twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరూ నవ్వినా కూడా ప్రయత్నించాను.. వర్ష బొల్లమ్మ కామెంట్స్ వైరల్

    |

    96 సినిమాతో వర్ష బొల్లమ్మ తమిళ, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తరువాత బిగిల్ (విజిల్) చిత్రంలో నటించి మెప్పించింది. ఇలా ఎప్పడూ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన వర్ష.. ఈ మధ్య తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ బిజీ అవుతోంది. చూసీ చూడంగానే అనే చిత్రంతో తెలుగు చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో పలకరించింది. ఈ సినిమా తెలుగు చిత్ర సీమలో మంచి గుర్తింపును తెచ్చుకుంది.

    Recommended Video

    Varsha Bollamma Chit Chat About Middle Class Melodies Movie

    అయితే వర్ష బొల్లమ్మ తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం, తెలుగు స్పష్టంగా మాట్లాడటంపై అందరూ షాక్ అవుతున్నారు. ఇంత త్వరగా తెలుగు నేర్చుకోవడం ఎలా సాధ్యమైందన్న విషయాలను ఫిల్మీ బీట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్ష చెప్పుకొచ్చింది. పుట్టింది కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలోనైనా.. తాను తెలుగమ్మాయిలానే కనిపిస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక తెలుగు మాట్లాడే విషయంపైనా స్పందించింది.

     Varsha Bollamma About Telugu Language

    నాకు అంతగా తెలుగు భాష రాదు ఇంకా నేర్చుకుంటున్నాను.. నా డ్రైవర్ అన్న , నా మేకప్ అన్నతో తెలుగులోనే మాట్లాడుతుంటాను.. నా తెలుగు చూసి నవ్వుకుంటున్నా సరే నేను మాట్లాడుతూనే ఉంటాను.. అలా నాకు తెలుగు అలవాటు అవుతోంది.. గుంటూరు యాస మొదట్లో ఇబ్బంది అని అనుకున్నాను కానీ సులభంగానే వచ్చేసింది అని వర్ష బొల్లమ్మ పేర్కొంది. మొత్తానికి ఈ చిత్రంతో ఆనంద్ దేవరకొండ, వర్షలకు మంచి పేరు వచ్చింది

    English summary
    Varsha Bollamma About Telugu Language, 96
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X