లైంగిక వేధింపులకు గురయ్యా.. వారికి గజగజ వణుకు.. ఒకడువచ్చి.. వరలక్ష్మీ
తమిళ చిత్ర పరిశ్రమను మీ టూ ఉద్యమం కుదిపేస్తున్నది. గాయని చిన్మయి, శృతిహరిహరన్, అమలాపాల్ తదితర యాక్టర్లు తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. దాంతో ఇండస్ట్రీలో చీకటి వ్యవహారం వెలుగు చూసింది. తమిళ పరిశ్రమలో సంచలనంగా మారిన అంశాన్ని నటి వరలక్ష్మీ శరత్ కుమార్ దృష్టికి తీసుకురాగా ఆమె తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం సర్కార్ సినిమా రిలీజ్ నేపథ్యంలో వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

బాల్యంలో నాపై లైంగిక వేధింపులు
నిజం మాట్లాడటం వల్లే నాకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. తప్పైతే తప్పు అంటాను. నిజం ఉంటే రైట్ అని చెబుతాను. బాల్యంలో లైంగిక దాడికి గురయ్యాను. అలాంటి దాడి మరొకరికి జరుగకుండా నేను బలంగా మాట్లాడాలని అనుకొంటాను. ఈ రోజుల్లో తల్లీదండ్రులు బిజీగా ఉండటం వల్ల పిల్లలకు ఏం జరుగుతుందో తెలియడం లేదు. నాపై జరిగిన లైంగిక దాడి గురించి నా తల్లిదండ్రులకు పదేళ్ల తర్వాత తెలిసింది.

రెండేళ్ల క్రితమే మాట్లాడా
తమిళ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఊపందుకోవడంపై స్పందిస్తూ.. నేను రెండేళ్ల క్రితమే మాట్లాడాను. ఓ నిర్మాత ఇంటికి వచ్చి వేరే విషయాలు బయట మాట్లాడాలనుకొంటునని నసిగాడు. దాంతో నేను వెంటనే ‘వేరే విషయాలంటే ఏమిటి? ఐస్ క్రీమ్ లాంటివి ఏమైనా కావాలా?' అని నిలదీశాను. దాంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా నాలా గట్టిగా మాట్లాడితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు అని వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నారు.

మీటూ ఉద్యమంతో భయం
రెండేళ్ల క్రితం హాలీవుడ్‌లో మీటూ మూవ్‌మెంట్ ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని తప్పుగా అర్ధం చేసుకొంటున్నారు. ప్రధానంగా ఈ ఉద్యమ లక్ష్యం ఏమిటంటే.. ఎవరి చేతనైతే అన్యాయానికి గురయ్యామో.. వారి ప్రతిష్టను, పరువును తీయడమే'. మీటూ ఉద్యమం వల్ల చాలా మంది నోరు విప్పడం లేదు. కొంతమంది తమ పేర్లు బయటకు వస్తాయోననే భయంతో వణికిపోతున్నారు.

మీటూతో సమస్యలకు పరిష్కారం
మీటూ ఉద్యమం వల్ల దాని ఉద్దేశం నెరవేరుతున్నది. చాలా మంది ఇలాంటి ప్రవర్తనను మానుకొంటున్నారు. ఇలాంటి విషయాల్లో వ్యక్తుల బ్యాక్‌గ్రౌండ్ కూడా పనిచేయదు. యాక్టింగ్ అనేది ఓ ఉద్యోగం లాంటిది. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు ఎలా వెళ్తావో అలానే పాత్రల కోసం ఆడిషన్‌కు వెళ్లాలి.

మరో జనరేషన్ ఇబ్బంది పడొద్దు
సినీ పరిశ్రమలో ఇలాంటి జాడ్యం ఈ జనరేషన్‌తో ఆగిపోవాలి. మీటూ ఉద్యమం అందుకు సహకారం అందించాలి. భవిష్యత్‌లో మరే అమ్మాయి గానీ, అబ్బాయి గానీ ఇండస్ట్రీకి వచ్చి భయపడకూడదు. లైంగిక వేధింపులకు గురిచేయాలనే ఆలోచన రాకుండా మీటూ ఉద్యమం బలపడాలి అని వరలక్ష్మీ శరత్‌కుమార్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











