Varsha Bollamma నాతో హీరో గణేష్‌కు ఆ అవసరం లేకపోయింది.. వర్ష బొల్లమ్మ (ఇంటర్వ్యూ)

స్వాతిముత్యం చిత్రంలో గణేష్ పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. సినిమాలో పాత్రల పరంగా చూస్తే నా పాత్ర కొంచెం డామినేటింగ్ గా ఉంటుంది అని వర్ష బొల్లమ్మ తెలిపారు. బెల్లంకొండ గణేష్, దర్శకుడు లక్ష్మన్ కే కృష్ణ తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ నిర్మించిన స్వాతిముత్యం సినిమా అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వర్ష బొల్లమ్మ మీడియాతో మాట్లాడుతూ..

స్కూల్ టీచర్‌ పాత్రలో

స్కూల్ టీచర్‌ పాత్రలో


భాగ్యలక్ష్మీ క్యారెక్టర్‌లో స్కూల్ టీచర్‌గా నటిస్తున్నాను. కథ చెప్పడానికి ముందు సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సినిమా అని చెప్పారు. కథ విన్న తర్వాత నాకు బాగా నచ్చడంతో నేను వెంటనే ఒకే చెప్పాను. ఒక చిన్న టౌన్‌లో జరిగే ఫ్యామిలీ కథ. కథలో ఫ్రెష్‌నెస్ ఉంటుంది. మనచుట్టూ జరిగే కథలాగా ఉంటుంది. ఒక ఊర్లో ఎదైనా చిన్న విషయం జరిగినా పెద్దగా చర్చ జరుగుతుంది. అలాంటి చిన్న పాయింట్ ఆధారంగా కథ నడుస్తుంది.

స్వాతిముత్యం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

స్వాతిముత్యం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్


స్కూల్ టీచర్‌ పాత్రకు పెద్దగా రెఫరెన్స్ తీసుకోలేదు. చిన్న పిల్లలతో నేను చాలా స్ట్క్రిక్టుగా ఉండటం అనే పాయింట్‌తో నేచురల్‌గా నటించాను. ప్రతీ ఫ్యామిలీలో జరిగే సంఘటనల ఆధారంగా కథ నడస్తుంది. కాకపోతే కథను నడిపించే ట్విస్టు.. చాలా సీరియస్‌గా ఉంటుంది. సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌ ఉంటుంది. మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమాతో ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు వస్తున్నాయి అని వర్ష బొల్లమ్మ చెప్పారు.

సెకండాఫ్‌లో చాలా సీరియస్‌గా

సెకండాఫ్‌లో చాలా సీరియస్‌గా


భాగ్యలక్ష్మీ పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. సెకండాఫ్‌లో నా క్యారెక్టర్ చాలా సీరియస్‌గా ఉంటుంది. కథలో ఉండే కాన్‌ఫ్లిక్ట్ కారణంగా నా పాత్ర స్వభావం మారిపోతుంది. ఇక డైరెక్టర్ లక్ష్మణ్‌ నిజాయితీతో కూడిన వ్యక్తి. ఊరు నుంచి వచ్చిన వ్యక్తుల్లో ఉండే నిజాయితీ, అమాయకత్వం అతడిలో కనిపించింది. మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమా దర్శకుడిగా మాదిరిగానే మంచి టాలెంటెడ్. ఆయన రైటింగ్ బాగుంది అని వర్ష బొల్లమ్మ చెప్పింది.

గణేష్ జూనియర్ అయినప్పటికి..

గణేష్ జూనియర్ అయినప్పటికి..

గతంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్, ఇప్పుడు బెల్లకొండ శ్రీను సొదరుడు గణేష్‌తో నటించాను. ఇలా హీరోల సోదరులతో నటించడమనేది అలా జరిగిపోతున్నది. ఇవి ప్లాన్ చేసి సినిమాలు కాదు. నన్ను కూడా అదే విషయాన్ని అడుగుతున్నారు. అయితే ఈ సినిమాకు ముందు గణేష్ జూనియర్ అనుకొన్నాను. అవసరమైతే ఏవైనా సలహాలు ఇవ్వొచ్చని అనుకొన్నాను. కానీ ఆ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే.. గణేష్ నాన్న గారు నిర్మాత.. వాళ్ల సినిమాల్లో ఆయనకు సెట్లో ఉండే అనుభవం ఉంది. అందుచేత నటనపరంగా గణేష్‌కు ఆ ఇబ్బంది లేకపోయింది అని వర్ష చెప్పారు.

ఫెర్ఫార్మర్‌ అనిపించుకోవాలి..

ఫెర్ఫార్మర్‌ అనిపించుకోవాలి..

నాకు కెరీర్‌ పరంగా టాప్ హీరోయిన్ అనిపించుకోవడం కంటే.. వర్ష బొల్లమ్మ ఫెర్ఫార్మెన్స్ అనిపించుకోవడమే ఇష్టం. నేను భారీ లక్ష్యాలను పెట్టుకోవడం లేదు. మంచి పాత్రలు వస్తే చేయాలని అనుకొంటున్నాను. మిడిల్ క్లాస్ మెలోడిస్ తర్వాత అలాంటి స్క్రిప్టులే వస్తున్నాయి. కానీ నేను నటించిన సినిమాల్లో నా ఫెర్ఫార్మెన్స్‌ గురించి మాట్లాడుకొంటే చాలూ. అని వర్ష బొల్లమ్మ తెలిపింది.

సితార బ్యానర్‌లో అలాంటి విలువలు

సితార బ్యానర్‌లో అలాంటి విలువలు


సితార లాంటి బ్యానర్‌లో పనిచేయాలని అందరికీ ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ గౌరవం ఇస్తారు. మేకప్ మ్యాన్, లైట్ బాయ్ ఇలా అందరికీ వెంటనే డబ్బులు ఇస్తారు. నేను సినిమా చేయకముందే సితార గురించి గొప్పగా విన్నాను. సినిమా చేస్తున్నప్పుడు అది నిజమని అర్థమైంది. సితార బ్యానర్‌లో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X