లి చేసుకోను

మీరెవరైనా పెళ్లి కూతురు చూస్తే చెప్పండి. విశాల్ పెళ్లి జరిగితే నేను హ్యాపీగా ఫీలవుతాను. మా ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ కంటే ఎక్కువ ఏమీ లేదు. అతడు ఏవరినైనా ప్రేమిస్తే నాకు ఇంకా హ్యాపీ. మేమిద్దరం చాలా విషయాలు షేర్ చేసుకొంటాం. ఒక్క క్లియర్‌గా చెప్పాలనుకున్నదేమిటంటే.. నేను ఎట్టి పరిస్థితుల్లో విశాల్‌ను పెళ్లి చేసుకోను అని వరలక్ష్మీ శరత్ కుమార్ స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X